గత కొద్దిరోజులుగా అమెరికా-ఇరాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఇరాన్‌లో అల్లర్లు మొదలైన దగ్గర నుంచి ట్రంప్ హెచ్చరిస్తూనే ఉన్నారు. తామేమీ తక్కువ కాదంటూ ఇరాన్ కూడా ట్రంప్‌కు వార్నింగ్‌లు ఇచ్చింది. ఈ నేపథ్యంలో మంగళవారం వైట్‌హౌస్‌లో ట్రంప్ మాట్లాడుతూ.. ఇరాన్ ఉద్దేశించిన తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.
అమెరికా అధ్యక్షుడిని హత్య చేయడంలో టెహ్రాన్ విజయం సాధిస్తే.. ఇరాన్ అనేది భూమిపై నుంచి తుడిచిపెట్టుకుపోతుందని హెచ్చరించారు. ఇప్పటికే తాను దృఢమైన సంకేతాలు ఇచ్చానని.. ఏదైనా జరిగితే మాత్రం అలా జరగడం ఖాయమని చెప్పుకొచ్చారు. న్యూస్ నేషన్ ఇంటర్వ్యూలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఇది కూడా చదవండి: Stock Market: ట్రంప్ బెదిరింపులతో మార్కెట్ కుదేల్.. భారీ నష్టాల్లో సూచీలు
డిసెంబర్ 28 నుంచి ఇరాన్‌లో ఖమేనీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు జరిగాయి. అయితే భద్రతా దళాల కాల్పుల్లో 5 వేల మంది నిరసనకారులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇరాన్‌కు ట్రంప్ హెచ్చరికలు జారీ చేశారు. నిరసనకారుల హత్యలు ఆగకపోతే అమెరికా దాడులు చేస్తోందని వార్నింగ్ ఇచ్చారు. అంతేకాకుండా అమెరికా యుద్ధ విమానాలు కూడా ఆ దిశగా ప్రయాణం చేశాయి. ఇంతలో సౌదీ, ఖతార్ మధ్యవర్తిత్వం ఆ ప్రణాళిక నుంచి ట్రంప్ వెనక్కి తగ్గారు. ఈ క్రమంలో ఖమేనీ ప్రభుత్వం మారాల్సి ఉందని పేర్కొన్నారు. దీంతో ఇరాన్ కూడా ధీటుగా కౌంటర్ ఇచ్చింది. ఖమేనీకి ఏదైనా జరిగితే అమెరికా అంతు చూస్తామని హెచ్చరించింది. ఈ నేపథ్యంలోనే తాజాగా ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఇది కూడా చదవండి: Gold Rates: మగువలకు బిగ్ షాక్.. కొత్త రికార్డ్ సృష్టించిన గోల్డ్ ధర