హెపటైటిస్ లివర్‌కు వచ్చే వ్యాధి..

హెపటైటిస్‌లో ఏ,బీ, సీ,డీ,ఈ రకాలు ఉన్నాయి. 

హెపటైటిస్ ఏ, ఈలు వచ్చినా.. కొన్ని రోజుల తర్వాత తగ్గిపోతుంది.

హెపటైటిస్ బీ, సీ,డీలు దీర్ఘకాలంలో లివర్ క్యాన్సర్, లివర్ సిరోసిస్‌కు దారి తీస్తాయి.

కలుషిత ఆహారం, నీటి ద్వారా హెపటైటిస్ ఏ,ఈ వస్తాయి. వ్యాధి తనంతట తానే తగ్గిపోతుంది. 

హెపటైటిస్ బీ, సీలు రక్తం, సీమెన్, ఇతర మానవ ద్రవాల కాంటాక్ట్ వల్ల వచ్చే అవకాశం ఉంది. 

హెపటైటిస్ వ్యాధి ప్రధాన లక్షణం జాండిస్. చర్మం, కళ్లు పసుపురంగులోకి మారుతుంది.

 మద్యపానం వల్ల కూడా హెపటైటిస్ వచ్చే అవకాశం ఉంది. 

హెపటైటిస్ ఏ, బీలకు వ్యాక్సిన్లు ఉన్నాయి. శిశువు జన్మించి సమయంలో వీటిని తీసుకుంటే రక్షణ పొందవచ్చు.