సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడం వల్ల ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవడం శుభకరమైనది కాబట్టి గొప్పగా జరుపుకుంటారు.

ఇది పంటలు చేతికి అందిన హార్వెస్ట్ ఫెస్టివల్ కావడంతో రైతులు అత్యంత ఆనందంగా జరుపుకుంటారు.

భోగి రోజు పాత సామాన్లను కాల్చి కొత్త జీవితాన్ని స్వాగతించడం సంకేతంగా భావిస్తారు.

పశువులు వ్యవసాయానికి ప్రధాన సహాయకులు కావడంతో కనుమ రోజు వాటిని పూజించి గౌరవిస్తారు.

ఇంటి ముంగిట అందమైన ముగ్గులు, గొబ్బెమ్మలు వేయడం సంపద, లక్ష్మీదేవి రాకను సూచిస్తుంది.

నువ్వులు, బెల్లం, చెరకు వంటి ఆహారాలు ఆరోగ్యానికి, శీతాకాల చలికి ఉపయోగకరమైనవి కాబట్టి ప్రాధాన్యత ఇస్తారు.

కుటుంబ సభ్యులు, బంధువులు ఒకచోట చేరి సంబంధాలను బలోపేతం చేసుకునే అవకాశం ఇస్తుంది.

గాలిపటాలు ఎగరవేయడం, సాంస్కృతిక కార్యక్రమాలు ఆనందాన్ని, ఉత్సాహాన్ని పెంచుతాయి.

పండుగ సందర్బంగా కోళ్ల పందాలు, జల్లికట్టు లాంటివి ప్రదర్శిస్తారు.

తెలుగు సంస్కృతి, సంప్రదాయాలకు అతి పెద్ద పండుగ కాబట్టి వైభవంగా జరుపుకుంటారు.

NTV వీక్షించే మీకు మీ కుటుంబ సభ్యులకు మకర సంక్రాంతి శుభాకాంక్షలు.