Kolkata-Sairang Express Derails: రైలు ప్రమాదం.. పట్టాలు తప్పిన కోల్‌కతా-సైరాంగ్ ఎక్స్‌ప్రెస్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kolkata-Sairang Express Derails: అస్సాంలో బుధవారం ఉదయం రైలు ప్రమాదం చోటుచేసుకుంది. గువాహటి సమీపంలోని డిగారు రైల్వే స్టేషన్ వద్ద కోల్‌కతా-సైరాంగ్ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పింది. రైల్వే అధికారులు విడుదల చేసిన ప్రాథమిక ప్రకటనలో ఇంజిన్‌తో పాటు ఐదు బోగీలు పట్టాలు తప్పినట్లు వెల్లడించారు. తాజా అధికారిక సమాచారం ప్రకారం ప్రయాణికులెవరూ గాయపడలేదు. అస్సాం రాష్ట్రంలోని కామ్రూప్ మెట్రో జిల్లాలో బుధవారం (నవంబర్ 11, 2026) తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. మిజోరం రాష్ట్రంలోని సైరాంగ్ నుంచి కోల్‌కతా వైపు వెళ్తున్న 13125 నంబర్ కోల్‌కతా-సైరాంగ్ ఎక్స్‌ప్రెస్ డిగారు రైల్వే స్టేషన్ వద్దకు చేరుకుంటున్న సమయంలో పట్టాలు తప్పింది. ఈ ఘటనలో రైలు ఇంజిన్‌తో పాటు ఐదు బోగీలు పట్టాలు తప్పినట్లు రైల్వే అధికారులు ప్రాథమికంగా వెల్లడించారు.
రైల్వే అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. డిగారు రైల్వే స్టేషన్లో మరో రైలుకు ప్రాధాన్యత ఇచ్చేందుకు కోల్‌కతా-సైరాంగ్ ఎక్స్‌ప్రెస్‌ను స్టేషన్లోకి తీసుకుంటున్నారు. ఈ క్రమంలో రైలు వేగాన్ని లోకో పైలట్ నియంత్రించలేకపోవడంతో పట్టాలు తప్పినట్లు ప్రాథమిక ప్రకటనలో పేర్కొన్నారు. నవంబర్ 11న ఉదయం 6:54 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి సాంకేతిక వివరాలు, ఇతర కారణాలపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. రైలులో ప్రయాణిస్తున్న వారందరూ సురక్షితంగా ఉన్నారని, ఇప్పటివరకు ఎలాంటి గాయాలు నమోదు కాలేదని వెల్లడించారు. దీంతో ప్రయాణికుల కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.
Also Read
- Tripura Civic Polls 2026: త్రిపుర మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ హవా.. పోటీ లేకుండానే 77 స్థానాలు కైవసం!
- Sonia Gandhi: సోనియా ప్రధాని కాకపోవడానికి కారణం వాళ్లే.. సంచలన విషయాలు వెలుగులోకి..
- Mumbai Police High Alert: గ్యాంగ్స్టర్ల టార్గెట్‌లో బాలీవుడ్ స్టార్స్..! సినీ నటులకు పోలీసుల వార్నింగ్.. వాటి జోలికి వెళ్లకండి..!
- Supreme Court Judgment: ప్రభుత్వ ఉద్యోగి 48గంటలు కస్టడీలో ఉంటే సస్పెండయినట్టే..
ప్రమాదం కారణంగా ప్రయాణికులు ఇబ్బందులు పడకుండా రైల్వే అధికారులు ప్రత్యామ్నాయ రైలును ఏర్పాటు చేశారు. కోల్‌కతా-సైరాంగ్ ఎక్స్‌ప్రెస్‌లోని ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేర్చేందుకు ప్రత్యామ్నాయ రైలు ద్వారా తరలిస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే సహాయక చర్యలు ప్రారంభించారు. రైల్వే జోన్ జనరల్ మేనేజర్‌తో పాటు పలువురు ఉన్నతాధికారులు ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.
తాజావార్తలు
-
Kolkata-Sairang Express Derails: రైలు ప్రమాదం.. పట్టాలు తప్పిన కోల్‌కతా-సైరాంగ్ ఎక్స్‌ప్రెస్..
-
Suryakumar Yadav: భార్య ఇచ్చిన సలహా తన ఆలోచనా విధానాన్ని మార్చేసింది.. జట్టులో స్థానం కోల్పవడంపై ఓపెనైన స్కై..!
-
Alcohol Sales: అమెరికా, చైనాను మించి భారతీయులే అతిపెద్ద తాగుబోతులు!
-
Amit Shah Vizag Visit: నేడు విశాఖకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. రెండు కీలక సదస్సులకు శ్రీకారం
-
Aryaveer Sehwag: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న.. వీరేంద్ర సెహ్వాగ్ కొడుకు ఎమోషనల్.!
ట్రెండింగ్
-
రోల్స్ రాయిస్‌కు పోటీగా BYD కొత్త కారు.. 1,000+ కి.మీ. రేంజ్, 360 డిగ్రీలు తిరిగే BYD Yangwang Altior..!
-
New Zealand Test Squad: టీమిండియాతో టెస్ట్ సమరానికి కివీస్ రెడీ.. 14 మందితో జట్టు ప్రకటన!
-
National Education Day 2026: బట్టీ పద్ధతులకు చెక్.. ఏఐ యుగంలో ‘క్రిటికల్ థింకింగ్’
-
Kitchen Storage Tips : ఆవాలు ఎక్కువ కాలం తాజాాగా ఉండాలా.? ఈ సింపుల్ చిట్కాలు పాటిస్తే పాడవవు
-
Jio Recharge: Buy 1 Get 1 ఆఫర్ తో ఈ రెండు ప్లాన్లపై డబుల్ బెనిఫిట్స్..!