Ajit Agarkar: నా పదవీకాలం పొడిగించండి.. బీసీసీఐని కోరిన అజిత్ అగార్కర్!
- నా పదవీకాలం పొడిగించండి
- బీసీసీఐని కోరిన అజిత్ అగార్కర్
- ఐపీఎల్ 2025కు ముందు కాంట్రాక్ట్ పొడిగింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీమిండియా చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ తన పదవీకాలాన్ని పొడిగించాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)ను కోరినట్లు సమాచారం. పదవీకాలాన్ని 2027 వన్డే వరల్డ్ కప్ వరకు పొడిగించాలని కోరినట్లుగా వార్తలు వస్తున్నాయి. టీ20 వరల్డ్ కప్ 2026ను భారత్ గెలిచిన వెంటనే అగార్కర్ ఈ మేరకు బీసీసీఐని అభ్యర్థించినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై బీసీసీఐలో చర్చలు జరుగుతున్నాయట. అయితే ఇప్పటివరకు ఈ విషయంపై బీసీసీఐ, అగార్కర్ కానీ అధికారికంగా ధ్రువీకరించలేదు.
ఇప్పటికే ఐపీఎల్ 2025కు ముందు అజిత్ అగార్కర్ కాంట్రాక్ట్‌ను మరో ఏడాది పాటు బీసీసీఐ పొడిగించింది. భారత్ 2024 టీ20 వరల్డ్ కప్, 2025 ఛాంపియన్స్ ట్రోఫీ గెలవడంలో అతని పాత్రను గుర్తిస్తూ ఈ నిర్ణయం తీసుకుంది. తాజాగా టీ20 వరల్డ్ కప్ 2026 విజయం అనంతరం అగార్కర్ తన అభ్యర్థనను బీసీసీఐ ముందుంచాడట. 2020-21లో చీఫ్ సెలెక్టర్ పదవి ఖాళీ అయినప్పుడు అగార్కర్ కూడా దరఖాస్తు చేసుకున్నప్పటికీ.. ఆ అవకాశం చెతన్ శర్మకు దక్కింది. 2023 మధ్యలో అగార్కర్ బాధ్యతలు చేపట్టాడు. అప్పటి నుంచి సెలెక్షన్ ప్రక్రియ ఆయనకు పెద్ద సవాల్‌గా మారింది.
Also Read
- India vs West Indies 4th T20: షాయ్ హోప్, రూథర్‌ఫోర్డ్ విధ్వంసక ఇన్నింగ్స్.. భారత్ ముందు భారీ లక్ష్యం
- SRHకి నటరాజన్ రీఎంట్రీ.. రూ.10.75 కోట్ల నుంచి రూ.5 కోట్లకు తగ్గి మరీ..!
- India vs West Indies 4th T20: భారత్ vs వెస్టిండీస్ 4th T20I.. టాస్ గెలిచిన భారత్.. సిరీస్‌పై కన్ను
- Sahibzada Farhan: అభిషేక్ శర్మ, విరాట్ కోహ్లీ రికార్డులు బద్దలు.. పాకిస్థాన్ కొత్త కెప్టెన్ వీర విహారం..
అజిత్ అగార్కర్ పదవీకాలంలో భారత జట్టు నాలుగు ఐసీసీ ఫైనల్స్ ఆడింది. 2023 వన్డే వరల్డ్ కప్, 2024 టీ20 వరల్డ్ కప్, 2025 ఛాంపియన్స్ ట్రోఫీ, 2026 టీ20 వరల్డ్ కప్ ఫైనల్స్‌లో భారత్ ఆడింది. వీటిలో మూడు టైటిళ్లు గెలుచుకోవడం విశేషం. అగార్కర్ తీసుకున్న కొన్ని కీలక నిర్ణయాలు క్రికెట్ వర్గాల్లో పెద్ద చర్చకు దారి తీశాయి. ముఖ్యంగా హార్దిక్ పాండ్యా స్థానంలో సూర్యకుమార్ యాదవ్‌ను టీ20 కెప్టెన్‌గా మద్దతు ఇవ్వడం, అలాగే రోహిత్ శర్మను వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించడం వంటి నిర్ణయాలు ధైర్యసాహసాలతో కూడినవిగా చెప్పాలి. ఈ నిర్ణయాలపై విమర్శలు వచ్చినప్పటికీ.. అగార్కర్ వాటిని సమర్థంగా ఎదుర్కొన్నారు.
జట్టు ఎంపిక అనేది కేవలం గణాంకాలపై ఆధారపడే ప్రక్రియ కాదు. ఆటగాళ్ల సామర్థ్యం, జట్టులో వారి పాత్ర, వ్యూహాత్మక ఆలోచనలన్నీ కలిసి నిర్ణయాలను ప్రభావితం చేస్తాయి. ఈ విషయంలో అగార్కర్, అతని సెలెక్షన్ కమిటీ సక్సెస్ అయినట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మొత్తంగా చూస్తే.. అగార్కర్ నాయకత్వంలో భారత క్రికెట్ జట్టు వైట్ బాల్ ఫార్మాట్‌లో మంచి ఫలితాలు సాధించింది. ఈ నేపథ్యంలో ఆయన పదవీకాలాన్ని 2027 వరల్డ్ కప్ వరకు పొడిగిస్తారా లేదా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
తాజావార్తలు
-
CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
-
AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
-
OTR: పవన్ పట్టు.. బాబు వ్యూహం.. ఎవరికి ఎన్ని సీట్లు?
-
Dada: బాలయ్య ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్… హైదరాబాద్‌లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
-
Acer Sospiro A70 5G: Acer కొత్త 5G ఫోన్ లాంచ్.. డ్యుయల్ డిస్ప్లేలు, 20GB RAM, 64MP కెమెరా!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..