Pakistan PM: పరువు తీసుకోవడమే పాక్ ప్రధాని పని.. ఈసారి ఏం చేశాడంటే..
- ఆసీస్‌తో తొలి టీ20లో పాక్ గెలుపు..
- గెలుపుపై పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ట్వీట్..
- అంత గొప్ప విజయం కాదని భారత మాజీ ప్లేయర్ సెటైర్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan PM: పాకిస్తాన్ రాజకీయ నాయకులు పరువు తీసుకోవడమే పనిగా పెట్టుకున్నట్లు ఉన్నారు. ఇటీవల కాలంలో పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అవుతున్నారు. తాజాగా, ఆయన ఆస్ట్రేలియాతో జరిగిన మొదటి టీ20 మ్యాచ్‌లో పాకిస్తాన్ గెలుపుపై సోషల్ మీడియా పోస్ట్ పెట్టారు. దీనిపై నెటిజన్లు పాక్ పీఎంను ఒక ఆట ఆడుకుంటున్నారు. మాజీ భారత క్రికెటర్ ఆకాష్ చోప్రా షరీఫ్ పోస్ట్‌పై సెటైర్లు వేశారు. ‘‘ఆస్ట్రేలియా -బీ టీమ్’’పై గెలవడంలో గొప్పేంటి అని ప్రశ్నించారు.
Read Also: Katasani Ram Bhupal Reddy: పవన్ కల్యాణ్‌పై కాటసాని హాట్ కామెంట్స్..
Also Read
- ICC Rankings: ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్.. టాప్‌లోకి దూసుకెళ్లిన స్మృతి మంధాన..
- Vaibhav Sooryavanshi: వైస్ కెప్టెన్ ఎందుకు చేశారన్నారు.. కెప్టెన్‌కే సలహాలు ఇస్తున్న వైభవ్.. వీడియో వైరల్!
- KL Rahul-IPL 2027: ట్రేడ్ రూమర్స్‌కు చెక్.. ఢిల్లీ క్యాపిటల్స్‌తోనే కేఎల్ రాహుల్!
- Duleep Trophy Final: ఈస్ట్ జోన్ పెద్ద స్కెచ్చే.. 2 రోజులు ఎందుకు బ్యాటింగ్ చేసిందంటే?.. బీసీసీఐ డిక్లరేషన్ రూల్ ఇదే!
ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్ ప్రారంభ మ్యాచ్‌లో పాక్ విజయం సాధించడంపై ఆయన మాట్లాడుతూ.. ‘‘మొదటి టి20ఐలో ఆస్ట్రేలియాపై అద్భుతమైన ప్రదర్శన ఇచ్చినందుకు టీమ్ పాకిస్తాన్‌కు అభినందనలు. పాకిస్తాన్ క్రికెట్‌ను బలోపేతం చేయడంలో అవిశ్రాంత కృషి చేసినందుకు చైర్మన్ పిసిబి చీఫ్ మొహ్సీన్ నఖ్వీ మరియు అతని మొత్తం జట్టును కూడా నేను అభినందిస్తున్నాను. దేశానికి గర్వకారణమైన క్షణం’’ అని ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
దీనిపై ఆకాష్ చోప్రా స్పందిస్తూ.. ప్రస్తుతం ఆస్ట్రేలియా టీంలోని కీలక ఆటగాళ్లు ఈ సిరీస్ ఆడటం లేదని, 170 పరుగుల ఆటలో 20 రన్స్ తేడాతో విజయం సాధించడం పెద్ద గొప్ప కాదని ట్వీట్ చేశారు. ఆస్ట్రేలియా టీంలో కీలమైన ఐదుగురు ఆటగాళ్లు లేకుండా పాక్‌లో ద్వైపాక్షిక సిరీస్ ఆడుతోంది. రెగ్యులర్ కెప్టెన్ మిచెల్ మార్ష్ ఈ సిరీస్‌కు దూరంగా ఉన్నారు. ట్రావిస్ హెడ్ నేతృత్వంలో ఆసీస్ బీ టీమ్ పాక్‌లో ఆడుతోంది. తొలి టీ20లో పాక్ 168/8 రన్స్ చేసింది. ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 146/8కి పరిమితమైంది. కేవలం 22 పరుగుల తేడాతో గెలవడం పెద్ద గెలుపు, దేశానికి గర్వకారణం కాదని ఆకాష్ చోప్రా చెప్పారు.
With due respect…it’s a bilateral T20i against Australia’s B team. Many main players have given it a miss. And a 20-run win in a 170 run game can’t possibly qualify as ‘electrifying’ 🫣 https://t.co/allr7esAbr
— Aakash Chopra (@cricketaakash) January 30, 2026
తాజావార్తలు
-
Anand Deverakonda : వాళ్ళ సపోర్ట్ లేకుండా ఉంటే ఏమీ చేయలేక పోయేవాడిని!
-
Sheikh Hasina Extradition: హసీనాను భారత్ నుంచి పట్టుకొచ్చి ఉరితీస్తాం.. బంగ్లాదేశ్ కఠిన వైఖరి!
-
Whether Update: ఏపీకి భారీ వర్ష సూచన.. ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు..
-
Raaka Remuneration: పుష్ప తర్వాత బన్నీ మార్కెట్ ఇదేనా? ‘రాకా’ రెమ్యునరేషన్ తెలిస్తే షాకే!
-
Vaishnavi : విజయ్ దేవరకొండ గురించి వైష్ణవి ప్రస్తావన.. బావగారు అంటూ టీజ్ చేసిన ఆడియెన్స్.. బ్లష్ అయిన వైష్ణవి
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: వైస్ కెప్టెన్ ఎందుకు చేశారన్నారు.. కెప్టెన్‌కే సలహాలు ఇస్తున్న వైభవ్.. వీడియో వైరల్!
-
Harry Potter అభిమానులకు గుడ్ న్యూస్.. Realme కొత్త స్పెషల్ ఎడిషన్ లాంచ్.!
-
Homemade Pani Puri: పానీపూరి అంటే ఇష్టమా? బయట బండి దగ్గర ఉండే టేస్ట్.. ఇంట్లోనే సులువుగా ఇలా చేసుకోండి ఇలా.!
-
Pigeons Problem: పావురాల బెడదతో విసిగిపోయారా..? ఈ చిట్కాలతో సింపుల్ గా సమస్యకు చెక్ పెట్టండి ఇలా.!
-
200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Huawei Pura X View లాంచ్..!