Diabetes Skin Symptoms: మీ శరీరంపై ఇలాంటి మచ్చలు ఉన్నాయా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Diabetes Skin Symptoms: ఈ రోజుల్లో డయాబెటిస్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఇకపై ఈ వ్యాధి కేవలం వృద్ధులకే పరిమితం కాదు, ఇప్పుడు ఈ వ్యాధి బారిన యువతరం కూడా పడుతోంది. డయాబెటిస్ అనేది చర్మంతో సహా శరీరంలోని అనేక భాగాలను ప్రభావితం చేస్తుంది. చాలా కాలం పాటు రక్తంలో ఎక్కువగా చక్కెర ఉన్నప్పుడు, చర్మం యొక్క సహజ రక్షణను బలహీనపరుస్తుంది. దీని ఫలితంగా చర్మ సమస్యలు వస్తాయి. మీ శరీరంపై ఇలాంటి మచ్చలు ఏమైనా ఉన్నాయి. ఆ మచ్చలు ఏంటి వాటి స్టోరీ ఏంటో చూద్దాం.
READ ALSO: Jammu Kashmir: కాశ్మీర్‌లో ‘ఉగ్ర’వేట.. ఏడుగురు సైనికులకు గాయాలు..
Also Read
- Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
- Cardiac Arrest: కార్డియాక్ అరెస్ట్ వచ్చినప్పుడు ఈ ఒక్క పని ప్రాణాలు కాపాడొచ్చు.. ఒక్క నిమిషం ఆలస్యమైనా..
- Kitchen Sink Tips: గిన్నెలు తోమేటప్పుడు బట్టలు తడుస్తున్నాయా? రూపాయి ఖర్చు లేకుండా ఈ 5 ట్రిక్స్ ట్రై చేయండి
- Veg Omelette: గుడ్డు లేకుండానే గుమగుమలాడే "వెజ్ ఆమ్లెట్".. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ చేసుకుంటారు.!
నిజానికి కొన్ని సందర్భాల్లో చర్మ మార్పులు క్రమంగా సంభవిస్తాయి. కాబట్టి చాలా మంది ప్రజలు మార్పులను లైట్ తీసుకొని పట్టించుకోవడం మానేస్తారు. అయితే చర్మంపై కనిపించే సంకేతాలు మధుమేహం యొక్క ముందస్తు హెచ్చరిక సంకేతం కావచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. అందువల్ల ఈ సంకేతాలను ముందుగానే గుర్తించడం చాలా ముఖ్యం అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పలువురు వైద్య నిపుణులు మాట్లాడుతూ.. వివిధ చర్మ మార్పులకు డయాబెటిస్ కారణమవుతుందని వివరించారు. కొంత మందికి తరచుగా దురద లేదా మంట అనిపించవచ్చు. చర్మంపై ముఖ్యంగా మెడ, చంకలు లేదా తొడల చుట్టూ నల్లటి మచ్చలు కూడా డయాబెటిస్‌కు ఒక సంకేతం కావచ్చని పేర్కొన్నారు. చిన్నచిన్న గాయాలు నయం కావడానికి ఎక్కువ టైం పట్టడం మధుమేహం యొక్క ముఖ్య లక్షణంగా చెప్పవచ్చని తెలిపారు.
ఏం చేయాలంటే..
ఇలాంటి మార్పులను మీరు గమనిస్తే వెంటనే మీ రక్తంలో చక్కెరను తనిఖీ చేసుకోవడం ముఖ్యం అని చెబుతున్నారు. అలాగే మీ భోజనంలో సమతుల్య ఆహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, మీ వైద్యుడు సూచించిన మందులు తీసుకోవడం చాలా ముఖ్యం అని పేర్కొన్నారు. అలాగే ఎక్కువ రసాయనాలు ఉన్న ఉత్పత్తులను వాడకుండా, చర్మానికి అనుకూలమైన ఉత్పత్తులను ఎంచుకోవాలని చెప్పారు. ఏవైనా ఇన్ఫెక్షన్లు లేదా గాయాలు తగ్గకపోతే వెంటనే వైద్యుడిని సంప్రదించండి.
వీటిని ట్రై చేయండి..
ప్రతిరోజూ మీ రక్తంలో చక్కెర స్థాయిని తనిఖీ చేయండి.
తగినంత నీరు తాగాలి.
చర్మం పొడిగా ఉండనివ్వకండి.
ఏవైనా కొత్త చర్మ మార్పుల గుర్తిస్తే వైద్యుడిని సంప్రదించండి.
READ ALSO: Tejashwi Yadav: లాలూ వారసుడి పట్టాభిషేకానికి ఏర్పాట్లు.. ఆసక్తికరంగా బీహార్ రాజకీయాలు!
తాజావార్తలు
-
Explainer: అక్కడికి పోతే… అటు నుంచి అటే పోతారు..!
-
Nana Patekar: షాకింగ్.. నానా పటేకర్ మృతిపై అనుమానాలు? అసహజ మరణం కింద కేసు నమోదు!!
-
Vanitha TV 18th Anniversary Special Song: స్త్రీ శక్తికి సలాం.. ‘వనిత టీవీ’ 18వ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక పాట..
-
Vaibhav Sooryavanshi: వినోద్ కాంబ్లీ గతి ఏమైందో చూశావా?.. వైభవ్‌కు టీమిండియా మాజీ దిగ్గజం వార్నింగ్!
-
Jantar mantar: దేశ రాజధాని స్తంభించబోతోందా?
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!