ఫోన్ ట్యాపింగ్ కేసు తెలంగాణలో పొలిటికల్ హీట్ పెంచేస్తోంది. వరుసగా బీఆర్ఎస్ కీలక నేతలను విచారిస్తున్న సిట్ ఏకంగా గులాబీ బాస్ కేసీఆర్‌కు మరోసారి నోటీసులు జారీ చేసింది. సిట్ నంది నగర్ నివాసంలో ఇంటి గోడకు నోటీసులు అతికించింది. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు సిద్ధంగా ఉండాలని నోటీసుల్లో పేర్కొంది. నంది నగర్ నివాసంలో విచారణ చేస్తామని సిట్ తెలిపింది. CRPC 160 కింది సిట్ నోటీసులు ఇచ్చింది.
Also Read:Top Headlines @ 9 PM: టాప్ న్యూస్
అధికారిక రికార్డ్‌లో ఉన్న సమాచారం మేరకే.. నందినగర్ ఇంటిలో విచారించేందుకు సిట్ నిర్ణయించినట్లు తెలిపింది. నందినగర్ ఇంటిలోనే విచారణ చేసేందుకు సిట్ బృందం సిద్ధమైంది. ఎర్రవల్లి ఫాంహౌస్‌లో విచారణకు సిట్ నిరాకరించింది. ఈ విచారణలో కొన్ని ఎలక్ట్రానిక్, భౌతిక రికార్డులు ఉండటంతో.. ఎర్రవల్లి తరలించడం పరిపాలన పరంగా ఇబ్బందులు తలెత్తుతాయని సిట్ తెలిపింది.