War Effect: భారత్ గ్యాస్ దిగుమతులపై యుద్ధం దెబ్బ.. ఇంధన పొదుపు తప్పదా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మధ్యప్రాచ్యంలో అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన దాడులకు ప్రతికారంగా ఇరాన్ చేస్తున్న దాడుల వల్ల గల్ఫ్ దేశాలు తీవ్రంగా నష్టపోతున్నాయి. ముఖ్యంగా ఇంధన వనరులు ఎక్కువగా ఉన్న దేశాలలోని చమురు, గ్యాస్ నిలయాలే లక్ష్యంగా ఇరాన్ దాడులు చేస్తోంది. తాజాగా ఖతార్‌లోని అతిపెద్ద గ్యాస్ ప్లాంట్ (Ras Laffan) పై ఇరాన్ క్షిపణి దాడి చేయడంతో ప్రపంచవ్యాప్తంగా చమురు, గ్యాస్ మార్కెట్లు అతలాకుతలం అవుతున్నాయి.
ప్రపంచంలోనే అతిపెద్ద గ్యాస్ ఉత్పత్తి కేంద్రాల్లో ఒకటిగా ఉన్న ఖతార్ ప్లాంట్‌పై దాడి జరగడంతో అక్కడ ఉత్పత్తి పూర్తిగా ఆగిపోయింది. అమెరికా, ఆస్ట్రేలియా, రష్యాతో సమానంగా గ్యాస్ ఉత్పత్తి చేసే దేశం ఖతార్. మార్చి మొదటి వారంలో కూడా ఇరాన్ ఇలాంటి దాడులే చేయడంతో గ్యాస్ ఎగుమతులు నిలిచిపోయాయి. ఇజ్రాయెల్ తనపై చేసిన దాడులకు బదులుగానే ఇరాన్ ఈ చర్యలకు దిగుతోంది.
Also Read
- WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
- Pensions: పెన్షన్ల నిధులు విడుదల.. అక్టోబర్ 1వ తేదీ ఉదయం నుంచే పంపిణీ షురూ..
- New Train Service: ఏపీ రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. కొత్త రైలు వచ్చేసింది.. వారానికి 3 రోజులు..
- Honor Smart Phone: 200MP కెమెరా, 11,000mAh బ్యాటరీ.. మార్కెట్లోకి కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్..
Also Read:Lets Her Go With Lover: తన భార్యను ప్రియుడితో వెళ్లేందుకు అంగీకరించిన భర్త..
వ్యాపారంపై ప్రభావం..
ప్రపంచ చమురు సరఫరాలో ఐదో వంతు భాగం హార్ముజ్ జలసంధి (Strait of Hormuz) ద్వారానే జరుగుతుంది. ఇప్పుడు ఈ ప్రాంతం యుద్ధ క్షేత్రంగా మారడంతో ఓడల రాకపోకలు నిలిచిపోయాయి. దాదాపు 700 సరుకు రవాణా నౌకలు మధ్యప్రాచ్య తీరాల్లోనే నిలిచిపోయాయి. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఫిబ్రవరి 28న ప్రారంభమైన ఈ యుద్ధం మూడో వారంలోకి ప్రవేశించింది. వేలాది మంది ప్రాణాలు కోల్పోతుండగా.. ఇంధన సరఫరా గొలుసు పూర్తిగా దెబ్బతింది.
భారత్‌పై పడే ప్రభావం..
ఈ పరిస్థితి భారతదేశంపై చాలా తీవ్రమైన ప్రభావాన్ని చూపుతోంది. ఎందుకంటే.. భారతదేశం తన గ్యాస్ అవసరాల్లో 50 శాతం విదేశాల నుంచే దిగుమతి చేసుకుంటుంది. ఇందులో సుమారు 20 శాతం గ్యాస్ ఒక్క ఖతార్ నుంచే వస్తుంది.
ఖతార్‌లో ఉత్పత్తి ఆగిపోవడం వల్ల భారత్‌కు అందాల్సిన గ్యాస్ సరఫరాలో భారీ కోత పడింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. భారత్ తన గ్యాస్ వినియోగాన్ని తగ్గించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా పరిశ్రమలు, విద్యుత్ ఉత్పత్తి రంగాల్లో గ్యాస్ వాడకాన్ని తగ్గించాల్సి ఉంటుంది. ప్రస్తుతం భారత్‌లో రోజుకు 189 మిలియన్ క్యూబిక్ మీటర్ల గ్యాస్ అవసరం కాగా.. అందులో సగం మాత్రమే మన దగ్గర ఉత్పత్తి అవుతోంది. మిగిలిన సగం విదేశాల నుంచి రావాలి. యుద్ధం వల్ల ఈ దిగుమతులకు ఆటంకం కలగడంతో.. భారత ప్రభుత్వ సంస్థలు ఇప్పుడు ఇతర దేశాల నుంచి గ్యాస్ కొనుగోలు చేయడానికి ప్రయత్నాలు మొదలుపెట్టాయి.
తాజావార్తలు
-
Chairman’s Desk : తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి? భారీ సినిమాలు వరుసగా అట్టర్ ఫ్లాప్స్!
-
WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
-
OTR : పుంగనూరు స్థానిక సమరం రణరంగంగా మారుతుందా.?
-
OTR : ఖైరతాబాద్ బీజేపీ అభ్యర్థిగా చింతల రామచంద్రారెడ్డి.?
-
India-Pakistan: పాక్ గడ్డపై భారత అధికారులు.. ఇస్లామాబాద్‌లో మొదలైన హై-వోల్టేజ్ మీటింగ్! అసలు ఏం జరుగుతోంది?
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!