BRS MLA Kaushik Reddy Apologises to Telangana IPS Officers Association: తెలంగాణ ఐపీఎస్ అధికారుల సంఘానికి ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి క్షమాపణలు చెప్పారు. పోలీసులు, అధికారులు అంటే తనకు గౌరవం ఉందని.. తాను ఉద్దేశపూర్వకంగా మాట్లాడలేదని స్పష్టం చేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా BRS ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఓ వీడియో విడుదల చేశారు. “నేను ఉద్దేశ్యపూర్వకంగా అన్న మాటలు కాదు.. మనోభావాలు దెబ్బతింటే క్షమాపణలు.. రేవంత్ రెడ్డి ప్రోత్బలంతో నాపై, నా కుటుంబం పై రాజకీయ కక్షకు తెగబడ్డారు.. పోలీసులు, అధికారులు అంటే నాకు ఎంతో గౌరవం.. కానీ కొందరు.. మేము సమ్మక్క జాతరకు వెళ్తున్న క్రమంలో అడ్డుకొని, తీవ్ర ఒత్తిడికి గురి చేశారు.. ఆ ఫ్రస్టేషన్, ఒత్తిడిలో తెలియకుండా నోరు జారాను.అంతే తప్ప ఉద్దేశ్య పూర్వకంగా అన్న మాటలు కావు.. నా మాటలతో ఎవరివైనా మనోభావాలు దెబ్బతింటే వారికి నా క్షమాపణలు తెలియజేస్తున్నాను.. ఈ విషయంలో కొందరు పని కట్టుకొని తప్పుడు ప్రచారం చేస్తున్నారు.. ఈ వివాదాన్ని ఇంతటితో ముగించాలని అందరిని వేడుకుంటున్నాను” అని వీడియోలో చెప్పారు.
READ MORE: Virat Kohli Instagram: విరాట్ కోహ్లీ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ఈ బ్యాక్.. ఈ ఇంతకీ ఏం జరిగింది?
కాగా.. ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిపై ఐపీఎస్ అధికారుల సంఘం సీరియస్ అయ్యింది.. కరీంనగర్ సీపీతో పాటు పోలీసులకు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది.. పోలీసులపై పాడి కౌశిక్‌రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారని.. సీపీ గౌస్ మతమార్పిడికి పాల్పడుతున్నాడంటూ నిరాధార ఆరోపణలు చేశారని మండిపడింది.. కౌశిక్‌రెడ్డి బహిరంగ క్షమాపణలు చెప్పకుంటే చర్యలు తీసుకుంటామని ఐపీఎస్ అధికారుల సంఘం స్పష్టం చేసింది. ఐఏఎస్‌ల డిమాండ్‌కు దిగివచ్చిన కౌశిక్ రెడ్డి క్షమాపణలు చెప్పారు.
*ఉద్దేశ్యపూర్వకంగా అన్న మాటలు కాదు.. మనోభావాలు దెబ్బతింటే క్షమాపణలు*
*ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రకటన*
*రేవంత్ రెడ్డి ప్రోత్బలంతో నాపై, నా కుటుంబం పై రాజకీయ కక్షకు తెగబడ్డారు*
*పోలీసులు, అధికారులు అంటే నాకు ఎంతో గౌరవం*
*కానీ కొందరు.. మేము సమ్మక్క జాతరకు వెళ్తున్న క్రమంలో… pic.twitter.com/XFwZayMw4H
— Padi Kaushik Reddy (@KaushikReddyBRS) January 30, 2026