Off The Record: బీజేపీ కొత్త అధ్యక్షుడికి తెలంగాణ అగ్ని పరీక్ష అవబోతోంతా? ఆయన ముందున్న ప్రయారిటీ టార్గెట్స్‌లో తెలంగాణ కూడా ఒకటా? మేం మోనార్క్‌లం అన్నట్టుగా ఉన్న రాష్ట్ర కాషాయ నేతల్ని ఆయన సెట్ చేస్తారా? లేక గతంలోని వాళ్ళలాగే వదిలేస్తారా? కొత్త అధ్యక్షుడి గురించి రాష్ట్ర పార్టీలో జరుగుతున్న చర్చ ఏంటి?
Read Also: Donald Trump: యూఎస్ గ్రోత్ ఇంజన్.. యూరప్ దేశాలు పతనం..
బీజేపీ కొత్త జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబిన్ ఎన్నికయ్యారు. ఆయన బాధ్యతల స్వీకారంతో సంబరాలు చేసుకుంటున్నాయి పార్టీ శ్రేణులు. మంచి ఆర్గనైజర్, చత్తీస్‌గఢ్‌లో పార్టీని ఒంటిచేత్తో గెలిపించారంటూ గొప్పగా చెప్పుకుంటున్నారు. ఓటమి ఎరుగని నాయకుడని కూడా పొగిడేసుకుంటున్నారు. అంత వరకు బాగానే ఉన్నా.. సరిగ్గా ఇక్కడే తెలంగాణ కాషాయదళంలో కొత్త మొలకలు వస్తున్నాయి. ఇప్పటి వరకు అయన ఏంటి, ఏం చేశారన్నది పక్కనపెడితే.. ఇక మీదట ఏం చేయబోతున్నారన్న చర్చలు మొదలయ్యాయి బీజేపీలో. తెలంగాణలో అధికారం బీజేపీకి కలగానే మిగిలిపోతోంది. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనాసరే ఆ కలను సాకారం చేసుకోవాలన్నది ఆ పార్టీ నేతల లక్ష్యం. కానీ.. అదంత తేలిగ్గా లేదన్న టాక్ నడుస్తున్న టైంలో… గేమ్ ఛేంజర్‌గా పేరున్న నితిన్ నబిన్ పార్టీ పగ్గాలు చేపట్టడంతో తెలంగాణ బీజేపీ నాయకుల్లో కూడా ఆశలు పెరుగుతున్నాయి.
Read Also: Off The Record: రసవత్తరంగా మారుతున్న చేవెళ్ళ కాంగ్రెస్ రాజకీయం
ఇప్పటి వరకు అధికారంలోకి రాని రాష్ట్రాల్లో గెలిచి సత్తా చాటితే అయన గ్రాఫ్ అనూహ్యంగా పెరుగుతుందన్న అభిప్రాయం కూడా ఉంది. దీంతో నితిన్ నబిన్ నాయకత్వంలోనైనా తెలంగాణ బీజేపీకి మంచి రోజులు వస్తాయా…. కేంద్ర పార్టీ ప్రత్యేక దృష్టి పెడుతుందా అన్న డిస్కషన్ ముమ్మరమైంది. ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం చాలా మంది ఢిల్లీ పెద్దలు తెలంగాణ అంటేనే భయపడుతున్నారట. ఇక్కడ పార్టీని గాడిన పెట్టడం అంతా సులువు కాదని అంతర్గత చర్చల్లో కొందరు కుండబద్దలు కొట్టేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో… నితిన్ అన్నా.. తెలంగాణను పట్టించుకుంటారా? లేక మీ చావు మీరు చావండంటూ గతంలోని వాళ్ళలాగే వదిలేస్తారా అన్న చర్చలు సైతం ఉన్నాయి. స్వయంగా ప్రధాని మోడీ చెప్పినా మారని తెలంగాణ బీజేపీ నాయకుల్ని కొత్త అధ్యక్షుడు ఎలా మారుస్తారన్నది కూడా ఆసక్తికరంగా మారింది. జేపీ నడ్డాకి తెలంగాణ నేతల గురించి తెలుసు కాబట్టే.. ఆయన టచ్ మీ నాట్ అన్నట్టుగా వ్యవహరించారన్న అభిప్రాయం ఉంది. ఇప్పుడు నితిన్ నబిన్ మాత్రం ఫ్రష్ మైండ్‌తో వస్తారు కాబట్టి… రాష్ట్ర పార్టీని గాడిన పెడతారని, అదే జరిగితే ఆయన హీరో అవుతారని కూడా చెప్పుకుంటున్నాయి బీజేపీ శ్రేణులు. ఈ పరిస్థితుల్లో కొరకరాని కొయ్యలను దారిన పెడతారా, ఎవరికి వారే మోనార్క్‌ల్లా వ్యవహరిస్తున్న నేతలకి పగ్గాలు వేస్తారా.. అన్నది చూడాలంటున్నారు పొలిటికల్ పండిట్స్. ఇది ఆయనకు చాలా పెద్ద టాస్క్ అన్న అభిప్రాయం బలంగా ఉంది రాజకీయవర్గాల్లో.