Palli Chattambi: తెలుగులోకి టోవినో థామస్ సినిమా.. అసలేంటీ పళ్లి చట్టంబి?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మలయాళ స్టార్ హీరో టొవినో థామస్ నటిస్తున్న లేటెస్ట్ పీరియాడిక్ యాక్షన్ డ్రామా “పళ్లి చట్టంబి”, తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన మోషన్ పోస్టర్‌ను విడుదల చేసిన మేకర్స్, సినిమా విడుదల తేదీని కూడా అధికారికంగా ప్రకటించారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఏప్రిల్ 9న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది, ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్ ఫిలింస్ మరియు సి క్యూబ్ బ్రోస్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్లపై నౌఫల్, బ్రిజీష్, చాణుక్య చైతన్య చరణ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ‘జన గణ మన’ వంటి సెన్సేషనల్ హిట్ చిత్రానికి దర్శకత్వం వహించిన డిజో జోస్ ఆంటోనీ ఈ సినిమాను రూపొందిస్తుండటం విశేషం, కయదు లోహర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, విజయరాఘవన్, సుధీర్ కరమన వంటి సీనియర్ నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
Also Read :Malavika Mohanan : ప్రొడ్యూసర్లు నమ్మితే.. హీరోయిన్లు కూడా రికార్డులను తిరగరాస్తారు
Also Read
- Bigg Boss 10 Telugu Live: బిగ్‌బాస్ సీజన్ 10 లైవ్ అప్డేట్స్.. హౌస్‌లోకి కంటెస్టెంట్స్ ఎంట్రీ..
- Bigg Boss 10 Telugu: బిగ్‌బాస్ హౌస్‌లోకి 16 మంది.. ఆ పూర్తి లిస్ట్ ఇదిగో..
- TFPC: హోరాహోరీగా ఫిలిం ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఎన్నికలు.. గెలిచింది ఎవరెవరు అంటే ?
- Mahatma Gandhi: గాంధీగా మారిన మనోజ్ బాజ్‌పేయి.. ఆ 21 రోజుల కథతో వస్తున్న కొత్త సినిమా!
ఈ సినిమా 1950, 60ల కాలం నాటి సామాజిక పరిస్థితుల నేపథ్యంలో సాగే పీరియాడిక్ మూవీగా రూపొందుతోంది, విడుదలైన మోషన్ పోస్టర్ సినిమాలోని గాంభీర్యాన్ని, ఆనాటి వాతావరణాన్ని కళ్ళకు కట్టినట్లు చూపుతోంది. టొవినో థామస్ తన కెరీర్‌లోనే ఇప్పటివరకు చేయని ఒక వైవిధ్యమైన లుక్‌లో కనిపిస్తుండటంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి, ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు మలయాళం, తమిళం, హిందీ మరియు కన్నడ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేస్తున్నారు. సినిమాపై అంచనాలు భారీగా ఉన్నప్పటికీ, తెలుగులోనూ అదే మలయాళ టైటిల్ “పళ్లి చట్టంబి”ని కొనసాగించడంపై ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చ మొదలైంది.
తెలుగు పదాలకు ఏమాత్రం సంబంధం లేని, అర్థం కాని మలయాళ పదాలనే టైటిల్స్‌గా పెట్టడం పట్ల భాషాభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. “అర్థం పర్థం లేని పేర్లు పెడితే మేమెందుకు చూడాలి?” అని కొందరు ప్రశ్నిస్తుంటే, “మన తెలుగు సినిమాలను అక్కడ విడుదల చేసినప్పుడు ఇలాగే పరభాషా టైటిల్స్ పెడితే వాళ్ళు ఆదరిస్తారా?” అంటూ నెటిజన్లు నిలదీస్తున్నారు. డబ్బింగ్ సినిమాలకు కూడా తెలుగు నేటివిటీ ఉట్టిపడేలా పేర్లు పెట్టాలని, కేవలం కమర్షియల్ లెక్కల కోసం అసలు అర్థం తెలియని టైటిల్స్‌ను రుద్దడం సరికాదని విమర్శలు వస్తున్నాయి. మరి ఈ వివాదంపై చిత్ర యూనిట్ ఎలా స్పందిస్తుందో చూడాలి.
తాజావార్తలు
-
Bigg Boss 10 Telugu Live: బిగ్‌బాస్ సీజన్ 10 లైవ్ అప్డేట్స్.. హౌస్‌లోకి కంటెస్టెంట్స్ ఎంట్రీ..
-
NTR Bharosa Pensions: ఎన్టీఆర్ భరోసా పింఛన్లు.. దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ఇలా..
-
Iran-Israel War: ఒకేసారి నాలుగు వైపుల నుంచి ఇజ్రాయెల్‌పై దాడి? ఇరాన్ భారీ వ్యూహం
-
Temple Tourism: అమరావతికి సరికొత్త కాంతి.. తిరుమల తర్వాత ఆ స్థాయిలో అక్కడ శ్రీవారి క్షేత్రం..
-
Harish Rao : అసెంబ్లీలో కాంగ్రెస్‌కు చుక్కలు చూపిస్తాం
ట్రెండింగ్
-
Asia Cup 2026: భారత్ చేతిలో 55 పరుగులకే ఆలౌట్.. అయినా పాక్‌దే ఆసియా కప్ టైటిల్ అంటున్న కోచ్!
-
Harmanpreet Kaur History: హర్మన్‌ప్రీత్ కౌర్ నయా చరిత్ర.. క్రికెట్ హిస్టరీలోనే మొట్టమొదటి కెప్టెన్!
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!