Ugadi Special: అరగంటలో ఉగాది ప్రసాదాలు.. హడావిడి లేకుండా ఇలా ఈజీగా చేసేయండి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ugadi Special: ఉగాది పండుగ అనగానే మనందరికీ గుర్తొచ్చేది షడ్రుచుల సమ్మేళనమైన ఉగాది పచ్చడి, నోరూరించే బొబ్బట్లు, మామిడికాయ పులిహోర. అయితే పండుగ రోజు వంటగదిలో గంటల తరబడి గడపకుండా, కేవలం అరగంటలోనే ఈ మూడు ప్రసాదాలను ఎంతో రుచిగా ఎలా తయారు చేసుకోవాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
READ ALSO: Parabhava Nama Samvatsaram: శ్రీ పరాభవ నామ సంవత్సరం అంటే ఏమిటి?.. అర్థం, విశేషాలు, పూర్తి వివరాలు
Also Read
- Pappu Chakodilu: స్వీట్ షాప్ స్టైల్ క్రిస్పీ 'పప్పు చకోడీలు'.. ఇంట్లోనే పర్ఫెక్ట్గా సులువుగా ఇలా తయారు చేసుకోండి.!
- Instant Noodle: ఇన్స్టంట్ నూడుల్స్ తినడంలో భారత్ రికార్డు..! చైనా, జపాన్, వియత్నాం స్థానాలివే..
- Bhindi Health Benefits: బెండకాయ జిగురును చూసి దూరం పెడుతున్నారా? ప్రయోజనాలు తెలిస్తే షాకే..!
- Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
1. షడ్రుచుల ఉగాది పచ్చడి (సాంప్రదాయ పద్ధతిలో..)
కొత్తగా పెళ్లైన వారైనా లేదా వంటరాని వారైనా సరే, ఈ ఉగాదికి పక్కా కొలతలతో ఈ మూడు రెసిపీలను ట్రై చేస్తే ప్రసాదం అదిరిపోవాల్సిందే. ఉగాది పచ్చడిలో ఆరు రుచులు జీవితంలోని కష్టసుఖాలకు ప్రతీక. దీనిని తయారుచేసే విధానం..
కావలసినవి:
చింతపండు రసం (పులుపు), లేత మామిడి ముక్కలు (వగరు), బెల్లం (తీపి), ఉప్పు (ఉప్పు), వేపపూత (చేదు), మిరియాల పొడి (కారం).
తయారీ విధానం..
ఒక గిన్నెలో పల్చటి చింతపండు రసం తీసుకుని, అందులో పైన చెప్పిన పదార్థాలన్నీ కలపాలి. ఈ ఉగాది పచ్చడి మరింత టేస్టీగా, ప్రసాదంలా ఉండాలంటే అందులో అరటిపండు ముక్కలు, పుట్నాల పప్పు, ద్రాక్ష ముక్కలు వేసి చేత్తో లైట్‌గా మెదిపితే చిక్కటి రుచికరమైన పచ్చడి రెడీ అవుతుంది. [01:51]
2. ఇన్స్టంట్ కొబ్బరి బొబ్బట్లు (నేతి బొబ్బట్లు)
సాధారణంగా బొబ్బట్లు అంటే పప్పు నానబెట్టి, ఉడకబెట్టే పెద్ద ప్రాసెస్ ఉంటుంది. కానీ ఈ ఇన్స్టంట్ పద్ధతిలో చాలా త్వరగా చేసుకోవచ్చు.
తయారీ విధానం..
మైదా పిండిలో (గోధుమపిండి కూడా వాడొచ్చు) చిటికెడు ఉప్పు, పసుపు, నూనె వేసి కాస్త జిగురుగా కలుపుకుని అరగంట నానబెట్టాలి. తర్వాత పచ్చి కొబ్బరి ముక్కలు, బెల్లం, యాలకులు కలిపి మెత్తగా గ్రైండ్ చేయాలి. ఈ మిశ్రమాన్ని కొద్దిగా నెయ్యి వేసి పాన్‌లో 5 నిమిషాలు ఉడికిస్తే గట్టిపడుతుంది. నానిన పిండిలో కొబ్బరి పూర్ణం పెట్టి, నూనె రాసిన కవర్ లేదా బటర్ పేపర్ మీద పల్చగా ఒత్తుకుని నెయ్యితో రెండు వైపులా కాల్చుకుంటే కమ్మని నేతి బొబ్బట్లు రెడీ అవుతాయి.
3. ప్రసాదం స్టైల్ మామిడికాయ పులిహోర
మామిడికాయ పులిహోర టేస్ట్ అదిరిపోవాలంటే ఒక చిన్న సీక్రెట్ పొడిని వాడాలి.
సీక్రెట్ పొడి: మెంతులు, జీలకర్ర, మిరియాలు దోరగా వేయించి పొడి చేసి పెట్టుకోవాలి.
తాలింపు: వేరుశనగ గుళ్లు, పప్పులు, అల్లం, పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేయించి, అందులో అరకప్పు మామిడి తురుము వేసి నూనెలో మగ్గించాలి. తర్వాత మగ్గిన మిశ్రమంలో పసుపు, ఇంగువ, ఉప్పు వేసి, ఉడికించిన అన్నం కలపాలి. అన్నం కలిపేటప్పుడు కొద్దిగా పచ్చి మామిడి తురుము, మనం చేసుకున్న సీక్రెట్ పొడి వేస్తే అచ్చం గుడిలో పెట్టే ప్రసాదం రుచి వస్తుంది. ఈ ఉగాదికి పైన చెప్పిన చిట్కాలతో తక్కువ సమయంలోనే రుచికరమైన వంటలు చేసి, కుటుంబ సభ్యులతో కలిసి పండుగను ఆనందంగా జరుపుకోండి. మీకు మీ కుటుంబ సభ్యులకు ఉగాది శుభాకాంక్షలు..
READ ALSO: Singer Mangli: క్షమించండి అంటూ చేతులు జోడించిన మంగ్లీ.. వివాదానికి కారణమైన బూతు పాటపై క్లారిటీ!
తాజావార్తలు
-
Saudi Arabia: ప్రేమకు మరణశిక్ష.. సౌదీ యువరాణి మిషాల్ విషాదగాథ
-
CM Chandrababu Naidu: ఎల్‌నినో ఎఫెక్ట్.. నిత్యావసర ధరలపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు!
-
CJP: షరతులు వర్తిస్తాయి.. తీహార్ జైలు నుంచి సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా విడుదల.
-
AP Local Elections: సుప్రీం ఆదేశాలతో ఏపీ ఎన్నికల సంఘం కీలక నిర్ణయం.. అభ్యర్థుల తుది జాబితాకు బ్రేక్!
-
Traffic Jam: ముగిసిన దసరా సెలవులు.. హైదరాబాద్ బాట.. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్..!
ట్రెండింగ్
-
SA vs AUS: దక్షిణాఫ్రికా బౌలర్ల విధ్వంసం..99 పరుగులకే ఆస్ట్రేలియా ఆలౌట్..!
-
10,000mAh భారీ బ్యాటరీ, 240Hz OLED డిస్ప్లేతో గేమింగ్ ట్యాబ్లెట్ HONOR WIN Tablet లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
12,070mAh బ్యాటరీ, 200MP కెమెరాలు, 2K 185Hz డిస్ప్లేతో గేమింగ్ ఫోన్లు HONOR WIN సిరీస్ లాంచ్..!
-
120Hz 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Lava Aura Curve 5G లాంచ్..!
-
IND-W vs ZIM-W: జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్.!