Kavitha: మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసే ఆసక్తి ఉన్న వారికి జాగృతి మద్దతు ఇస్తుందని జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. తాజాగా మీడియాతో చీట్‌చాట్‌లో ఆమె మాట్లాడుతూ.. వారికి కామన్ సింబల్ కోసం కొన్ని జాతీయ పార్టీలతో మాట్లాడుతున్నామని తెలిపారు. కొత్త జిల్లాల ఏర్పాటుతో ఉద్యోగులు, యువతకు నష్టం జరిగిందని.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఐదు శాతం ఓపెన్ కోటాను నాన్ లోకల్ గా మార్చడంతో రాష్ట్ర యువతకు నష్టం జరుగుతోందన్నారు. జాగృతి తరఫున అధ్యయనం చేస్తున్నాం, జిల్లాల పునర్విభజన కమిషన్ ఏర్పాటు చేస్తే నివేదిక ఇస్తామన్నారు. కొత్త పార్టీ ఏర్పాటు కసరత్తు వేగంగా జరుగుతోందని.. జీహెచ్ఎంసీ ఎన్నికల నాటికి ప్రక్రియ పూర్తవుతుందో లేదో చూడాలన్నారు. ఎన్నికల కమిషన్ వద్ద కూడా అడ్డంకులు సృష్టించే అవకాశం లేకపోలేదని అభిప్రాయపడ్డారు. పార్టీకి ఇంకా ఏ పేరు అనుకోలేదు, తెలంగాణ రాష్ట్ర జాగృతి సమితి అని కొందరు సూచించారని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏ అంశానికి కూడా న్యాయం చేస్తారన్న నమ్మకం తనకు లేదని.. నైనీ బొగ్గు గని అంశం కంటే సింగరేణికి కొత్త బొగ్గు గనులు వచ్చేలా చూడాలన్నారు.
READ MORE: Hanumantha Rao: కుక్కలు ఓకే.. భర్తలను భార్యలు చంపుతున్నారుగా.. వారికి వీహెచ్ కీలక సూచనలు..
బీఆర్ఎస్ ఆ అంశం గురించి మాట్లాడకుండా నైనీ అంశాన్ని పట్టుకొంది.. సింగరేణిలో సైట్ విజిటింగ్ సర్టిఫికెట్ విధానం ఎప్పట్నుంచో ఉంది, కాంగ్రెస్ వచ్చిన తర్వాత దాన్ని ప్రధాన నిబంధనగా పెట్టారు, కొంత మందికి మాత్రమే సెలెక్టివ్ గా ఇస్తున్నారని కవిత అన్నారు. విచారణ చేయించాల్సిన కాంగ్రెస్ నేతలు లేఖ రాయాలని కోరడం విడ్డూరంగా ఉందన్నారు. జాగృతి అధికారంలోకి వచ్చిన తర్వాత 2014 నుంచి సమగ్ర విచారణ చేస్తామని.. గతంలో సర్పంచులను కలవని వారు ఇప్పుడు వారితో కలిసి ఫోటోలు దిగుతున్నారు, సంతోషమన్నారు. దాంతో సామాజిక తెలంగాణ వైపు కొంత మేర అడుగులు పడుతున్నాయని చెప్పారు.. కేసీఆర్ కు నోటీసులు ఇస్తారన్న అంశం గురించి తనకు తెలియదు, తనేను ఇప్పుడు బీఆర్ఎస్ లో లేనంటు సమాధానమిచ్చారు. జీహెచ్ఎంసీ 300 డివిజన్ల ప్రతిపాదన బీఆర్ఎస్ హయంలోనిదే, కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ప్రతిపాదనను కొనసాగిస్తోందని చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. జాగృతి జనంబాట ముగింపు మార్చ్ పదో తేదీన అనుకుంటున్నాం.. ఆ తర్వాత బీఆర్ఎస్, కాంగ్రెస్ మంత్రుల అవినీతిపై ర్యాంకులు ప్రకటిస్తామని స్పష్టం చేశారు. తన టార్గెట్ హరీశ్ రావు, ఇంకా పెద్ద టార్గెట్ ఉందన్నారు. కేటీఆర్ ను కూడా విమర్శించినట్లు చెప్పారు. బలమైన రాజకీయ భవిష్యత్ కోసం పటిష్ట ఎజెండా సిద్దం చేసుకుంటున్నాను, ఈ దశలో నాకు నేనుగా ఎవరితోనూ మాట్లాడనని తెలిపారు. రాజకీయ కన్సల్టెన్సీలు ఎవరినీ తాను సంప్రదించలేదు, నన్ను సంప్రదించిన కొంత మందితో మాట్లాడానన్నారు. .