Janasena MLA Arava Sridhar video leak: జనసేన ఎమ్మెల్యే మరో వీడియో లీక్.. ఏకంగా అసెంబ్లీ హాల్‌లో నుంచే వీడియో..
- రోజుకో మలుపు తిరుగుతున్న జనసేన ఎమ్మెల్యే శ్రీధర్ వ్యవహారం..
- వెలుగులోకి జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ మరో వీడియో..
- అసెంబ్లీ సమావేశం జరుగుతుంటే మహిళతో వీడియో చాటింగ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Janasena MLA Arava Sridhar video leak: రైల్వేకోడూరు నియోజకవర్గానికి చెందిన జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారం రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. ఇప్పటికే వివాదాస్పదంగా మారిన ఈ వ్యవహారంలో తాజాగా మరో వీడియో వెలుగులోకి రావడం రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది. ఈసారి లీక్ అయిన వీడియోలో ఏకంగా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలోనే మహిళతో వీడియో చాటింగ్ చేసినట్లు తెలుస్తోంది.
Read Also: BJP: కాంగ్రెస్ ‘‘ఆధునిక ముస్లిం లీగ్’’.. అన్సారీ ‘‘గజినీ’’ కామెంట్స్‌పై బీజేపీ..
Also Read
అసెంబ్లీ హాల్‌లో చర్చలు కొనసాగుతుండగానే ఎమ్మెల్యే శ్రీధర్ తన మొబైల్ ఫోన్‌లో వీడియో కాల్‌లో మాట్లాడుతున్న దృశ్యాలు బయటకు రావడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. ప్రజా సమస్యలపై చర్చించాల్సిన శాసనసభ వేదికలో ఇటువంటి ప్రవర్తన ఎంతవరకు సమంజసమన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ ఘటనతో ఇప్పటికే వివాదాల్లో చిక్కుకున్న జనసేన ఎమ్మెల్యే వ్యవహారం మరింత ముదిరింది. ఇటీవల వెలుగులోకి వచ్చిన వీడియోలతో పార్టీకి ఇబ్బందికర పరిస్థితి ఏర్పడగా, తాజాగా అసెంబ్లీ హాల్‌కు సంబంధించిన వీడియో లీక్ కావడం రాజకీయంగా పెద్ద చర్చకు దారి తీసింది. ప్రజాప్రతినిధులు మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. శాసనసభ గౌరవాన్ని దెబ్బతీసేలా ఉన్న ఈ ఘటనపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి.
మొత్తానికి, రోజుకో వీడియో బయటపడుతూ జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారం రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. ఈ అంశంపై పార్టీ అధిష్టానం ఎలా స్పందిస్తుందో, అసెంబ్లీ గౌరవానికి భంగం కలిగించిన ఘటనపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సి ఉంది. ఏది ఏమైనా.. అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగానే.. సదరు మహిళకు వీడియో కాల్ చేసిన ఎమ్మెల్యే శ్రీధర్.. మరోవైపు చాటింగ్ కూడా చేస్తున్నట్టు ఉన్న ఆ వీడియో తీవ్ర చర్చకు దారితీసింది..
తాజావార్తలు
-
India vs Pakistan: పాకిస్థాన్‌ను చిత్తు చేసిన భారత్.. టీమిండియా ఖాతాలో మరో స్వర్ణం..
-
Aishwarya Lekshmi: బన్నీ – అట్లీ కాంబోలో ఈ బ్యూటీ లేనట్టే! అసలు సీక్రెట్ బయటపెట్టిన హీరోయిన్ ..
-
Minister Nara Lokesh: స్పీడ్.. సర్వీస్.. స్టెబిలిటీ.. ఏపీ అభివృద్ధిపై మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు
-
Flydubai Attack: అల్-ఖైదా ఫోటోలు, తీవ్రవాద భావాలు.. కో-పైలట్ ఉగ్రకోణం బట్టబయలు..!
-
Heart Attacks: 18ఏళ్లకే గుండెపోటు.. కారణాలు ఇవే!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!