Chiranjeevi : మెగాస్టార్ సంచలన నిర్ణయం.. త్వరలో అధికారిక ప్రకటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వెండితెరపైనే కాదు, నిజజీవితంలోనూ తాను ‘అందరివాడు’ అని మెగాస్టార్ చిరంజీవి మరోసారి నిరూపించుకున్నారు, దశాబ్దాలుగా బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ ద్వారా లక్షలాది మందికి ప్రాణదాతగా నిలిచిన ఆయన, ఇప్పుడు అక్షర సాయంతో పేదరికంపై పోరాడేందుకు సిద్ధమయ్యారు. ఉగాది పర్వదినం సందర్భంగా చిరంజీవి ‘ఉచిత విద్యా ప్రాజెక్ట్’ అంటూ ఇచ్చిన హింట్ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది.తాజాగా ఒక ఛానల్ కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మెగాస్టార్ ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. “నేను రక్తదానాన్నే శ్వాసగా మార్చుకున్న తరుణంలో నన్ను స్ఫూర్తిగా తీసుకుని తమిళ నటుడు సూర్య ‘అగరం ఫౌండేషన్’ను ప్రారంభించారు. వందలాది మంది పేద విద్యార్థులను ఆయన చదివిస్తున్నారు. ఇప్పుడు అదే సూర్య నుంచి నేను స్ఫూర్తి పొందుతున్నాను. పేద ప్రజలకు నాణ్యమైన విద్యను ఉచితంగా అందించే దిశగా అడుగులు వేస్తున్నాను” అని చిరంజీవి ప్రకటించారు.
Also Read:Dhurandhar 2 : ప్రీమియర్స్’తో షేక్ చేయనున్న దురంధర్ 2
Also Read
- Nani: "18 ఏళ్ల కెరీర్.. 33 సినిమాలు.. ఇలాంటిది ఎప్పుడూ చూడలేదు" ది ప్యారడైజ్ టాక్‌పై నాని ఓపెన్ రియాక్షన్!
- Jailer 2: రజినీ 'జైలర్ 2' బిజినెస్‌పై ట్రేడ్ షాక్! ఏకంగా 4 రెట్లు పెరిగిన రేటు..
- Suriya: ఆ హీరో వివాదం వేళ.. సోషల్ మీడియా ట్రోలింగ్‌పై ఫ్యాన్స్‌కి హితవు పలికి సూర్య!
- Venkatesh: "20 ఏళ్ల తర్వాత మళ్లీ త్రివిక్రమ్‌తో .. పెళ్లికాని ప్రసాద్ కాలం పోయింది"
ఈ ఉచిత విద్యా కార్యక్రమం కేవలం తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాకుండా, ఎక్కడ అవసరముంటే అక్కడ అండగా నిలవాలని ఆయన సంకల్పించారు. రక్తదానం ప్రాణాలను కాపాడితే, విద్య ఒక తరం భవిష్యత్తునే మారుస్తుందని మెగాస్టార్ బలంగా నమ్ముతున్నారు. ఈ ప్రాజెక్ట్ రూపకల్పన, విధివిధానాల గురించి త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు. ‘అగరం’ తరహాలో మెగాస్టార్ ప్రారంభించబోయే ఈ విద్యా సంస్థ ద్వారా వేలాది మంది పేద విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నిండటం ఖాయం. సమాజ హితం కోరే ఈ మహాత్కార్యానికి అప్పుడే సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
Beyond cinema, a heart that beats for society ❤️
On this Ugadi, Megastar Chiranjeevi garu announced that his next noble initiative will be
“to provide free education to the underprivileged.”A true Megastar who continues to inspire by giving back to society 🙏#Chiranjeevi… pic.twitter.com/p2DLI1JiH8
— Team Megastar (@MegaStaroffl) March 19, 2026
తాజావార్తలు
-
BAR Tender: తెలంగాణలో 41 కొత్త బార్లు.. దరఖాస్తులకు నోటిఫికేషన్
-
Shai Hope: మమ్మల్ని దారుణంగా ముంచేశారు.. ఇలా ఆడతారని అస్సలు ఊహించలేదు: వెస్టిండీస్ కెప్టెన్
-
Nani: “18 ఏళ్ల కెరీర్.. 33 సినిమాలు.. ఇలాంటిది ఎప్పుడూ చూడలేదు” ది ప్యారడైజ్ టాక్‌పై నాని ఓపెన్ రియాక్షన్!
-
Ind Vs WI: కోహ్లీ, గిల్ మానియా.. 295 రన్స్ ఉఫ్.. భారత్ ఘన విజయం..
-
LPU Students Protest: పంజాబ్ LPUలో ఆరని మంటలు.. స్టూడెంట్స్, పోలీసుల మధ్య ఉద్రిక్తత..
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?