Off The Record: తెలంగాణ కమలం పార్టీలో అధ్యక్షుల పంచాయితీ ఎప్పటికీ తెగదా? ఏడాది గడిచినా… పని చేయడం మానేసి కీచులాటలతోనే టైంపాస్ చేస్తున్నారా? మున్సిపల్ ఎన్నికల ముంగిట్లో ఈ సహాయ నిరాకరణ ఎటు దారి తీస్తుంది? అసలు తెలంగాణ కాషాయ దళంలో ఏం జరుగుతోంది?
తెలంగాణ బీజేపీకి కొత్త జిల్లా అధ్యక్షులను ఎన్నుకుని ఏడాది అవుతోంది. రెండు జిల్లాలకైతే…. అస్సలు ఇప్పటికీ అధ్యక్ష ఎన్నిక జరగనే లేదు. ఇక నియమించిన చాలా చోట్ల వాళ్ళని మార్చాలన్న పోరు నడుస్తోంది.తమ జిల్లా అధ్యక్షుడిని మార్చితేనే తాము పని చేస్తామంటూ కొందరు నాయకులు భీష్మించుకుని కూర్చున్నారు. వికారాబాద్ అధ్యక్షుని మార్చే దాకా స్థానిక ఎంపీ పట్టు వీడలేదు. ఆయన కేడర్‌కు అందుబాటులో ఉండడం లేదని, అసలు జిల్లా అధ్యక్షుడి స్థాయి కాదని ఒత్తిడి చేయడం తో ఒక కమిటీని వేసింది రాష్ట్ర పార్టీ. చివరకు ఆ జిల్లా అధ్యక్షుడే స్వచ్చందంగా రాజీనామా చేసేశారు.
Handloom Workers Thrift Fund: నేతన్నలకు శుభవార్త.. త్రిఫ్ట్ ఫండ్ తొలి విడతగా రూ.1.67 కోట్లు విడుదల
ఇక సిద్దిపేట జిల్లాలో కూడా ఇదే పరిస్థితి. జిల్లా అధ్యక్షుని మార్చాలంటూ అసమ్మతి నేతలు రాష్ర్ట కార్యాలయం చుట్టూ చక్కర్లు కొడుతూనే ఉన్నారు. నల్గొండ జిల్లా పంచాయతీ కొనసాగుతూనే ఉంది. అక్కడ నేతలు కొట్లాడుకున్నారు కూడా. కొత్త గూడెం జిల్లాలో ఇదే సిట్యువేషన్… అక్కడ కూడా పంచాయితీ పరిష్కారానికి రాష్ర్ట పార్టీ ఓ కమిటీని వేసింది. రీసెంట్‌గా పెద్దపల్లి జిల్లాకు చెందిన బీజేపీ నేతలు పెద్ద ఎత్తున రాష్ట్ర కార్యాలయానికి వచ్చారు. రాష్ర్ట అధ్యక్షుని కలిసి… జిల్లా అధ్యక్షుడిని మార్చాలని కోరినట్టు సమాచారం… ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా జిల్లాలే ఉన్నాయి.
కొన్ని జిల్లాల్లో ఫిర్యాదు చేసినా పట్టించుకోరంటూ సహాయ నిరాకరణ చేస్తున్నారు… జిల్లా అధ్యక్షుడు చెప్పింది కాకుండా వాళ్ళు అనుకున్నది చేస్తున్నారట… ఇక కొన్ని జిల్లాలలో ఎలాగూ జిల్లా అధ్యక్షుని అయ్యాను కదా… పని చేసినా చేయకున్నా ప్రెసిడెంట్‌గా కొనసాగుతాను అనే ఉద్దేశ్యంతో పెద్దగా యాక్టివిటీ చేయని వాళ్ళు సైతం ఉన్నారు. అలా… జిల్లా అధ్యక్షుల పని తీరు… ఆయా జిల్లాల్లో జరుగుతున్న అంతర్గత కుమ్ములాటల రిపోర్ట్ రాష్ర్ట పార్టీ దగ్గర ఉన్నట్టు తెలిసింది.
Municipal Election Schedule : త్వరలో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్..!
అయితే ఒక్క జిల్లా అధ్యక్షుని మీద చర్యలు తీసుకున్నా మిగతా జిల్లాల విషయంలో ఒత్తిడి వస్తుందని పార్టీ ఆలోచనలో పడ్డట్టు సమాచారం. వికారాబాద్ , మేడ్చల్ అర్బన్ జిల్లాలకి అధ్యక్షులు లేరు… కరీంనగర్ కు పాత అధ్యక్షుడే కొనసాగుతున్నారు….సిట్యువేషన్ లో మార్పు రాక పోతే అధ్యక్షుల మార్పు తప్పదేమోననే మాట పార్టీ వర్గాల నుండి వినిపిస్తోంది.