Dhurandhar: ఓటీటీలోకి ధురంధర్, నెట్‌ఫ్లిక్స్ తీరుపై ఆగ్రహం.. కారణాలేంటి..?
- ఓటీటీలోకి వచ్చిన ధురంధర్..
- నెట్‌ఫ్లిక్స్ తీరుపై ప్రేక్షకుల ఆగ్రహం..
- సినిమా నిడివి, ముఖ్యమైన సన్నివేశాలు తీసేయడంపై ఫైర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dhurandhar: ఫ్యాన్స్ ఎన్నో రోజుల నుంచి చూసిన తరుణం వచ్చింది. బాలీవుడ్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ ‘‘ధురందర్ ’’ ఓటీటీలోకి వచ్చింది. హిందీతో పాటు తమిళ్, తెలుగు భాషాల్లో నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్‌లో కేవలం హిందీలోనే విడుదలైన ఈ సినిమా ఇప్పుడు రీజినల్ భాషల్లో కూడా ఓటీటీలో కనిపిస్తోంది. ఆదిత్య ధర్ డైరెక్షన్‌లో రణ్‌వీర్ సింగ్, అక్షయ్ ఖన్నాలు ప్రధాన పాత్రలో వచ్చిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ ప్రపంచవ్యాప్తంగా రూ. 1300 కోట్లను కొల్లగొట్టింది. ఇప్పుడు, ప్రపంచం మొత్తం ధురందర్-2 కోసం వెయిట్ చేస్తోంది.
ఇదిలా ఉంటే, మరోవైపు నెట్‌ఫ్లిక్స్‌పై ప్రేక్షకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒరిజినల్ థియేటర్ లో చూసిని సినిమా నిడివి కన్నా, నెట్‌ఫ్లిక్స్ వెర్షన్ తక్కువ నిడివితో ఉందని విమర్శలు గుప్పిస్తున్నారు. దీంతో పాటు క్వాలిటీ బాగా లేదని ఆరోపిస్తున్నారు. థియేటర్‌లో ఈ సినిమా 3 గంటల 45 నిమిషాలు ఉంటే, నెట్‌ఫ్లిక్స్ వెర్షన్ మాత్రం 3 గంటల 25 నిమిషాలు ఉంది. దాదాపుగా 9 నుంచి 10 నిమిషాల సీన్లను తొలగించారు. సినిమాలో ఓటీటీలోకి వచ్చిన కొద్దిసేపటి నుంచే సోషల్ మీడియాలో అభిమానుల ఫిర్యాదుల వెల్లువెత్తాయి.
Also Read
- Om: ధనుష్ - సాయిపల్లవి ‘ఓం’ కొత్త రిలీజ్ డేట్ ఇదే!
- Kalyani Priyadarshan: ఆ స్టార్ హీరోయిన్ ఇక తెలుగు సినిమాలు చేయదా? ముంబైకి మకాం మార్చడం వెనుక అసలు నిజం ఏంటి!
- Box Office Battle: దసరా బాక్సాఫీస్ విన్నింగ్ రేసులో ముందున్నదెవరు?
- Irumudi Record: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ‘బాహుబలి 2’ను దాటేసిన ‘ఇరుముడి’.. సరికొత్త రికార్డు!
సినిమాలోని కొన్ని ముఖ్యమైన డైలాగ్స్‌ను మ్యూట్ చేయడంపై అభిమానులు మండిపడుతున్నారు. కొన్ని సన్నివేశాలను పూర్తిగా కట్ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సినిమా ఏ-సర్టిఫికేట్ పొందినప్పటికీ, మళ్లీ సెన్సార్ చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఓటీటీలో అన్ కట్ వెర్షన్ చూడాలనుకున్నామని, ఇలా చేస్తే సినిమా సహజత్వం పోతుందని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. సినిమాలో 10 నిమిషాల సన్నివేశాలను కట్ చేయడంతో సినిమా ప్రవాహంపై ప్రభావం పడిందని చెప్పారు.
పాకిస్తాన్‌లో భారత గూఢచార ఏజెంట్లు ఎలాంటి ఆపరేషన్లు చేస్తారు, భారత్‌పై దాడులకు పాకిస్తాన్ లోని మాఫియా, ఐఎస్ఐ, రాజకీయ నాయకుల నెక్సస్ ఎలా పనిచేస్తుందనే వివరాలను సినిమాలో చూపించారు. IC-814 విమాన హైజాక్ ఘటన, 2001 పార్లమెంట్ దాడి, ముంబై ఉగ్రదాడుల వంటి సంఘటనలు సినిమాలో ఉన్నాయి. డిసెంబర్‌లో విడుదలైన సినిమా ఇప్పటికీ థియేటర్లలో తన సత్తా చాటుతోంది. ధురంధర్ 2 మార్చి 19న థియేటర్లలో విడుదల కాబోతోంది. ఇదే రోజు యష్ ‘‘టాక్సిక్’’ సినిమా కూడా విడుదల కాబోతోంది.
తాజావార్తలు
-
Abhishek Sharma: షాకింగ్ డెసిషన్.. సన్ రైజర్స్ హైదరాబాద్‌ను వీడనున్న అభిషేక్ శర్మ..?
-
Om: ధనుష్ – సాయిపల్లవి ‘ఓం’ కొత్త రిలీజ్ డేట్ ఇదే!
-
ECIL Recruitment 2026: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఫీజు, ఎగ్జామ్ లేకుండానే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం! వెంటనే అప్లై చేసుకోండి..
-
USA: మరణశిక్ష.. 2 సార్లు ప్రాణాంతక ఇంజెక్షన్ ఇచ్చినా చావలేదు.. యూఎస్‌లో సంచలనం..
-
Chhattisgarh: బాలీవుడ్ ఆఫర్ కొట్టేసిన మాజీ మావోలు.. ఏ సినిమా అంటే..!
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!