Komalee Prasad: పవర్‌ఫుల్ ఫిమేల్ ఓరియెంటెడ్ మూవీ.. తమిళంలో అరంగేట్రం చేసిన తెలుగు హీరోయిన్!
- తమిళంలో తెలుగు నటి కోమలి ప్రసాద్ అరంగేట్రం
- శరణ్ రాజ్ సెంథిల్ కుమార్ దర్శకత్వంలో మండవెట్టి
- పవర్‌ఫుల్ ఫిమేల్ ఓరియెంటెడ్ మూవీ మండవెట్టి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు నటి కోమలి ప్రసాద్ తమిళంలో అరంగేట్రం చేశారు. శరణ్ రాజ్ సెంథిల్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న పవర్‌ఫుల్ ఫిమేల్ ఓరియెంటెడ్ సూపర్ నేచురల్ క్రైమ్ థ్రిల్లర్ ‘మండవెట్టి’లో కోమలి ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. టస్కర్స్ డెన్ పిక్చర్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న మండవెట్టి సినిమా లాంఛనంగా పూజా కార్యక్రమాలు నిర్వహించుకుని.. షూటింగ్‌ను ప్రారంభించింది. తన కెరీర్‌లో ఈ సినిమా ఒక కీలకమైన, కొత్త అధ్యాయమని కోమలి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ప్రేక్షకుల ప్రేమ, ఆశీస్సులు తనకు ఎప్పటికీ అండగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నారు.
ప్రస్తుతం తమిళనాడులోని మదురై జిల్లా ఉసిలంపట్టి ప్రాంతంలో మండవెట్టి చిత్రీకరణ జరుగుతోంది. కథలో నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలతో పాటు భావోద్వేగాలకు పెద్దపీట వేశారు. సూపర్ నేచురల్ క్రైమ్ థ్రిల్లర్ అంశాల నేపథ్యంలో మిస్టిసిజం, ఎమోషన్స్‌ను మేళవిస్తూ ఓ బలమైన మహిళా ప్రధాన కథగా మండవెట్టి రూపుదిద్దుకుంటోంది. మనకు కావాల్సిన దాన్ని కోల్పోవడం వల్ల కలిగే బాధ, గుర్తింపు కోసం చేసే పోరాటం, జీవన ప్రయాణం వంటి అంశాలను ఈ కథలో చూపించనున్నారు. పెర్ఫార్మెన్స్‌కు మంచి స్కోప్ ఉన్న ఈ సినిమా కథంతా కోమలి ప్రసాద్ చుట్టూ సాగనుంది.
Also Read
- Om: ధనుష్ - సాయిపల్లవి ‘ఓం’ కొత్త రిలీజ్ డేట్ ఇదే!
- Kalyani Priyadarshan: ఆ స్టార్ హీరోయిన్ ఇక తెలుగు సినిమాలు చేయదా? ముంబైకి మకాం మార్చడం వెనుక అసలు నిజం ఏంటి!
- Box Office Battle: దసరా బాక్సాఫీస్ విన్నింగ్ రేసులో ముందున్నదెవరు?
- Irumudi Record: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ‘బాహుబలి 2’ను దాటేసిన ‘ఇరుముడి’.. సరికొత్త రికార్డు!
‘వెల్ల కుదిర’ వంటి సెన్సిబుల్, సైకాలజికల్ సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న దర్శకుడు శరణ్ రాజ్ సెంథిల్ కుమార్ ఈ సినిమాను రొటీన్‌కు భిన్నంగా.. భావోద్వేగాలకు ప్రాధాన్యం ఇస్తూ తెరకెక్కిస్తున్నారు. పాత్రల అంతర్గత భావాలు, ఎమోషన్స్‌ను తెరపై సహజంగా ఆవిష్కరించడంపై ఆయన ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో తేనప్పన్, గజరాజ్, అమృత కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సినిమాటోగ్రాఫర్ ప్రకాశ్, ఎడిటర్ కునా, సంగీత దర్శకుడు దీపక్ వేణుగోపాల్, స్టంట్ కొరియోగ్రాఫర్ గౌతమ్ ఈ ప్రాజెక్ట్‌కు పని చేస్తున్నారు. స్పష్టమైన ఆలోచనతో బెస్ట్ అవుట్‌పుట్ ఇవ్వాలనే లక్ష్యంతో టీమ్ ముందుకు సాగుతోంది.
Also Read: Gambhir-Shreyas Rift: గంభీర్ భారత క్రికెట్‌కు ప్రమాదకరం.. రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు!
కోమలి ప్రసాద్ కెరీర్‌లో ఈ తమిళ సినిమా ఒక కీలకమైన మైలురాయి. ఇప్పటికే తెలుగు సినిమాల్లో ‘నెపోలియన్’, ‘రౌడీ బాయ్స్’, ‘సెబాస్టియన్ P.C. 524’, ‘హిట్ – సెకండ్ కేస్’, ‘హిట్ – థర్డ్ కేస్’, ‘శశివదనే చితాలు’ వంటి చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అంతేకాదు డిజిటల్ ప్లాట్‌ఫాంలలో ‘లూజర్’, ‘మోడర్న్ లవ్ హైదరాబాద్’, ‘టచ్ మీ నాట్’ వంటి సిరీస్‌లతో విమర్శకుల ప్రశంసలు పొందారు. గ్లామర్‌తో పాటు నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలను ఎంచుకుంటూ సహజమైన నటనతో మంచి పేరు తెచ్చుకున్న కోమలి ప్రసాద్.. ‘మండవెట్టి’తో తమిళ సినీ పరిశ్రమలో తన సత్తా నిరూపించుకునేందుకు సిద్దమయ్యారు.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..