టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ తన కెరీర్‌లో మరో విభిన్నమైన కథను ఒకే చేసాడు. ‘మనం’, ’24’, ‘దూత’ వంటి వైవిధ్యమైన చిత్రాలను అందించిన స్టార్ డైరెక్టర్ విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో విజయ్ ఒక సినిమా చేయబోతున్నారు. ఈ చిత్రానికి ‘స్వారి’ అనే టైటిల్‌ను కూడా ఫిక్స్ చేసినట్టు సమాచారం. ఈ సినిమాను టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ యువి క్రియేషన్స్ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించనుంది.
Also Read : Samantha Ruth Prabhu : మళ్లీ పేరు మార్చుకోనున్న సమంత ఇకపై అలానే పిలవాలట
ఈ సినిమాను టాలీవుడ్‌లో ఇప్పటివరకు టచ్ చేయని బ్యాక్‌డ్రాప్ గుర్రపు స్వారీ నేపథ్యంలో సాగే ఈ కథలో విజయ్ ఒక ప్రొఫెషనల్ రైడర్‌గా కనిపించనున్నారట. విక్రమ్ కె కుమార్ మార్క్ స్క్రీన్‌ప్లే, ఎమోషన్స్‌తో కూడిన ఈ స్పోర్ట్స్ డ్రామా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇస్తుందని చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఇందుకోసం విజయ్ ఇప్పటికే ప్రత్యేక శిక్షణ కూడా తీసుకుంటున్నట్లు సమాచారం.అయితే, ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. విక్రమ్ కె కుమార్ ఈ స్క్రిప్ట్‌ను మొదట హీరో నితిన్ కోసం సిద్ధం చేశారట. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘ఇష్క్’ పెద్ద హిట్ కావడంతో, ఈ కథను కూడా నితిన్‌కే వినిపించారు. కానీ కొన్ని కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్ నితిన్ చేతుల్లో నుంచి విజయ్ దేవరకొండ వద్దకు చేరింది. విజయ్ ఈ కథ వినగానే ఇంప్రెస్ అయ్యి వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ హీరోగా రవికిరణ్ కోల దర్శకత్వంలో ‘రౌడీ జనార్ధన్’ తో పాటు రాహుల్ సాంకృత్యాన్ డైరెక్షన్ లో రణబాలి సినిమాలు చేస్తున్నాడు. ఈ సినిమాల తర్వాత ‘స్వారి’ పట్టాలెక్కే అవకాశం ఉంది. విభిన్న చిత్రాల దర్శకుడు విక్రమ్ కె కుమార్, మాస్ ఫాలోయింగ్ ఉన్న విజయ్ దేవరకొండ కలిసి చేస్తున్న ఈ సినిమాపై ఫ్యాన్స్ లో పాజిటివ్ హోప్స్ ఉన్నాయి.