Bluefin Tuna: కొత్త ఏడాది 2026 జపాన్‌లో ప్రపంచ ప్రఖ్యాత టోయోసు ఫిష్ మార్కెట్‌లో ప్రతి ఏడాది జరిగే తొలి ట్యూనా వేలం ఈసారి చరిత్ర సృష్టించింది. ఈ వేలంలో ఒకే ఒక్క బ్లూఫిన్ ట్యూనా ఏకంగా 510 మిలియన్ యెన్‌లు (రూ.29 కోట్లు) ధర పలికి అందరి దృష్టిని ఆకర్షించింది. అంత భారీగా ఉన్న ఈ చేపను ఎత్తేందుకు నలుగురు వ్యక్తులు అవసరమయ్యారు అంటే దాని పరిమాణం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ రికార్డు ధరతో ఈ ఏడాది ట్యూనా వేలం కొత్త మైలురాయిని అందుకుంది.
Mukesh Ambani: రిలయన్స్‌కు ట్రంప్ ఎఫెక్ట్.. లక్ష కోట్లు లాస్ అయిన ముఖేష్ అంబానీ
243 కిలోల బ్లూఫిన్ ట్యూనా:
243 కిలోల బరువు కలిగిన ఈ భారీ బ్లూఫిన్ ట్యూనాను జపాన్‌లో ప్రసిద్ధి చెందిన సుషిజన్మై (Sushizanmai) సుషి రెస్టారెంట్ చైన్‌కు మాతృసంస్థ అయిన కియోమురా కార్పొరేషన్ కొనుగోలు చేసింది. ఈ సంస్థ అధినేత కియోషి కిమురా ప్రతీ ఏడాది జరిగే ఈ వేలంలో పాల్గొని అందరి దృష్టిని ఆకర్షిస్తుంటారు. ఇక ఈ వేలం అనంతరం మాట్లాడిన కియోషి కిమురా.. ఈ రికార్డు బిడ్‌ను నూతన సంవత్సరానికి శుభారంభంగా అభివర్ణించారు. ఈ ఏడాది ఆర్థిక వ్యవస్థ మెరుగుపడాలని ఆశిస్తున్నానని.. ప్రధాని సనాయే టకైచి ప్రభుత్వం పని చేయాలని అన్నారు. అదే విధంగా సుషిజన్మై కూడా పనిచేస్తుందని వ్యాఖ్యానించారు.
ఈ స్థాయిలో ధర పలుకుతుందని తానూ ఊహించలేదని కిమురా అన్నారు. 300 నుంచి 400 మిలియన్ యెన్‌ల వరకు ఉంటుందని అనుకున్నాను. కానీ 500 మిలియన్ దాటింది. నిజంగా ఆశ్చర్యంగా ఉంది అంటూ నవ్వుతూ అన్నారు. కిమురానే 2019లో 333.6 మిలియన్ యెన్‌లకు బ్లూఫిన్ ట్యూనా కొనుగోలు చేసి అప్పట్లో రికార్డు సృష్టించారు. ఇప్పుడు అదే రికార్డును మళ్లీ తానే చెరిపేసి, ట్యూనా వేలానికి మరో కొత్త గుర్తింపు తీసుకొచ్చారు.
Congress: వెనిజులా లాగే ట్రంప్ ప్రధాని మోడీని కిడ్నాప్ చేస్తారా.? మాజీ సీఎం సంచలన వ్యాఖ్యలు..
వేలం పూర్తయ్యాక ఈ విలువైన ట్యూనాను వెంటనే సుషిజన్మై ప్రధాన శాఖకు తరలించారు. అక్కడ సంప్రదాయ పద్ధతిలో కట్ చేసి, జపాన్ వ్యాప్తంగా ఉన్న సుషిజన్మై అవుట్‌లెట్లకు పంపించారు. ఇక్కడ అసలైన విషయం ఏంటంటే.. ఈ రూ.29 కోట్ల విలువైన ట్యూనాతో తయారైన సుషిని సాధారణ మెనూ ధరలకే అందించనున్నారు. ఇది సుషిజన్మై బ్రాండ్‌కు ప్రత్యేక గుర్తింపుగా మారింది.
ఈ కొనుగోలు లాభాల కోసం కాదని, నూతన సంవత్సరం ఆనందాన్ని కస్టమర్లతో పంచుకోవడమే తన ఉద్దేశమని కిమురా స్పష్టం చేశారు. జపాన్ ఆహార సంస్కృతి ఇంకా బలంగా, సజీవంగా ఉందని ప్రపంచానికి గుర్తుచేయడానికే ఈ ప్రయత్నమని ఆయన అన్నారు. నూతన సంవత్సరం ట్యూనా వేలం జపాన్‌లో అత్యంత ప్రతీకాత్మక వాణిజ్య సంప్రదాయాల్లో ఒకటి.