కోడిగుడ్ల ద్వారా శరీరానికి ర‌క‌ర‌కాల‌ పోషకాలు లభిస్తాయి.

కోడిగుడ్లలో శరీరానికి కావాల్సిన శాచురేటెడ్ ఫ్యాట్స్‌, పాలీ అన్ శాచురేటెడ్ ఫ్యాట్స్, మోనో అన్ శాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి.

పొటాషియం, విటమిన్-A, కాల్షియం, ఐరన్, విటమిన్-D, విటమిన్ B6, విటమిన్ B12, మెగ్నీషియం గుడ్డులో పుష్కలంగా ల‌భిస్తాయి.

కోడిగుడ్డు మెదడు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. గుడ్డు సొనలో ఉండే కోలిన్ అనే పోషక పదార్థం మెదడు కణాల ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

కోడిగుడ్డులోని ఐరన్‌ను శరీరం వేగంగా గ్రహిస్తుంది. ఈ ఐరన్ గర్భిణులు, బాలింతలకు చాలా ఉపయోగపడుతుంది.

గ‌ర్భిణులు, బాలింత‌లు ప్రతిరోజు ఉడుక‌బెట్టిన కోడిగుడ్డు తీసుకోవాలి. అదేవిధంగా మహిళల్లో రొమ్ము కాన్సర్ రాకుండా కూడా గుడ్డు ర‌క్ష‌ణ క‌ల్పిస్తుంది.

జట్టు, గోర్లు ఆరోగ్యంగా ఉండేందుకూ గుడ్డు ఉపయోగపడుతుంది. గుడ్డులో ఉండే విటమిన్-A కళ్ళను ఆరోగ్యంగా ఉంచుతుంది.

గుడ్డులో పొటాషియం, కాల్షియం పుష్కలంగా ఉండ‌టంవ‌ల్ల అవి ఎముకలు గట్టిపడటానికి తోడ్ప‌డుతాయి.

నరాల బలహీనత ఉన్నవారు కూడా ప్ర‌తిరోజూ క్ర‌మం తప్ప‌కుండా గుడ్డును తీసుకోవడంవ‌ల్ల ప్ర‌యోజ‌నం ఉంటుంది.

గుండెకు, రక్తనాళాలకు కూడా కోడిగుడ్డుతో ఎంతో మేలు కలుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.