Gold Rush: ప్రస్తుతం బులియన్ మార్కెట్‌లో అసాధారణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. “ఇప్పటికే ఆలస్యం చేశాం.. ఇప్పుడైనా కొనకపోతే మరిన్ని కష్టాలు తప్పవు” అనే ఆందోళనతో సామాన్యుల నుంచి సంపన్నుల వరకు అందరూ బంగారం, వెండి దుకాణాల వైపు పరుగులు తీస్తున్నారు. గత పది రోజుల్లోనే తులం బంగారం ధర ఏకంగా రూ. 32,000 పైగా పెరగడం మార్కెట్ చరిత్రలో ఒక సంచలనం.
Sammakka Sarakka Jatara: మేడారం మహాజాతరలో మహా అద్భుత దృశ్యం.. గద్దెపై సమ్మక్క కొలువు.!
ఇకపోతే హైదరాబాద్‌తో పాటు ‘సెకండ్ బాంబే’గా పేరుగాంచిన ప్రొద్దుటూరులో నగల దుకాణాల వద్ద జనం గంటల తరబడి వేచి ఉంటున్నారు. ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఇంట్లో ఉన్న పాత బంగారాన్ని బ్యాంకుల్లో తాకట్టు పెట్టి, ఆ వచ్చిన డబ్బుతో మళ్లీ కొత్త బంగారాన్ని లేదా వెండిని కొనుగోలు చేస్తున్నారు. బంగారం తాకట్టు పెట్టి లోన్లు తీసుకునే వారి సంఖ్య పెరగడంతో, కొన్ని బ్యాంకులు “ఈరోజుకు లోన్లు ఇవ్వడానికి మా వద్ద నగదు లేదు” అని బోర్డులు పెట్టే పరిస్థితి నెలకొంది అంటే నమ్మండి. ప్రొద్దుటూరులో ఒకే రోజు ఒక బ్యాంకు శాఖలో రూ. 2 కోట్ల గోల్డ్ లోన్లు మంజూరు చేసిందంటే నమ్మండి.
గతంలో రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టిన వారు కూడా ఇప్పుడు తమ రూటు మార్చుకున్నారు. ఒక ఇల్లు కట్టి అమ్మితే ఏడాదికి రూ. 10-15 లక్షల లాభం వస్తుందని, కానీ బంగారంపై కొన్ని రోజుల్లోనే అంతకంటే ఎక్కువ లాభం వస్తోందని ఇన్వెస్టర్లు భావిస్తున్నారు. రియల్ ఎస్టేట్‌లో అమ్మకం ఆలస్యమవుతున్న నేపథ్యంలో, తక్షణ లాభం కోసం గోల్డ్ బిస్కెట్లు, వెండి ఇటుకలను కొనుగోలు చేస్తున్నారు. ప్రస్తుతం వినిపిస్తున్న ఊహాగానాల ప్రకారం, భవిష్యత్తులో ధరలు బంగారం తులం (10 గ్రాములు) రూ. 2.50 లక్షలు, వెండి కిలో రూ. 5 లక్షలు స్థాయికి చేరుకోవచ్చని అంచనా వేస్తున్నారు.
Quinton de Kock Century: రీఎంట్రీలో రెచ్చిపోతున్న డికాక్.. కెరీర్‌లోనే అత్యుత్తమ ఇన్నింగ్స్!
గురువారం నాడు 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ. 1,85,500 గా ఉండగా.. అయితే డిమాండ్ విపరీతంగా ఉండటంతో, భవిష్యత్తులో ధర పెరుగుతుందనే నమ్మకంతో చాలామంది రూ. 2 లక్షల నుంచి 2.10 లక్షలు చెల్లించి మరీ ముందస్తు బుకింగ్‌లు చేసుకుంటున్నారు. బంగారం కేవలం ఆభరణంగానే కాకుండా, అత్యుత్తమ పెట్టుబడి సాధనంగా మారడంతో ఈ ‘గోల్డ్ రష్’ కొనసాగుతోంది. రియల్ ఎస్టేట్ మందగమనం కూడా ఈ ధోరణికి ప్రధాన కారణమైంది.