Sweet Capital Of India: భారతదేశానికి స్వీట్స్‌తో ఉన్న అనుబంధం మాటల్లో చెప్పలేనిది. పండుగలు, శుభకార్యాలతో పాటు ప్రతి చిన్న ఆనంద క్షణాల్లో అయినా సరే తీపి లేకుండా పూర్తి కాదనే చెప్పాలి. ఇక, భారత్ లోని ప్రతి ప్రాంతం తనదైన స్వీట్స్‌తో ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. అయితే, భారతదేశ స్వీట్ లెగసీలో ఒక నగరం మాత్రం ప్రత్యేకంగా నిలిచింది. తన గొప్ప వంటకాల చరిత్ర, సంప్రదాయ రుచులు, ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయిన డిజర్ట్స్‌తో ఈ నగరం ‘సిటీ ఆఫ్ స్వీట్స్ ఇండియా’గా పేరొందింది. మరి ఆ నగరం ఏదో ఇప్పుడు మనం తెలుసుకుందాం?..
Read Also: Gold Rates: గోల్డ్ లవర్స్‌కు గుడ్‌న్యూస్.. తగ్గిన వెండి, బంగారం ధరలు
భారతదేశ స్వీట్ క్యాపిటల్..
భారతదేశం స్వీట్స్‌కు అసలైన చిరునామాగా నిలిచిన నగరం పశ్చిమ బెంగాల్ రాష్ట్ర రాజధాని కోల్‌కతా. అయితే, బెంగాల్ సంప్రదాయ తీపి వంటకాలు విభిన్న రుచులు, శతాబ్దాల నాటి రెసిపీలు, కళాత్మక తయారీ శైలి ఈ నగరం యొక్క స్వీట్ కల్చర్ ప్రత్యేకత అని చెప్పాలి. చక్కెర, తాజా పనీర్ (చెన్నా), ఖర్జూరం బెల్లం ( నోలెన్ గుర్), సుగంధ ద్రవ్యాలతో తయారయ్యే బెంగాలీ స్వీట్స్.. ఇక్కడి సంస్కృతితో విడదీయలేని అనుబంధాన్ని పెన వేసుకున్నాయి. అందుకే కోల్‌కతా అంటే స్వీట్స్ లవర్స్ కు స్వర్గధామంగా నిలుస్తుంది.
Read Also: APSRTC అద్దె బస్సుల యాజమాన్యాలు సమ్మె.. రూ. 20 వేలు పెంచాలని డిమాండ్
కోల్‌కతాలో 5 అత్యంత ప్రజాదరణ పొందిన డిజర్ట్స్
1. రసగుల్లా
తాజా పనీర్, రవ్వ ( సేమోలినా)తో పాటు లైట్ షుగర్ సిరప్‌లో నానబెట్టి తయారు చేసే రసగుల్లా.. కోల్‌కతా స్వీట్స్‌లో కింగ్ గా నిలిచింది. తేలికైన టెక్స్చర్, మితమైన తీపి దీని ప్రత్యేకత.. ఈ స్వీట్‌కు GI ట్యాగ్ కూడా లభించింది.
2. సందేష్
సాఫ్ట్‌గా, స్మూత్‌గా ఉండే చెన్నా సందేష్, చక్కెరతో తయారయ్యే సున్నితమైన బెంగాలీ స్వీట్. ఇది తాజా చెన్నాతో (పన్నీర్) తయారు చేస్తారు, కాబట్టి దీన్ని చెన్నా సందేష్ స్వీట్ అని పిలుస్తారు. ఇది పాలు+ చక్కెరతో తయారుచేసే ప్రముఖ మిఠాయి. కుంకుమపువ్వు, పిస్తా, చాక్లెట్ లాంటి ఫ్లెవర్స్‌లో దొరుకుతుంది. నట్ ట్యాపింగ్స్, సిల్వర్ లీఫ్ డెకరేషన్‌తో ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తుంది.
3. మిష్టి దోయ్
నెమ్మదిగా మరిగించిన పాలు, చక్కెరను మట్టి పాత్రల్లో తోడు పెట్టి తయారు చేసే బెంగాలీ స్వీట్ మిష్టి దోయ్. రిచ్, క్రీమీ టెక్స్చర్, ప్రత్యేకమైన క్యారమలైజ్డ్ ఫ్లేవర్‌స్ కి ఇది హైలైట్. ఇది రుచిలో ఎంత కంఫర్టింగ్‌గా ఉంటుందో, అంతే లగ్జరీ ఫీలింగ్ ఇస్తుంది.
4. చమ్ చుమ్
ఓవల్ ఆకారంలో, రంగురంగులుగా కనిపించే చమ్ చుమ్ పన్నీరుతో తయారై చక్కెర పనకంలో నానుతుంది. పైగా కొబ్బరి పొడి లేదా ఖోవాతో గార్నిష్ చేస్తారు. పండుగ సమయాల్లో ఇది తప్పనిసరి స్వీట్.
5. నోలెన్ గుర్ స్వీట్స్
కోల్‌కతా శీతాకాలంలో ఎంతో ప్రత్యేకంగా కనిపించే తీపి వంటకం నోలెన్ గుర్. ఖర్జూరం బెల్లం నుంచి వచ్చే స్మోకీ, నేచురల్ తీపి రుచితో తయారయ్యే నోలెన్ గుర్ సందేష్, నోలెన్ గుర్ రసగుల్లా వంటి స్వీట్స్ ఇది. ఈ సీజనల్ స్పెషల్‌గా ఫేమస్ అయింది.
అయితే, కోల్‌కతా స్వీట్ కల్చర్ భారతదేశ గొప్ప వంటకాల వారసత్వానికి నిలువెత్తు నిదర్శనం అని చెప్పాలి. మీకు స్వీట్స్ అంటే ఇష్టమైతే.. కోల్‌కతా మీ లిస్ట్‌లో తప్పకుండా ఉండాల్సిన డెస్టినేషన్. ఒక్కసారి వెళ్లి రుచి చూస్తే.. ఆ తీపి జ్ఞాపకాలను జీవితాంతం మర్చిపోలేరు..