Perfect Roti Dough Ratio: రొట్టె పిండిని ఎలా కలపాలి.. ఎంత నీరు వాడాలి.. ? 99 శాతం మందికి తెలియని విషయం ఇది..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Perfect Roti Dough Ratio: మన దేశంలో మధ్యాహ్నం లేదా రాత్రి భోజనానికి రొట్టె (చపాతీ) ప్రధాన ఆహారంగా ఉంటుంది. మరికొందరైతే ఉదయం కూడా జొన్న రొట్టె, చపాతీ చేసుకునేవారు కూడా లేకపోలేదు.. అయితే చాలా మందికి రొట్టె పిండిని ఎలా సరిగ్గా కలపాలో, ఎంత నీరు కలపాలో తెలియదు. పిండిని సరైన విధంగా కలపకపోతే రొట్టెలు గట్టిగా మారడం, చల్లారిన తర్వాత పాపడ్‌లా మారడం లేదా ఒత్తేటప్పుడు పిండికి అంటుకోవడం వంటి సమస్యలు ఎదురవుతాయి. అందుకే పిండిని కలిపేటప్పుడు పాటించాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాలను తెలుసుకుందాం.
పిండి – నీటి సరైన నిష్పత్తి
వంట నిపుణుల ప్రకారం మంచి పిండి ముద్ద రావాలంటే పిండి నాణ్యతకు అనుగుణంగా నీటిని కలపాలి. సాధారణంగా 2 కప్పుల గోధుమ పిండికి 1 కప్పు కంటే కొద్దిగా తక్కువ నీరు సరిపోతుంది. అంటే పిండి – నీటి నిష్పత్తి సుమారుగా 2:1గా ఉండాలి. అయితే ముతకగా ఉన్న పిండి ఎక్కువ నీటిని పీల్చుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి అవసరమైతే కొంచెం ఎక్కువ నీరు కూడా కలపాలి.
Also Read
- Homemade Ghee: గంటల తరబడి చిలకాల్సిన పనిలేదు.. ఇంట్లోనే మీగడ నుంచి పూస పూస లాంటి నెయ్యి తయారు చేయండిలా..
- Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
- Electricity Meter Red Light Blinking: కరెంట్ బిల్లు భారీగా వస్తుందా? మీటర్ ముందే ఇచ్చే సంకేతం ఇదే.. కచ్చితంగా తెలుసుకోండి..
- Tulsi Care Tips: తులసి మొక్కల పక్కన ఈ ఐదు మొక్కలను అస్సలు నాటొద్దు.. ఎందుకో తెలుసా?
గోరువెచ్చని నీటిని ఉపయోగించడం మంచిది
రొట్టెలు ఎక్కువసేపు మెత్తగా ఉండాలంటే పిండిని కలపడానికి సాధారణ నీటికి బదులుగా గోరువెచ్చని నీటిని ఉపయోగించడం మంచిది. గోరువెచ్చని నీరు పిండిలోని ప్రోటీన్లను ఉత్తేజితం చేసి పిండికి సాగే గుణాన్ని ఇస్తుంది. దీంతో రొట్టెలు మృదువుగా తయారవుతాయి. ప్రత్యేకంగా చలికాలంలో గోరువెచ్చని నీటితో పిండిని కలపడం చాలా మంచిది. ఇంకా మీకు ఇష్టమైతే కొంచెం పాలతో పిండిని కలిపితే రొట్టెలు మరింత మృదువుగా, రుచిగా తయారవుతాయి.
పిండిని కొద్దిసేపు ఉంచాలి
చాలా మంది పిండిని కలిపిన వెంటనే రొట్టెలు చేయడం ప్రారంభిస్తారు. కానీ, మంచి రొట్టెలు రావాలంటే పిండిని కలిపిన తర్వాత మూతపెట్టి 15–20 నిమిషాలు ఉంచాలి. ఇలా ఉంచిన తర్వాత పిండితో రొట్టెలు చేస్తే అవి మెత్తగా, రుచిగా తయారవుతాయి.
తాజావార్తలు
-
Ola Electric Rights Issue: ఓలా ఎలక్ట్రిక్ రైట్స్ ఇష్యూ.. రూ.27కే షేర్లు.. రికార్డ్ డేట్, ప్రారంభ తేదీ వివరాలు ఇవే
-
UPI చార్జీలు వాయిదా పడతాయా? NPCI కీలక నిర్ణయం..!
-
DIGGER : హాలీవుడ్ చరిత్రలోనే అతిపెద్ద డిజాస్టర్లలో ఒకటిగా ‘డిగ్గర్’
-
Nana Patekar: తరతరాలను అలరించిన గొప్ప నటుడు.. నానా పటేకర్‌కు గబ్బర్, జింక్స్ నివాళులు!
-
Delhi Police: రాహుల్, ప్రియాంక గాంధీలపై FIR.. అసలు కాంగ్రెస్ నిరసనలో ఏం జరిగింది?
ట్రెండింగ్
-
Eggshell: గుడ్డు పెంకులను పడేస్తున్నారా? అయితే మీరు ఎగ్ కర్రీలో కాలేసినట్లే..! వీటిని ఇలా కూడా ఉపయోగించవచ్చని తెలుసా.?
-
350cc ఇంజిన్, 14.5 లీటర్ల ట్యాంక్, TFT డిస్‌ప్లేతో Triumph Bonneville T40 లాంచ్.. ధర ఎంతంటే?
-
Royal Enfield Classic 350 ధర పెంపు.. కొత్త ధరలు ఇవే!
-
Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!
-
IP68+IP69 రేటింగ్స్, 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్, 8,000mAh బ్యాటరీతో Vivo Y32 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!