Dhurandhar The Revenge Review: దురంధర్: ది రివెంజ్ రివ్యూ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rating : 3.25 / 5
- MAIN CAST: Ranveer Singh, Akshaye Khanna, Sanjay Dutt, Sara Arjun
- DIRECTOR: Aditya Dhar
- MUSIC: Shashwat Sachdev
- PRODUCER: Jyoti Deshpande
Dhurandhar The Revenge Review: రణవీర్ సింగ్ హీరోగా, ఆదిత్య ధర్ దర్శకత్వంలో రూపొందిన ‘దురంధర్’ సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అదే సినిమాకి అప్పట్లోనే సీక్వెల్ ప్రకటించారు. అయితే, మిగతా వారితో పోలిస్తే భిన్నంగా ఈ సినిమాని చాలా త్వరగానే రిలీజ్ చేశారు. ఈ సినిమా ఉగాది సందర్భంగా రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కానీ, ఒకరోజు ముందుగానే ప్రీమియర్స్ ప్రదర్శించడం జరిగింది. తెలుగు సహా తమిళ వర్షన్స్ కూడా ప్రీమియర్స్ టికెట్లు అమ్మారు కానీ, కంటెంట్ డెలివరీ లేట్ కావడంతో ఆ షోస్ క్యాన్సిల్ అయ్యాయి. కానీ హిందీ షోస్ మాత్రం అన్ని స్టేట్స్‌లో ప్రదర్శితమయ్యాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమా ఎలా ఉంది, ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది అనేది ఈ సినిమా రివ్యూలో చూద్దాం.
కథ:
భారత్ నుంచి పాక్ వెళ్లిన జస్‌ప్రీత్ సింగ్ రంగీ, అక్కడ ‘ల్యారీ’ అనే ఒక పట్టణంలో హంజా అలీగా మారి, రెహమాన్ డికాయిట్ (అక్షయ్ ఖన్నా) గ్యాంగ్‌లో చేరి, చివరికి అతన్ని ఎలా అంతమొందించాడు అనేది మొదటి భాగంలో చూపించారు. ఇక రెండో భాగంలో, అసలు అతను ఈ ఆపరేషన్‌లోకి ఎలా ఎంటర్ అయ్యాడు అనే విషయాన్ని చూపించారు. ఆ తర్వాత రెహ్మాన్ మరణంతో, ఆ స్థానాన్ని ఆక్రమించడానికి సిద్ధమైన అర్షద్ పప్పు (అశ్విన్ ధర్)ని ప్లాన్ చేసి అతి దారుణంగా చంపించిన హంజా, ఆ తర్వాత అతని స్థానానికి అడ్డుగా ఉన్న ఉజైర్ (డానిష్)ని తప్పుడు కేసులో దుబాయ్‌లో ఎలా అరెస్టు చేయిస్తాడు? ఆ తర్వాత భారత్ మీద పాకిస్థాన్ ఐఎస్ఐ ప్లాన్ చేసిన పథకాలను చాలా వరకు ఫెయిల్ చేస్తూ వస్తాడు. ఈ క్రమంలో ఐఎస్ఐ మేజర్ ఇక్బాల్ (అర్జున్ రాంపాల్)కి హంజా భారతీయుడని తెలుస్తుంది. తెలిసిన తర్వాత అతను హంజాని ఎలా అడ్డుకున్నాడు? ఈ విషయం తెలిసిన హంజా ఏం చేశాడు? చివరికి ఏం జరిగింది? లాంటి విషయాలు సినిమా బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే.
Also Read
విశ్లేషణ:
ఆదిత్య గతంలో డైరెక్ట్ చేసిన ‘ఉరి’ కానీ, తర్వాత చేసిన సినిమాలు కానీ హ్యూజ్ సక్సెస్ అవ్వడమే కాదు, చాలా వరకు ప్రేక్షకులను కనెక్ట్ అయ్యేలా చేశాయి. ఇక ‘దురంధర్’ బ్లాక్ బస్టర్ హిట్ కావడమే గాక, ఒకే భాషలో 1000 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టిన మొట్టమొదటి సినిమాగా కూడా నిలిచింది. ఈ నేపథ్యంలో రెండో భాగం మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే, ఆ అంచనాలను ఏమాత్రం తగ్గకుండా సినిమాని నడిపించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు.
నిజానికి సెకండ్ పార్ట్‌కి ఒక హుక్ పాయింట్ ఉంది. జస్‌ప్రీత్ సింగ్ రంగీ అనే ఒక క్రిమినల్, ఆపరేషన్ దురంధర్ ద్వారా హంజా అలీగా ఎలా మారాడు అని అందరూ ఆశ్చర్యపోయారు. అయితే ఈ విషయాన్ని సినిమా చివరి వరకు నడిపించి ఎంగేజ్ చేస్తారు అనుకుంటే, మొదటి పావుగంటలోనే అదంతా చూపించేసి అందరికీ షాక్ ఇచ్చాడు డైరెక్టర్. ఇక ఆ తరువాత నెమ్మదిగా హంజా ల్యారీ, ఆ తర్వాత కరాచీ, ఆ తర్వాత బాలు ప్రాంతాలకు ఎలా రాజుగా ఎదిగాడు అన్న విషయాలను ఆసక్తికరంగా చూపారు. అంతేకాక ఎమోషనల్‌గా ఎక్కడెక్కడ టచ్ చేయాలో అక్కడ టచ్ చేస్తూ, కూలంకషంగా సినిమాను ప్రతి ప్రేక్షకుడు ఎంజాయ్ చేసేలా డైరెక్టర్ తీర్చిదిద్దాడు.
