అండర్-19 ప్రపంచ కప్ ప్రస్తుతం జింబాబ్వేలో జరుగుతోంది. టోర్నమెంట్ లో ప్రస్తుతం సూపర్ 6 మ్యాచ్ లు జరుగుతున్నాయి. తొమ్మిదవ సూపర్ 6 మ్యాచ్ లో, ఆఫ్ఘనిస్తాన్ అండర్-19 వైస్ కెప్టెన్ ఫైసల్ షినోజాదా ఐర్లాండ్ అండర్-19 జట్టుపై అద్భుతమైన బ్యాటింగ్ తో నయా హిస్టరీ క్రియేట్ చేశాడు. ఈ మ్యాచ్‌లో ఫైసల్ తన సెంచరీని పూర్తి చేశాడు. ఫైసల్ స్కోరు 150 దాటింది. 114.79 అద్భుతమైన స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేశాడు. 142 బంతుల్లో 163 పరుగులు చేశాడు. ఫైసల్ తన ఇన్నింగ్స్‌లో 18 ఫోర్లు, 1 సిక్స్ కొట్టాడు. చివరికి ఆలివర్ రిలే అతని వికెట్ తీసుకున్నాడు.
Also Read:Google Chrome AI Agent: గూగుల్ సంచలన ప్రకటన.. ఇక అన్నీ క్రోమ్ లోనే.. ఇది చేస్తే చాలు..!
దీనితో, ఫైసల్ అండర్-19 ప్రపంచ కప్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన ఆఫ్ఘన్ బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. కరీం జనత్ 10 ఏళ్ల రికార్డును కూడా బద్దలు కొట్టాడు. ఫిబ్రవరి 5, 2016న ఫిజీపై కరీం 132 బంతుల్లో 156 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో, ఓపెనింగ్ బ్యాట్స్‌మన్ 12 ఫోర్లు, 6 సిక్సర్లు కొట్టాడు.
Also Read:Gold and Silver Prices: సడెన్‌గా బంగారం, వెండి ధరలకు బ్రేక్.. షాకింగ్ రీజన్ చెప్పిన నిపుణులు
ఈ మ్యాచ్ గురించి మాట్లాడుతూ.. ఆఫ్ఘనిస్తాన్ అండర్-19 జట్టు కెప్టెన్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ముందుగా బ్యాటింగ్ చేసిన జట్టు 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 315 పరుగులు చేసింది. ఫైసల్ ఇన్నింగ్స్‌తో పాటు, కెప్టెన్ మెహబూబ్ ఖాన్ కూడా బ్యాట్ ఝుళిపించాడు. మెహబూబ్ 79 బంతుల్లో 89 పరుగులు చేసి సెంచరీని కోల్పోయాడు. ఫైసల్, మెహబూబ్ 188 పరుగుల భాగస్వామ్యాన్ని పంచుకున్నారు.