Ustaad Bhagat Singh Review: ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rating : 2.75 / 5
- MAIN CAST: Pawan Kalyan, Sree Leela, Raashi Khanna, Parthiban, Ks Ravi kumar and others
- DIRECTOR: Harish Shankar
- MUSIC: Devi Sri Prasad, SS Thaman
- PRODUCER: Mythri Movie Makers
పవన్ కళ్యాణ్ హీరోగా, హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ అనే సినిమా రూపొందిన సంగతి అందరికీ తెలిసిందే. శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. ‘గబ్బర్ సింగ్’ తర్వాత హరీష్ శంకర్ – పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో, దీనిపై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమా ఎప్పుడో ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది, కానీ చాలా ఆలస్యమైంది. ఎట్టకేలకు ఈ సినిమా ఉగాది సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. అయితే ఈ సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది? అనేది ఇప్పుడు మనం రివ్యూలో చూద్దాం.
ఉస్తాద్ భగత్ సింగ్ కథ:
తెలంగాణ ముఖ్యమంత్రి (కేఎస్ రవికుమార్)ని దుండగులు అటాక్ చేయడంతో, ఆయన చికిత్స కోసం సింగపూర్ వెళ్తారు. ఈ క్రమంలో నల్ల నాగప్ప (పార్థిబన్) ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఎంపికవుతాడు. అతని కుమారుడు (కిల్లి క్రాంతి) ఒక అటవీ ప్రాంతానికి వెళ్లి, అక్కడ అనుకోకుండా పోలీస్ ఆఫీసర్ ఉస్తాద్ భగత్ సింగ్ (పవన్ కళ్యాణ్) చేతికి చిక్కుతాడు. అతను చేసిన అరాచకాలకు గాను పవన్ కళ్యాణ్ అతన్ని బందీగా ఉంచుతాడు. అయితే, అతన్ని వెనక్కి తీసుకువచ్చేందుకు టెర్రరిస్టుల సాయం తీసుకుంటాడు నల్ల నాగప్ప. ఈ క్రమంలో కొంతమంది టెర్రరిస్టులు ఆపద్ధర్మ సీఎం కుమారుడిని రక్షించేందుకు అటవీ ప్రాంతానికి వెళ్తారు. అయితే ఒక ఆపద్ధర్మ ముఖ్యమంత్రికి టెర్రరిస్టులు ఎందుకు సాయం చేశారు? అసలు ఉస్తాద్ భగత్ సింగ్ అతన్ని ఎందుకు తన కంట్రోల్ లో ఉంచుకున్నాడు? హత్యాయత్నానికి గురైన ముఖ్యమంత్రికి, భగత్ సింగ్ కి ఉన్న లింక్ ఏమిటి? ఈ విషయాలన్నీ తెలియాలంటే సినిమాని బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే.
Also Read
- Secret Soldiers: 'చైనా' పేరుతో సెన్సార్ బోర్డ్‌లో ప్రకంపనలు.. రంగంలోకి విదేశీ వ్యవహారాల శాఖ!
- Nehal Vadoliya : ప్రాణాలకు ముప్పు ఉంది.. తమన్నా మాజీ ప్రియుడు విజయ్ వర్మపై నటి సంచలన ఆరోపణలు!
- Pranay Reddy Vanga: కోడిగుడ్డు మీద ఈకలు పీకేవాళ్లకు ఓపెన్ ఛాలెంజ్.. ‘స్పిరిట్’ను ఆపే దమ్ముందా?
- Amit Majithia: స్టార్ క్రికెటర్ల పరువు గంగపాలు? దుబాయ్ రహస్య విందుల్లో బయటపడ్డ దిమ్మతిరిగే నిజాలు!
విశ్లేషణ:
‘ఉస్తాద్ భగత్ సింగ్’ అనగానే మొదటి నుంచి ‘తేరి’ రీమేక్ అనే ప్రచారం పెద్ద ఎత్తున జరిగింది. అయితే, సినిమా ప్రారంభం నుంచి చివరి వరకు చూస్తే ‘తేరి’ సినిమాకి, ఈ సినిమాకి రెండు మూడు పోలికలు మాత్రమే కనిపించాయి. ఆ సినిమాలో విజయ్ పోలీస్ ఆఫీసర్ గా, ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కూడా పోలీస్ ఆఫీసరే. విజయ్ ఒక రేప్ కేసును డీల్ చేస్తూ తన కుటుంబాన్ని కోల్పోతే, ఇక్కడ కూడా ఒక రేప్ కేసును డీల్ చేసినందుకే పవన్ కళ్యాణ్ తన కుటుంబానికి దూరమవుతాడు. అంతకుమించి ఆ సినిమాకి, ఈ సినిమాకి పెద్దగా పోలికలైతే లేవు.