నిజానికి నాలుగు గంటల నిడివి ఉన్న సినిమాని ఎలా భరించాలి అని అందరూ భావిస్తూ ఉంటారు. కానీ, ఈ సినిమా విషయంలో మాత్రం ఎక్కడా బోర్ కొట్టకుండా దర్శకుడు చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. అయితే మొదటి భాగంలో ఉన్నంత రక్తపాతం మాత్రం ఈ భాగంలో లేదు. మొదటి పావుగంట ఫైట్‌లో మాత్రం భారీగానే రక్తపాతం చిందించినా, ఆ తర్వాత మాత్రం ఎందుకో దాని జోలికి పెద్దగా వెళ్లలేదు. అయితే దావూద్ ఇబ్రహీం సహా భారతదేశంలో జరిగిన ఎన్నో బాంబు పేలుళ్లకు సూత్రధారులైన వాళ్ళని చూపిస్తూ ఉండడం జనాలు కనెక్ట్ అయ్యేలా చేస్తుంది. క్లైమాక్స్ ట్విస్ట్ మాత్రం అదిరిపోతుంది. అప్పటివరకు ఏమాత్రం అంచనాలు లేని ఒక క్యారెక్టర్‌తో ఊహించని షాక్ ఇప్పించాడు డైరెక్టర్. మొత్తం మీద సినిమా మాత్రం ఫుల్ పైసా వసూల్ ఎంటర్టైనర్‌లాగా, ఒకపక్క ఫైట్స్‌తో, మరోపక్క ఎమోషన్స్‌తో, ఇంకోపక్క బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో అదరగొట్టేస్తుంది.
నటీనటులు:
నటీనటుల విషయానికి వస్తే, రణవీర్ సింగ్ హంజా అలీ అలియాస్ జస్‌ప్రీత్ సింగ్ రంగీ అనే పాత్రలో పరకాయ ప్రవేశం చేశాడు. మొదటి భాగంతో పోలిస్తే ఈ భాగంలో సారా అర్జున్ పాత్ర చాలా పరిమితం. ఇక రాకేష్ బేడీ తన నటనతో ఇరగదీశాడు. సంజయ్ దత్ కనిపించిన ప్రతిసారి స్క్రీన్ మీద ఒక రకమైన అరుపులు పుట్టించాడు. అర్జున్ రాంపాల్, మాధవన్, గౌరవ్ సహా మిగతా పాత్రధారులు అందరూ తమ పాత్రల పరిధి మేరకు ఆకట్టుకున్నారు.
ఇక టెక్నికల్ టీం విషయానికి వస్తే ఈ సినిమాకి శాశ్వత్ సచ్‌దేవ్ ఇచ్చిన సంగీతం కరెక్ట్‌గా సెట్ అయింది. ముఖ్యంగా అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకి బాగా ప్లస్ అయింది. వికాస్ సినిమాటోగ్రఫీతో పాటు, ఓజెస్ గౌతమ్ శివకుమార్ అందించిన అడిషనల్ స్క్రీన్ ప్లే సినిమాని వేరే లెవల్‌కు తీసుకువెళ్ళింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. నిడివి విషయంలో కంప్లైంట్స్ ఉన్నా, ఎంగేజింగ్ కంటెంట్ కాబట్టి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు.
ఫైనల్లీ: దురంధర్: ది రివెంజ్.. మస్ట్ వాచ్ ఫుల్లీ ప్యాక్డ్ ఎంటర్టైనర్!
తాజావార్తలు
-
SCO Summit: పాక్ వక్రబుద్ధి.. ఎస్సీవో గ్రూప్ ఫొటో నుంచి మోడీ చిత్రం తొలగింపు
-
Minister Payyavula Keshav: ఈ ఏడాది సాగు నీరు ఇవ్వలేం.. మంత్రి పయ్యావుల కీలక ప్రకటన
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
AP Local Body Elections: ఏపీలో స్థానిక ఎన్నికలకు కీలక అడుగు!
-
Telangana Rainfall Deficit: తెలంగాణలో వానల కోసం ఎదురుచూపులు.. సెప్టెంబర్‌పైనే ఆశలు!
ట్రెండింగ్
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్‌ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!
-
PM Modi: భారత్ ఆర్థిక దూకుడు.. తొలి త్రైమాసికంలో జీడీపీ 7.8%పెరుగుదల.. హర్షించిన ప్రధాని.!