Realme P4 Power 5G Review: ‘రియల్‌మీ పీ4 పవర్’ రివ్యూ.. ‘డెడ్ లెస్ స్మార్ట్‌ఫోన్’!
- భారతీయ మార్కెట్‌లోకి రియల్‌మి పీ4 పవర్ విడుదల
- తొలిసారి 10,001mAh బ్యాటరీతో రియల్‌మి పీ4 పవర్
- 'డెడ్ లెస్ స్మార్ట్‌ఫోన్' అనే ట్యాగ్‌కు పక్కాగా న్యాయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
స్మార్ట్‌ఫోన్ వినియోగంలో బ్యాటరీ లైఫ్ ఎంత కీలకమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రోజంతా ఫోన్ చేతిలోనే ఉండే ఈ రోజుల్లో.. ఛార్జింగ్ టెన్షన్ లేకుండా వాడుకునే స్మార్ట్‌ఫోన్ కావాలని అందరూ కోరుకుంటారు. బ్యాటరీ లైఫ్ దృష్టిలో పెట్టుకుని చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ సంస్థ ‘రియల్‌మీ’.. భారతీయ మార్కెట్‌లోకి విడుదల చేసిన ఫోనే ‘రియల్‌మీ పీ4 పవర్ 5జీ’. ఏకంగా 10,001mAh భారీ బ్యాటరీతో వచ్చిన ఈ ఫోన్.. ఛార్జింగ్ కష్టాలకు చెక్ పెట్టనుంది. ‘డెడ్ లెస్ స్మార్ట్‌ఫోన్’ అనే ట్యాగ్‌కు రియల్‌మీ పీ4 పవర్ పక్కాగా న్యాయం చేస్తుందని టెక్ నిపుణులు అంటున్నారు.
రియల్‌మీ పీ4 పవర్ ఫోన్‌లో ప్రధాన ఆకర్షణ బ్యాటరీ. సాధారణ వినియోగంలో రోజుల పాటు ఛార్జర్ అవసరం లేకుండా పనిచేస్తుంది. వీడియో స్ట్రీమింగ్, సోషల్ మీడియా, కాల్స్, గేమింగ్ వంటి హెవీ యూజ్‌లోనూ బ్యాటరీ లైఫ్ అద్భుతంగా ఉంటుంది. బ్యాటరీ లైఫ్ విషయంలో ఇది బెస్ట్ ఆప్షన్ అని బలంగా చూపొచ్చు. బ్యాటరీ మాత్రమే కాకుండా.. మిగతా ఫీచర్లలో కూడా ఈ ఫోన్ బాగానే ఉంటుంది. డిస్‌ప్లే నాణ్యత ఆకట్టుకునేలా ఉంది. రోజువారీ వినియోగం, మల్టీటాస్కింగ్‌కు పనితీరు సరిపోతుంది. హైఎండ్ గేమింగ్ లేదా హెవీ టాస్క్‌ల కోసం కాకపోయినా.. సాధారణ యూజర్లకు మాత్రం ఎలాంటి ఇబ్బంది ఉండదు.
Also Read
- Top 5 Expensive Phones: భారత్‌లో అత్యంత ఖరీదైన 5 స్మార్ట్ఫోన్లు.. 2TB స్టోరేజ్, ధరలు తెలిస్తే షాక్!
- Vivo X Fold 6: వివో X Fold 6 త్వరలో మార్కెట్‌లోకి.. Geekbenchలో లిస్టింగ్.. 200MP కెమెరా, 7,000mAh బ్యాటరీ
- Boltt Ace 5G : విడుదలైన తర్వాత రోజే మొత్తం Sold Out.. మరో కొత్త తేదీ ప్రకటన.. రూ.9,999లకే 5జీ మొబైల్..
- Number Secrete: మొబైల్ నంబర్‌కు ముందు '+91' ఎందుకు ఉంటుందో తెలుసా..? ఆ రహస్యం ఇదే..
