Hyderabad Economy Growth: ప్రపంచ ఆర్థిక రంగంలో హైదరాబాద్ తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకుంటోంది. ఆర్థిక సర్వే 2025–26 ప్రకారం.. 2035 నాటికి భారతదేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో హైదరాబాద్ 4వ స్థానంలో నిలవనుంది. 8.47 శాతం వార్షిక వృద్ధి రేటుతో నగరం దూసుకుపోతూ ప్రస్తుత ధరల ప్రకారం హైదరాబాద్ స్థూల దేశీయోత్పత్తి (GDP) $201.4 బిలియన్లకు చేరుకుంటుందని అంచనా వేయబడింది.
2018లో సుమారు $50 బిలియన్లుగా ఉన్న హైదరాబాద్ GDP, 2035 నాటికి నాలుగు రెట్లు పెరిగి $201.4 బిలియన్ల మార్కును దాటనుంది. ఈ వృద్ధితో హైదరాబాద్ దేశంలోనే కీలక ఆర్థిక కేంద్రంగా అవతరిస్తోంది. వృద్ధి రేటులో హైదరాబాద్ కంటే ముందున్న నగరాలు సూరత్ (9.17%), ఆగ్రా (8.58%), బెంగళూరు (8.50%) మాత్రమే కావడం గమనార్హం.
Bolisetty Satyanarayana: కూటమి ప్రభుత్వంలో జనసేనకు అన్యాయం జరుగుతోంది..
మరోవైపు ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ కూడా దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న టాప్ 10 నగరాల్లో ఒకటిగా నిలిచింది. 2018లో $5.6 బిలియన్లుగా ఉన్న విజయవాడ ఆర్థిక వ్యవస్థ, 2035 నాటికి $21 బిలియన్లకు పెరుగుతుందని ఆర్థిక సర్వే అంచనా వేసింది. నగరాభివృద్ధికి నిధుల సమీకరణలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) దేశంలోనే రికార్డు సృష్టించింది. మున్సిపల్ బాండ్ల ద్వారా సెప్టెంబర్ 2025 నాటికి రూ. 500 కోట్లను సమీకరించి, దేశంలోనే అత్యధిక నిధులు సేకరించిన నగరంగా హైదరాబాద్ అగ్రస్థానంలో నిలిచింది. ఈ జాబితాలో అహ్మదాబాద్ రూ. 400 కోట్లతో రెండో స్థానంలో ఉంది.
తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ఐటీ రంగంతో పాటు సాగునీరు, పారిశ్రామిక రంగాలు ప్రధాన శక్తులుగా మారాయి. 2014లో 1.31 కోట్ల ఎకరాలుగా ఉన్న సాగుభూమి, 2023 ఆర్థిక సంవత్సరానికి 2.20 కోట్ల ఎకరాలకు పెరిగింది. కాళేశ్వరం ఎత్తిపోతల పథకం, మిషన్ కాకతీయ వంటి భారీ, చిన్న తరహా సాగునీటి ప్రాజెక్టులు ఈ పురోగతికి ప్రధాన కారణాలుగా నిలిచాయి. దేశవ్యాప్తంగా తయారీ రంగంలో ఉపాధి కల్పనలో తెలంగాణ వాటా దాదాపు 5 శాతంగా ఉంది. అంతేకాదు దేశంలోని మొత్తం AI స్టార్టప్‌లలో 7 శాతం హైదరాబాద్ కేంద్రంగానే పనిచేస్తుండటం నగర సాంకేతిక బలాన్ని చాటుతోంది.
Bangladesh ICC Row: బంగ్లాదేశ్-ఐసీసీ మధ్య వివాదం.. టీ20 వరల్డ్ కప్‌పై శ్రీలంక సంచలన వ్యాఖ్యలు
దేశంలోని టాప్ 100 ఉన్నత విద్యాసంస్థల జాబితాలో తెలంగాణ నుంచి ఐదు సంస్థలు చోటు సంపాదించడం రాష్ట్ర మానవ వనరుల బలాన్ని సూచిస్తోంది. మరోవైపు అభివృద్ధి వేగంగా కొనసాగుతున్నప్పటికీ, కొన్ని ఆందోళనలు కూడా వ్యక్తమవుతున్నాయి. నేషనల్ డామ్ సేఫ్టీ అథారిటీ (NDSA) కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల భద్రతపై ప్రశ్నలు లేవనెత్తింది. ముఖ్యంగా మేడిగడ్డ బ్యారేజీలో కొంత భాగం కుంగిపోవడంతో, తక్షణ పునర్నిర్మాణ చర్యలు అవసరమని సూచించింది.