YS Jagan Padayatra: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ అంటే.. వెంటనే పాదయాత్ర గుర్తుకు వస్తుంది.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తన తండ్రి, దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర చేసి అధికారంలోకి రాగా.. ఆ తర్వాత వైఎస్ జగన్ కూడా సుదీర్ఘ పాదయాత్ర చేసి.. అన్ని వర్గాలను కలుస్తూ.. సమావేశాలు, సభలు నిర్వహిస్తూ.. వారి సమస్యల పరిష్కారానికి హామీ ఇస్తూ వచ్చారు. ఆ తర్వాత ఏపీలో అధికారాన్ని చేపట్టారు.. అయితే, కూటమి అధికారంలోకి రావడంతో.. ప్రతిపక్షానికే పరిమితమైన వైఎస్ జగన్.. మరోసారి.. పాదయాత్రకు సిద్ధమవుతున్నారు.. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ప్రకటించారు.. ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ కార్యకర్తలతో ప్రత్యేకంగా సమావేశమైన వైసీపీ అధినేత.. వచ్చే ఏడాది పాదయాత్ర ప్రారంభిస్తాను అని వెల్లడించారు.. ఇక, ప్రతీ వారం ఒక నియోజకవర్గం కార్యకర్తలతో సమావేశం ఉంటుందని తెలిపారు వైఎస్ జగన్..
Read Also: UP: ప్రయాగ్‌రాజ్‌లో కూలిన ఎయిర్‌ఫోర్స్ విమానం.. పైలట్లు క్షేమం
తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఏలూరు నియోజకవర్గం కార్యకర్తలతో పార్టీ అధినేత వైఎస్ జగన్ ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు.. ఈ భేటీకి వైసీపీ ఏలూరు నియోజకవర్గ ఇంఛార్జ్ జయప్రకాష్, పార్లమెంటు నియోజకవర్గ ఇంఛార్జ్ కారుమూరి సునీల్, కార్యకర్తలు హాజరు అయ్యారు.. నియోజకవర్గ ప్రజా సమస్యలు, రాజకీయ పరిణామాలపై చర్చించారు.. ఈ సందర్భంగా పార్టీ నిర్మాణంపై దిశానిర్దేశం చేసిన వైఎస్ జగన్.. ఇదే సమయంలో.. వచ్చే ఏడాది పాదయాత్ర ప్రారంభింస్తానని ఏలూరు వైసీపీ కార్యకర్తల సమక్షంలో ప్రకటించారు.. అయితే, ఈ పాదయాత్రకు సంబంధించిన పూర్తి షెడ్యూల్, రూట్ మ్యాప్.. తేదీలు సహా పూర్తి వివరాలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది..