Rishab Shetty : రిషబ్ శెట్టి..హోంబలే మధ్య విభేదాలు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కన్నడ చిత్ర పరిశ్రమలోనే కాకుండా భారతీయ సినిమా చరిత్రలో ‘కాంతార’ ఒక సంచలనం, ఈ సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న నటుడు, దర్శకుడు రిషబ్ శెట్టి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారారు. రిషబ్ శెట్టి తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుండి హొంబాలే ఫిల్మ్స్ నిర్మాణ సంస్థను, ‘కాంతార’ అఫీషియల్ పేజీని అన్‌ఫాలో చేయడం ఇప్పుడు నెట్టింట పెద్ద దుమారాన్నే రేపుతోంది. సాధారణంగా ఒక సినిమా హిట్ అయినప్పుడు ఆ నిర్మాణ సంస్థతో హీరోలకు అనుబంధం పెరుగుతుంది. కానీ, తన కెరీర్‌లోనే మైలురాయిగా నిలిచిన సినిమా పేజీని అన్‌ఫాలో చేయడం వెనుక ఏదైనా బలమైన కారణం ఉందా? అని అభిమానులు చర్చించుకుంటున్నారు.
Also Read: Chiranjeevi : మెగాస్టార్ సంచలన నిర్ణయం.. త్వరలో అధికారిక ప్రకటన
Also Read
- Srinidhi Shetty: "కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు.." శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
- Sardar 2 OTT: ఓటీటీలో 'సర్దార్ 2' ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
- Janhvi Kapoor: వీడియోలు లైంగిక దాడితో సమానం": జాన్వీ కపూర్ సంచలన పోస్ట్
- Ranabaali : ‘రణబాలి’ టికెట్ రేట్ల పెంపు వివాదం: అసలు నిజం బయటపెట్టిన మేకర్స్
రిషబ్ తీసుకున్న ఈ నిర్ణయం వెనుక నిర్మాణ సంస్థతో ఏవైనా విభేదాలు తలెత్తాయా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంపై రిషబ్ శెట్టి కానీ, హొంబాలే ఫిల్మ్స్ కానీ ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. ‘కాంతార 2’ కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ అయి తరువాతి పార్ట్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న తరుణంలో ఇలాంటి పరిణామాలు చోటు చేసుకోవడం అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది. కొందరు దీనిని ఒక సాధారణ విషయంగా కొట్టిపారేస్తున్నారు. సెలబ్రిటీలు అప్పుడప్పుడు తమ సోషల్ మీడియా ఖాతాలను ‘క్లీన్’ చేస్తుంటారని, అనవసరమైన పేజీలను అన్‌ఫాలో చేయడం సాధారణమేనని వాదిస్తున్నారు. అయితే, తన సొంత సినిమా పేజీని అన్‌ఫాలో చేయడం మాత్రం అంత చిన్న విషయమేమీ కాదని మెజారిటీ నెటిజన్ల అభిప్రాయం. అయితే ఒకవేళ నిజంగానే రిషబ్ శెట్టికి, హొంబాలే ఫిల్మ్స్‌కు మధ్య ఏదైనా గ్యాప్ వస్తే అది ‘కాంతార’ తదుపరి భాగాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!