గాజాలో పాలన కోసం ట్రంప్ శాంతి మండలిని ఏర్పాటు చేస్తున్నాన్నట్లు ప్రకటించారు. అంతేకాకుండా ఈ శాంతి మండలిలో భారత్‌తో పాటు అనేక దేశాలను ట్రంప్ ఆహ్వానించారు. అయితే ఈ శాంతి మండలిని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తొలుత వ్యతిరేకించారు. తాజాగా మనసు మార్చుకున్నారు.
గాజా పునర్నిర్మాణం కోసం.. అలాగే విస్తృత సంఘర్షణ పరిష్కారం లక్ష్యంగా జనవరి 15, 2026న అమెరికా నేతృత్వంలోని బృందం ఏర్పాటు చేసే ‘బోర్డ్ ఆఫ్ పీస్’లో చేయాలని అధ్యక్షుడు ట్రంప్ చేసిన ఆహ్వానాన్ని నెతన్యాహు అంగీకరించినట్లుగా బుధవారం ఇజ్రాయెల్ పీఎంవో తెలిపింది. ప్రపంచ నాయకులతో కూడిన శాంతి మండలిలో సభ్యుడిగా చేరడానికి ఇజ్రాయెల్‌కు అభ్యంతరం లేదని పేర్కొంది. ట్రంప్ ఆహ్వానాన్ని ఇజ్రాయెల్ అంగీకరిస్తున్నట్లు ప్రధానమంత్రి కార్యాలయం ప్రకటించింది.
ఇది కూడా చదవండి: Madras High Court: ఉద్దేశపూర్వకంగానే సనాతన ధర్మంపై మాట్లాడారు.. ఉదయనిధి స్టాలిన్‌ను తప్పుపట్టిన కోర్టు
జనవరి 20న ట్రంప్ మాట్లాడుతూ.. ఐక్యరాజ్యసమితి ‘‘నాకు ఎప్పుడూ సహాయం చేయలేదని.. గాజా బోర్డును ప్రత్యామ్నాయంగా ప్రకటించింది’’. అని అన్నారు. ఇదిలా ఉంటే బోర్డు ఇంకా అధికారికంగా నిర్మాణం కాలేదు. ట్రంప్ దావోస్ పర్యటనతో ఒక రూపు వచ్చే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. ఇదిలా ఉంటే బోర్డులో చేరబోమని ఫ్రాన్స్ ఇప్పటికే ప్రకటించింది. గ్రీన్‌లాండ్ వ్యవహారంలో అమెరికా-యూరోపియన్ దేశాల మధ్య వార్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో శాంతి మండలిలో చేరేందుకు కొన్ని దేశాలు విముఖత చూపిస్తున్నాయి. ఇక భారత్ చేరుతుందో లేదో ఇంకా వెల్లడించలేదు.
Prime Minister's Office announcement:
Prime Minister Benjamin Netanyahu has announced that he accepts the invitation of US President Donald Trump and will become a member of the Board of Peace, which is to be comprised of world leaders.
— Prime Minister of Israel (@IsraeliPM) January 21, 2026