కెమెరాల విషయానికి వస్తే.. రియల్‌మీ పీ4 పవర్ ఫోన్ కాస్త వెనకబడి ఉంది. ఫోటోగ్రఫీపై ఎక్కువ ఆసక్తి ఉన్నవారికి ఇది బెస్ట్ ఛాయిస్ కాకపోవచ్చు. అయితే సోషల్ మీడియాలో పోస్ట్ చేయడానికి లేదా రోజువారీ అవసరాలకు మాత్రం ఇందులో ఉండే కెమెరాలు సరిపోతాయి. యూజర్ ఎక్స్‌పీరియెన్స్ కూడా స్మూత్‌గా ఉండడం మరో ప్లస్ పాయింట్. రూ.27,999 ప్రారంభ ధరలో రియల్‌మీ పీ4 పవర్ మంచి ప్యాకేజీగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా బ్యాటరీ టెన్షన్ లేకుండా ఫోన్ వాడాలనుకునేవారికి ఇది చక్కటి ఎంపిక. భారీ బ్యాటరీతో పాటు ఇతర అంశాల్లో పెద్దగా రాజీ పడకుండా ఈ ఫోన్‌ను రియల్‌మీ అందించింది. ఫిబ్రవరి 5 నుంచి రియల్‌మీ.కామ్, ఫ్లిప్‌కార్ట్ వెబ్‌సైట్స్ ద్వారా ఈ మొబైల్ కొనుగోలు చేయొచ్చు.
Also Read: Komalee Prasad: పవర్‌ఫుల్ ఫిమేల్ ఓరియెంటెడ్ మూవీ.. తమిళంలో అరంగేట్రం చేసిన తెలుగు హీరోయిన్!
ఫైనల్లీ: బ్యాటరీ లైఫ్ మీకు మొదటి ప్రాధాన్యత అయితే రియల్‌మీ పీ4 పవర్ తప్పకుండా పరిశీలించదగ్గ ఫోన్.
రియల్‌మీ పీ4 పవర్ ఫీచర్స్:
# 6.8 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ అమోలెడ్ 4డీ కర్వ్ డిస్‌ప్లే
# 144Hz రిఫ్రెష్ రేటు,
# 6500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్
# హెచ్‌డీఆర్ సపోర్ట్
# 2.6 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 7400 అల్ట్రా ప్రాసెసర్
# 50 ఎంపీ (సోనీ ఐఎంఎక్స్ 882 సెన్సర్) మెయిన్ కెమెరా, 8 ఎంపీ అల్ట్రా వైడ్ యాంగిల్
# 16 ఎంపీ సెల్ఫీ కెమెరా
# 10,001 mAh టైటాన్ బ్యాటరీ, 80W వూక్ అండ్ 27w రివర్స్ ఛార్జ్ ఆప్షన్
# ఐపీ 68, ఐపీ 69, ఐపీ 66 రేటింగ్
తాజావార్తలు
-
Top 5 Expensive Phones: భారత్‌లో అత్యంత ఖరీదైన 5 స్మార్ట్ఫోన్లు.. 2TB స్టోరేజ్, ధరలు తెలిస్తే షాక్!
-
Putin-Ajit Doval: పుతిన్‌కు అజిత్ దోవల్ అంటే రెస్పెక్టో చూడండి.. ‘స్పై-టు-స్పై సెల్యూట్’ వీడియో వైరల్
-
Yolo Travels Bus : కంచికచర్ల వద్ద బస్సు ప్రమాదం.. 36 మందికి తప్పిన పెను ముప్పు
-
Irumudi OTT: ఓటీటీలోకి మాస్ మహారాజా రవితేజ ‘ఇరుముడి’.. ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చు అంటే?
-
Indonesia: ఇండోనేషియాలో తీవ్ర విషాదం.. 243 మందితో నౌక మిస్సింగ్!
ట్రెండింగ్
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!