iPhone 17e.. చౌకగా అత్యుత్తమ స్మార్ట్‌ఫోన్.. పనితీరు ఎలా ఉందంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
iPhone 17e: యాపిల్ సంస్థ తయరు చేసే ఐఫోన్ కోసం ఎదురుచూసేవాళ్లు ఎంతో మంది ఉంటారు.. ఐఫోన్ మార్కెట్‌లోకి వచ్చిందంటే చాలు.. రోజులు, గంటల తరబడి.. క్యూలైన్‌లో నిలబడి ఫోన్ అందుకున్న తర్వాత ఆనందంతో ఉప్పొంగి పోతారు.. అయితే, ఐఫోన్ అంటేనే.. ఖరీదైనది.. మిడిల్ క్లాస్, లోయర్ క్లాస్ కొనలేదని వెనక్కి తగ్గేవారు కొందరైతే.. ఏదేమైనా ఐఫోన్ కొనాల్సిందే అని పట్టుబట్టి కొనుగోలు చేసేవారే చాలా మంది అని చెప్పాలి.. ఇప్పుడు యాపిల్ కూడా తన పంతా మార్చింది.. iPhone 17e అనేది యాపిల్ ఇటీవల విడుదల చేసిన అత్యంత చౌకైన ఐఫోన్ మోడల్. ఐఫోన్ ఎకోసిస్టమ్‌లోకి అడుగుపెట్టాలనుకునే వారికి ఇది మంచి ఎంపికగా నిలుస్తోంది. దీని పనితీరును ఓసారి పరిశీలిస్తే..
భారతదేశంలో ఈ ఫోన్ ప్రారంభ ధర రూ.64,900 కాగా, బేస్ వేరియంట్ 256GB స్టోరేజ్‌తో అందుబాటులో ఉంది. ఇది గత ఏడాది వచ్చిన iPhone 16e కి అప్‌గ్రేడ్ వెర్షన్.
Also Read
- Flipkart BBD: 6000 mAh బ్యాటరీ.. ఏఐ+ బ్రాండ్‌లో 5 స్మార్ట్ ఫోన్స్.. భారీ డిస్కౌంట్లు..
- iPhone Sales: పండుగల వేళ ఐఫోన్ ప్రియులకు బంపర్ ఆఫర్.. ఐఫోన్ 15, 16, 17లపై ఊహించని తగ్గింపు!
- రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
- 144Hz AMOLED డిస్‌ప్లే, 7,200mAh బ్యాటరీ, ZEISS కెమెరా వ్యవస్థతో Vivo V80 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
డిజైన్ అండ్ డిస్‌ప్లే
ఈ ఫోన్ 6.1 అంగుళాల OLED డిస్‌ప్లేతో వస్తుంది. స్క్రీన్ నాణ్యత చాలా బాగుంది.. రంగులు ప్రకాశవంతంగా, టెక్స్ట్ క్లియర్‌గా కనిపిస్తుంది. అయితే, 60Hz రిఫ్రెష్ రేట్ మాత్రమే ఉండటం కొంచెం నిరాశ కలిగిస్తుంది, ఎందుకంటే ఈ ధరలో అనేక ఆండ్రాయిడ్ ఫోన్‌లు 120Hz అందిస్తున్నాయి. డైనమిక్ ఐలాండ్ లేకపోవడం, పాత నాచ్ డిజైన్ కొనసాగడం వల్ల డిజైన్ కొంచెం పాతదిగా అనిపిస్తుంది.
నిర్మాణ నాణ్యత
అల్యూమినియం ఫ్రేమ్, గ్లాస్ బ్యాక్‌తో ఈ ఫోన్ ప్రీమియం ఫీల్ ఇస్తుంది. సెరామిక్ షీల్డ్ రక్షణతో స్క్రీన్ మరింత బలంగా ఉంటుంది. సుమారు 169 గ్రాముల బరువుతో ఇది తేలికగా, హ్యాండీగా ఉంటుంది. మ్యాగ్‌సేఫ్ సపోర్ట్ తిరిగి రావడం ఒక మంచి ప్లస్ పాయింట్‌గా చెబుతున్నారు..
పనితీరు
ఈ ఫోన్‌లో కొత్త A19 చిప్ ఉంది, ఇది వేగవంతమైన పనితీరును అందిస్తుంది. యాప్‌లు త్వరగా ఓపెన్ అవుతాయి, మల్టీటాస్కింగ్ స్మూత్‌గా ఉంటుంది. iOS 26 తో రావడం వల్ల దీర్ఘకాలిక సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్ కూడా లభించే అవకాశం ఉంది.
కెమెరా
48MP ప్రధాన కెమెరా మంచి ఫోటోలను అందిస్తుంది. డే లైట్‌లో క్లియర్, నేచురల్ కలర్స్ కనిపిస్తాయి.. 2x జూమ్ సపోర్ట్.. 4K డాల్బీ విజన్ వీడియో రికార్డింగ్ ఉంది.. అయితే, అల్ట్రా-వైడ్ కెమెరా లేకపోవడం ఒక లోపం. రాత్రి ఫోటోలు సరే అనిపిస్తాయి.. కానీ డ్యూయల్ కెమెరా ఫోన్‌లతో పోలిస్తే కొంచెం తక్కువగానే చెప్పాలి..
బ్యాటరీ
రోజువారీ వాడకంలో ఒక పూర్తి రోజు సులభంగా పనిచేస్తుంది. తక్కువ వినియోగంలో 2–3 రోజులు కూడా నిలుస్తుంది. USB Type-C ఛార్జింగ్, మ్యాగ్‌సేఫ్ వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి. మొత్తంగా iPhone 17e ఒక మంచి ఎంట్రీ-లెవల్ ఐఫోన్… పనితీరు బలంగా ఉంది.. కెమెరా సరిపడా విధంగానే ఉంది.. ఇక, సాఫ్ట్‌వేర్ అనుభవం అద్భుతంగా చెప్పుకోవాలి.. కానీ, 60Hz స్క్రీన్, ఒకే కెమెరా, పాత డిజైన్.. ఇవీ కొంతమంది వినియోగదారులకు మైనస్ పాయింట్లు కావచ్చు.
తాజావార్తలు
-
INDIA Bloc: రాహుల్ నిరసనకు అఖిలేష్ దూరం.. కాంగ్రెస్-SP మధ్య గ్యాప్?
-
పండుగ పూట EMIల మోత.. హోమ్ లోన్ తీసుకున్నవారిపై భారం ఎంతంటే!+
-
Maharashtra: మహా ఘోరం.. పెట్రోల్ బంక్ సీజ్ చేయడానికి వెళ్లిన అధికారి హత్య
-
Zodiac Signs : రాహు-కేతువుల నక్షత్ర సంచారం.. ఈ 4 రాశుల జాతకులకు అదృష్ట యోగం
-
PM Modi: ‘‘మోడీని దించేందుకు ప్రయత్నిస్తున్నారు’’.. సెర్బియా మాజీ అధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!