MLA Arava Sridhar controversy: రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ లైంగిక వేధింపుల వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతుంది. శ్రీధర్ తల్లి ప్రమీలమ్మ ఇచ్చిన ఫిర్యాదుపై రైల్వే కోడూరు అర్బన్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగి అయిన మహిళ… తన కొడుకును బ్లాక్ మెయిల్ చేస్తోందని ఈ నెల 7న అరవ ప్రమీలమ్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ కేసులో కాల్ డేటాతో పాటు ఇతర సాంకేతిక అంశాలపై దృష్టి సారించారు పోలీసులు. ఈ కేసుకు సంబంధించిన ఆడియో, వీడియో రికార్డులతో పాటు ఫోటోలు, ఇతర సమాచారాన్ని సేకరిస్తున్న పోలీసులు. మరోవైపు… ఎమ్మెల్యే శ్రీధర్‌పై ఆరోపణలు చేస్తున్న మహిళ తమకు అందుబాటులోకి రాలేదని తెలిపారు అర్బన్ CI చంద్రశేఖర్. ఆమె స్థానికంగా లేరని తెలుస్తుందన్నారు. ఆమె ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసి ఉందన్నారు. ఆమె నేరుగా విచారణకు హాజరైనా సరే… లేదంటే తమను రమ్మని పిలిచినా వెళ్లి విచారిస్తామని తెలిపారు CI చంద్రశేఖర్. ఈ కేసులో ఎమ్మెల్యే స్టేట్‌మెంట్ కూడా రికార్డు చేస్తామంటున్నారు పోలీసులు.
Read Also: Koragajja : కొచ్చిలో ‘కొరగజ్జ’ టీంకు ‘మెగా’ చేదు అనుభవం!
కాగా, ఎమ్మెల్యేలపై ఆరోపణలు చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగిపై మరో కేసు నమోందైంది. స్థానిక విలేకరి శంకర్ రాజును నిర్బంధించి దాడి చేసినట్టు పోలీసులకు ఫిర్యాదు అందడంతో… ఆమెపై కేసు నమోదు చేశామంటున్నారు పోలీసులు. శంకర్ రాజును నిర్బంధించి… దాడి చేసి గాయపర్చినట్టు తమకు ఆధారాలు లభ్యమయ్యాయన్నారు. ఈ రెండు కేసుల్లోనూ ఆమెపై నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్టు తెలిపారు CI చంద్రశేఖర్.