కానీ, ఈ సినిమా పూర్తిస్థాయిలో కేవలం పవన్ కళ్యాణ్ అభిమానులను దృష్టిలో పెట్టుకొని చేసినట్లుగానే అనిపించింది. ఎందుకంటే, ఒక్క మాటలో చెప్పాలంటే కథ గానీ, కథనం గానీ ఏమాత్రం కొత్తగా లేవు. పూర్తిస్థాయిలో ఒక రొటీన్ కమర్షియల్ ఎంటర్టైనర్ కథనే హరీష్ శంకర్ ఎంచుకున్నాడు. కథనంతో కొంతవరకు మెప్పించే ప్రయత్నం చేసినా, అది కూడా రొటీన్ అనే ఫీలింగ్ కలుగుతుంది. సినిమా ప్రారంభంలోనే ఒక ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం సమయంలో కొంతమందిని రాజ్ భవన్ లోనే మట్టుపెట్టినట్లు చూపిస్తారు. ఒక్కసారిగా సినిమా మీద ఆసక్తి పెంచేసే సీన్ గా దీన్ని చెప్పుకోవచ్చు.
ఆ తర్వాత పవన్ కళ్యాణ్ బాల్యం నుంచి చూపిస్తూ, అతనికి ముఖ్యమంత్రికి మధ్య ఉన్న అనుబంధాన్ని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేశారు. అయితే అసలు కథ చివరి వరకు రివీల్ చేయకుండా నడిపించడంలో దర్శకుడు కొంతవరకు సక్సెస్ అయ్యాడు. కానీ, కథనం ఇంకా బాగా రాసుకుని స్క్రీన్ ప్లే మీద ఫోకస్ పెట్టి ఉంటే బాగుండేది అనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ మేనరిజమ్స్ తో ఎనర్జీని ఎస్టాబ్లిష్ చేస్తున్నా, అది ఎందుకో స్క్రీన్ మీద పూర్తిస్థాయిలో రిలేట్ అయ్యేలా అనిపించలేదు. పవన్ ది ఒక నీతికి, నిజాయితీకి కట్టుబడి ఉండే క్యారెక్టర్ గా చూపించారు. అది ఫ్యాన్స్ ని మెప్పించేలా ఉంది కానీ, పూర్తిస్థాయిలో ఫ్యాన్స్ కోరుకున్న అన్ని అంశాలు సినిమాలో లేవనిపిస్తుంది. హరీష్ శంకర్ తన గత చిత్రాలతో పోలిస్తే కథనం మీద గానీ, స్క్రీన్ ప్లే మీద గానీ అంతగా ఫోకస్ పెట్టలేదేమో అనిపిస్తుంది. అయినా, పవన్ కళ్యాణ్ తనదైన మ్యాజిక్ తో, స్క్రీన్ ప్రెజెన్స్ తో ఉన్నంతసేపు ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ఫస్ట్ హాఫ్ తో పోలిస్తే సెకండ్ హాఫ్ ఎంగేజింగ్ గా అనిపిస్తుంది. ఇక పవన్ కళ్యాణ్ డాన్సులు సినిమాకి ఒక ప్లస్ పాయింట్ అయ్యాయనే చెప్పాలి.
నటీనటుల విషయానికి వస్తే ‘ఉస్తాద్ భగత్ సింగ్’ పాత్రలో పవన్ కళ్యాణ్ ఒక రేంజ్ లో చెలరేగి నటించాడు. సస్పెన్షన్ లో ఉన్న ఐపీఎస్ అధికారిగా ఆయన తనదైన శైలిలో అలరించారు. ఇక శ్రీలీల సెకండ్ హాఫ్ లో తన స్క్రీన్ ప్రెజెన్స్ తో పవన్ పక్కన ఆకట్టుకుంది. రాశీ ఖన్నా పాత్ర పరిమితమే అయినా గ్లామర్ తో ఆకట్టుకుంది. కేఎస్ రవికుమార్, పార్తీబన్, కిల్లి క్రాంతి, శ్రీనాథ్ మాగంటి వంటి వాళ్లు తమ పాత్రల పరిధి మేరకు నటించారు. పల్లవికి కూడా మంచి పాత్ర పడింది. సాంకేతిక విభాగం విషయానికి వస్తే దేవిశ్రీ ప్రసాద్ సాంగ్స్ స్క్రీన్ మీద బాగా వర్కౌట్ అయ్యాయి. సినిమాటోగ్రఫీ ఎక్కడా వంక పెట్టడానికి వీలు లేకుండా ఉంది. ఇక తమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకి కరెక్ట్ గా సెట్ అయింది. సినిమా నిడివి విషయంలో పెద్దగా కంప్లైంట్స్ లేవు కానీ, కాస్త ట్రిమ్ చేసి ఉంటే ఇంకా క్రిస్పీగా ఉండేది.
ఫైనల్లీ: ‘ఉస్తాద్ భగత్ సింగ్’.. ఫ్యాన్స్ కోసం హరీష్ మార్క్ పవన్ కళ్యాణ్ సినిమా!
తాజావార్తలు
-
OTR : హిందూపురం గడ్డ మా అడ్డా! బాలయ్య ఇలాకాలో లోకల్ వార్ మొదలైందా?
-
Story Board : BRICS సదస్సు ప్రధాన ఉద్దేశమేంటి..? భారత్ ఎలాంటి సందేశం ఇస్తుంది..?
-
Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీకి ఒకరోజు పొడిగింపు.. బుధవారానికి వాయిదా
-
Greenfield Highway : గ్రీన్‌ఫీల్డ్ హైవేపై మృత్యుఘోష.. ఒకే రోజు మూడు ప్రమాదాలు
-
Happy Journey : వందల ఫోన్ నెంబర్లున్నా మాట్లాడుకోలేని ఒంటరితనం.. మనందరి కథే ‘హ్యాపీ జర్నీ’..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!