Moto Signature Now On Flipkart: చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ ‘మోటోరొలా’ తాజాగా తన సిగ్నేచర్ సిరీస్‌లో కొత్త మొబైల్‌ను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. సిగ్నేచర్ స్మార్ట్‌ఫోన్ అమ్మకాలు శుక్రవారం (జనవరి 30) నుంచి ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం ‘ఫ్లిప్‌కార్ట్’లో మొదలయ్యాయి. ఈరోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి స్మార్ట్‌ఫోన్ అమ్మకాలు అందుబాటులోకి వచ్చాయి. సిగ్నేచర్ సిరీస్ ప్రత్యేకంగా ప్రీమియం వినియోగదారుల కోసం రూపొందించబడింది. ఈ సిరీస్ ఆధునిక సాంకేతిక ఫీచర్లు, ఫాబ్రిక్-ఇన్‌స్పైర్డ్ డిజైన్, ప్రత్యేక ప్రివిలేజ్ యాక్సెస్ వంటి ప్రత్యేకతలను అందిస్తుంది.
సిగ్నేచర్ ఫోన్ మొత్తం మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంది. 12జీబీ+256జీబీ వేరియంట్ ధర రూ.59,999గా ఉంది. 16జీబీ+512జీబీ వేరియంట్ ధర రూ.64,999గా ఉండగా.. 16జీబీ+1టీబీ వేరియంట్ రూ.69,999గా కంపెనీ నిర్ణయించింది. హెచ్‌డీఎఫ్‌సీ, యాక్సిస్ బ్యాంక్ కార్డులతో కొనుగోళ్లపై రూ.5వేలు డిస్కౌంట్ ఉంది. ఎక్స్‌ఛేంజ్ బోనస్ రూ.5 వేలు లభిస్తుంది. మిలటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటెక్షన్‌తో ఈ ఫోన్ వచ్చింది. అల్యూమినియం ఫ్రేమ్ ఉంటుంది. లేటెస్ట్ ప్రొసెసర్, పటిష్టమైన బిల్డ్ క్వాలిటీ, వినూత్న డిజైన్ ఈ ఫోన్ ప్రత్యేకత. లగ్జరీ ఫోన్ల కోసం ఎదురుచూస్తున్న వినియోగదారుల కోసం ఇది ఒక ఆసక్తికర ఎంపిక.
Also Read: Brian Lara-Gambhir: గంభీర్ నిర్ణయాలు టీమిండియాకు ప్రమాదకరం.. బ్రియన్ లారా సంచలన వ్యాఖ్యలు!
మోటోరొలా సిగ్నేచర్ ఫీచర్స్:
# 6.8 ఇంచెస్ సూపర్ హెచ్‌డీ ఎల్‌టీపీఓ ఎక్స్‌ట్రీమ్ అమోలెడ్ డిస్‌ప్లే
# 165Hz రిఫ్రెష్ రేటు, 6200 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్
# ఆండ్రాయిడ్ 16 మోటోరొలా హెలోయూ
# ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 8 జన్5 ప్రాసెసర్
# ఐపీ68, ఐపీ 69 రేటింగ్
# 50 ఎంపీ ప్రైమరీ కెమెరా, 50 ఎంపీ అల్ట్రావైడ్ యాంగిల్, 50 ఎంపీ పెరిస్కోప్ సెన్సర్
# 50 ఎంపీ సెల్ఫీ కెమెరా
# 5,200 ఎంఏహెచ్ సిలికాన్ కార్బన్ బ్యాటరీ, 90W ఫాస్ట్‌ఛార్జింగ్, 50W వైర్‌లెస్ ఫాస్ట్ ఛార్జింగ్