భారత సినీ అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్న సినిమా ‘వారణాసి’. సూపర్‌స్టార్ మహేశ్ బాబు హీరోగా, దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళిపై తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై తాజాగా క్రేజీ అప్‌డేట్ వచ్చింది. వారణాసి చిత్రం 2027లో విడుదల కానున్నట్లు మేకర్స్ సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించారు. ‘COMING IN 2027’ అనే క్యాప్షన్‌తో విడుదల చేసిన పోస్టర్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. విషయం తెలిసిన సూపర్‌స్టార్ ఫాన్స్ ఆనందపడిపోతున్నారు.
2 నెలల క్రితం హైదరాబాద్‌లో నిర్వహించిన ఈవెంట్‌లో సినిమా టైటిల్‌ను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ప్రత్యేక వీడియో రిలీజ్ చేయడమే కాకుండా.. విడుదల సంవత్సరాన్ని కూడా వెల్లడించారు. అయితే రాజమౌళి మూవీ అనుకున్న షెడ్యూల్‌కు పూర్తవుతుందా? అనే ప్రశ్నలు సోషల్ మీడియాలో వచ్చాయి. ఈ నేపథ్యంలో మేకర్స్ మరోసారి స్పందించింది. వారణాసిని 2027లో రిలీజ్ చేస్తామని మరోసారి స్పష్టం చేశారు. 2027లో ఉగాది లేదా శ్రీరామనవమి పండుగకు సినిమా రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మహేశ్ బాబు సరసన ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తుండగా.. విలన్ పాత్రలో మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్నారు.
Also Read: IND vs NZ 1st T20: టీమిండియాదే బ్యాటింగ్.. ఇషాన్ కిషన్ ఇన్, ప్లేయింగ్ 11 ఇదే!
పవిత్ర నగరం వారణాసి నేపథ్యంగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. టైటిల్ నుంచే ఈ చిత్రం ఆధ్యాత్మికత, చరిత్ర, భావోద్వేగాల సమ్మేళనంగా ఉండబోతుందన్న అంచనాలు ఏర్పడ్డాయి. తాజాగా విడుదల చేసిన అప్‌డేట్‌తో సినిమాపై క్యూరియాసిటీ మరింత పెరిగింది. 2027 రిలీజ్ అని అధికారికంగా ప్రకటించడంతో ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో, పక్కా ప్లానింగ్‌తో తెరకెక్కిస్తున్నారనే విషయం స్పష్టమవుతోంది. స్కేల్, విజువల్స్, కథనంపై మేకర్స్ ఎలాంటి రాజీ పడకుండా పని చేస్తున్నారన్న సంకేతాలు ఈ అప్‌డేట్ ద్వారా కనిపిస్తున్నాయి. ఇప్పటికే టైటిల్ అనౌన్స్‌మెంట్‌తో ఆసక్తి రేపిన వారణాసి.. ఇకపై వచ్చే ప్రతి అప్‌డేట్‌తో అంచనాలను మరింత పెంచే అవకాశముంది.
COMING IN 2027.#VARANASI pic.twitter.com/yuInvgJwIk
— Varanasi (@VaranasiMovie) January 21, 2026