దర్శకుడు అనిల్ రావిపూడి బాక్సాఫీస్ వద్ద వరుస విజయాలతో ‘సక్సెస్‌ఫుల్ డైరెక్టర్’గా తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్నారు. ఇప్పటి వరకు ఆయన చేసిన సినిమాలన్నీ కూడా బ్లాక్ బస్టర్స్ అయ్యాయి. ప్రస్తుతం ఉన్న సీనియర్ హీరోల్లో ఒక్క నాగార్జున తప్పితే.. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్‌లతో సూపర్ హిట్ సినిమాలు చేశారు. రీసెంట్‌గా సంక్రాంతికి వచ్చిన మెగాస్టార్ ‘మన శంకర వరప్రసాద్ గారు’ బాక్సాఫీస్ దగ్గరు భారీ విజయాన్ని అందుకుంది. గత సంక్రాంతికి వెంకటేష్‌తో ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టిన అనిల్.. ఈసారి మెగాస్టార్‌తో మెగా హిట్ అందుకున్నారు. ఈ రెండు సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ 300 కోట్లు కలెక్షన్స్ రాబట్టిన దర్శకుడిగా రీజనల్ రేంజ్‌లో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేశారు.
Also Read: Mana Shankara Vara Prasad Garu: స్కేల్, హైప్ అవసరమేలే.. కంటెంట్ బలంతోనే ఎంఎస్‌జీ ఇండస్ట్రీ హిట్!
దీంతో.. అనిల్ రావిపూడి నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎవరితో ఉంటుందా? అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో వెంకటేష్‌తో సినిమా ఉంటుందని వార్తలు వస్తుండగా.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో కూడా ఓ సినిమా చేయబోతున్నట్టుగా టాక్ నడుస్తోంది. దిల్ రాజుకి పవన్ డేట్స్ ఇవ్వడంతో అనిల్ డైరెక్షన్‌లోనే ఆ సినిమా ఉంటుందని అంటున్నారు. దీంతో ఇద్దరిలో ఎవరితో సినిమా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. ఈ ఇద్దరిలో ఎవరితో సినిమా చేసినా.. వచ్చే సంక్రాంతికి మరో బ్లాక్ బస్టర్ మాత్రం ఖాయం. అయితే సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు సీక్వెల్ మాత్రం ఆల్మోస్ట్ ఫిక్స్ అయినట్టుగా చెబుతున్నారు. ఇందులో వెంకటేష్ హీరో కాబట్టి, పవన్‌తో ఏమైనా గెస్ట్ రోల్ ప్లాన్ చేస్తారా? అనే చర్చ కూడా మొదలైంది. పవన్, వెంకీ మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. గతంలో ‘గోపాల గోపాల’ అనే సినిమాలో కలిసి నటించారు. చిరంజీవి సినిమాలో వెంకీ గెస్ట్ రోల్‌తో మ్యాజిక్ చేసిన అనిల్.. పవర్ స్టార్‌తో అంతకుమించిన ప్లాన్ చేసే అవకాశాలు లేకపోలేదు.