IND T20 Records: టీ20ల్లో భారత్ అరుదైన రికార్డు.. ఏకంగా 44 సార్లు, ఏ జట్టుకు సాధ్యం కాలే!
- టీ20 క్రికెట్‌లో టీమిండియా మరో అరుదైన రికార్డు
- 44 సార్లు 200కు పైగా స్కోర్లు నమోదు
- దక్షిణాఫ్రికాపై అత్యధికంగా 8 సార్లు 200+ స్కోర్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో టీమిండియా మరో అరుదైన రికార్డును ఖాతాలో వేసుకుంది. ఇప్పటి వరకు టీ20ల్లో భారత్ మొత్తం 44 సార్లు 200కు పైగా స్కోర్లు నమోదు చేసింది. నాగపూర్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టీ20లో 238 పరుగులు చేయడంతో టీమిండియా ఖాతాలో ఈ రికార్డు చేరింది. టీ20 ఫార్మాట్‌లో ఏ జట్టు కూడా ఇన్నిసార్లు 200కు పైగా స్కోర్లు చేయలేదు. బ్యాటింగ్‌లో భారత జట్టు స్థిరత్వం, లోతైన బ్యాటింగ్ లైనప్ ఎంత బలంగా ఉందో ఈ రికార్డు స్పష్టం చేస్తోంది. ప్రత్యర్థి జట్ల వారీగా చూస్తే.. దక్షిణాఫ్రికాపై భారత్ అత్యధికంగా 8 సార్లు 200+ స్కోర్లు చేసింది.
దక్షిణాఫ్రికా తర్వాత ఆస్ట్రేలియాపై 7 సార్లు 200+ స్కోర్లు చేసింది. శ్రీలంకపై 6 సార్లు ఈ ఘనతను సాధించింది. ఇంగ్లాండ్, న్యూజిలాండ్‌లపై 5 సార్లు 200కి పైగా పరుగులు చేసింది. వెస్టిండీస్, ఐర్లాండ్, అఫ్గానిస్తాన్‌లపై 3 సార్లు ఈ మార్క్‌ను దాటింది. బంగ్లాదేశ్‌పై 2 సార్లు.. జింబాబ్వే, నేపాల్‌పై ఒక్కసారి 200+ స్కోర్లను భారత్ సాధించింది. ఈ గణాంకాలు చూస్తే టీమిండియా బ్యాటింగ్ పవర్ ఎంత బలంగా ఉందో అర్థమవుతుంది.
Also Read
- Sahibzada Farhan: అభిషేక్ శర్మ, విరాట్ కోహ్లీ రికార్డులు బద్దలు.. పాకిస్థాన్ కొత్త కెప్టెన్ వీర విహారం..
- Jasprit Bumrah: బుమ్రా లేని టీమిండియా.. 250 రన్స్ చేసినా ఓటమి.. అసలు లోపం ఎక్కడుంది?
- WTC Points Table 2026: పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఆసీస్.. భారత్ ప్లేస్ ఎక్కడో తెలుసా?
- IND Vs WI 4th T20: ఉప్పల్‌లో 300 పరుగుల లోడింగ్..! సాధ్యసాధ్యాలివే..
Also Read: Mogudu Title Promo: మొగుడు మొగుడులా ఉండటమే ముఖ్యం.. విశాల్ ‘మొగుడు’ ప్రోమో అదుర్స్!
టాప్ ఆర్డర్ నుంచి మిడిల్ ఆర్డర్, ఫినిషర్ల వరకు ప్రతి ఒక్కరూ టీ20 ఫార్మాట్‌కు తగ్గట్టుగా దూకుడుగా ఆడగలగడం భారత్‌కు ప్రధాన బలం. ముఖ్యంగా యంగ్ ప్లేయర్లు, ఆల్‌రౌండర్ల ప్రభావంతో భారత జట్టు ఏ సమయంలోనైనా భారీ స్కోరు చేసే స్థాయికి చేరుకుంది. టీ20 వరల్డ్ కప్ 2026కి సన్నాహకంగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న సిరీసులో ఇలాంటి రికార్డులు టీమిండియాకు మరింత ఆత్మవిశ్వాసాన్ని ఇస్తున్నాయి. భవిష్యత్తులో ఈ సంఖ్య మరింత పెరగడం ఖాయమని క్రికెట్ అభిమానులు నమ్మకంగా ఉన్నారు.
తాజావార్తలు
-
AP Local Body Election Schedule 2026: ఏపీలో స్థానిక ఎన్నికల నగారా.. పూర్తి షెడ్యూల్ ఇదే..
-
Yash: చేసిన తప్పునే మళ్ళీ మళ్ళీ చేస్తున్న యష్?
-
Airtel rs348 vs rs349 Recharge Plan: కేవలం రూ.1 తేడా.. ఎయిర్‌టెల్‌లో రూ.348, రూ.349 ప్లాన్స్.. ఏది బెస్ట్ అంటే?
-
Tamannaah: బోల్డ్ సీక్వెల్లో తమన్నా? విద్యాబాలన్ మార్క్‌ను దాటగలదా!
-
Mary Millben: CJPకి అమెరికా నుంచి నిధులు.. అమెరికన్ సింగర్ సంచలన ఆరోపణలు..
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..