నల్ల బియ్యంలో విటమిన్ బి, ఇ, నియాసిన్, ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, జింక్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి.

ఈ బ్లాక్ రైస్‌లో ఆంథోసైనిన్స్ అధికంగా ఉంటాయి. ఇవి గుండెపోటు ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి.

ఈ బ్లాక్ రైస్.. శరీరంలో రోగ నిరోధక శక్తి పెంచి, హానికారకమైన బ్యాక్టీరియాలు, వైరస్‌లు దరి చేరకుండా చేస్తుంది.

నల్ల బియ్యంలో ఉండే పోషకాలు.. ఇవి కంటి వ్యాధులను నయం చేయడంలో తోడ్పడుతాయి.

ఈ నల్ల బియ్యంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు.. క్యాన్సర్ కణాలకు వ్యతిరేకంగా పోరాడి, ఆరోగ్యంగా ఉంచుతాయి.

మధుమేహం వ్యాధిని తగ్గించే గుణాలు ఈ నల్ల బియ్యంలో ఉంటాయి. కాబట్టి, ఆ రోగులు రెగ్యులర్‌గా తింటే బెటర్.

నల్ల బియ్యంలో ఫైబర్ ఎక్కువగా, క్యాలరీలు తక్కువగా ఉంటాయి. ఫలితంగా.. ఒబేసిటీ సమస్య నుంచి విముక్తి కలుగుతుంది.

నల్ల బియ్యంలో యాంటీఆక్సిడెంట్ల అధికంగా ఉన్నాయి. ఇవి మెదడు సంబంధ సమస్యలను దరికి చేరనీయవు.

ఈ బ్లాక్ రైస్‌లో ఉండే ఫైబర్‌.. జీర్ణసంబంధ సమస్యలను నివారించడంలో సమర్థవంతంగా పని చేస్తుంది.