Ram Charan: ‘చిరు లీక్స్’ లాగా కాదు.. అనస్వర రిలేషన్షిప్ లీక్ చేయను!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ram Charan’s Chiru Leaks Joke: మహేశ్ ఉప్పల దర్శకత్వంలో అనీష్ హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘ఇట్లు అర్జున’. అనస్వర రాజన్ కథానాయికగా నటిస్తుండగా.. వెంకీ కుడుముల నిర్మిస్తున్నారు. అక్కినేని నాగార్జున సమర్పణలో తెరకెక్కిన ఈ చిత్రం నవంబర్ 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా ప్రమోషన్లలో భాగంగా సోమవారం రాత్రి హైదరాబాద్‌లో మ్యూజికల్ కాన్సర్ట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా చెర్రీ చేసిన సరదా వ్యాఖ్యలు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాయి.
‘అనస్వర రాజన్‌ను ఛాంపియన్ సినిమా సమయంలో కలిశా. మొన్నే అనస్వర గారి వర్క్ స్వయంగా చూశాను. మీకు తెలుసో లేదో.. అనస్వర కాకా సినిమాలో డాడీతో కలిసి నటిస్తున్నారు. సినిమాలో డాడీ, అనస్వర మధ్య ఉన్న రిలేషన్షిప్ గురించి మాత్రం చెప్పను. చిరు లీక్స్లా నేనేమీ లీక్ చేయను. కాకాలో ఆమె ఓ ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు’ అంటూ రామ్ చరణ్ సరదాగా వ్యాఖ్యానించారు. చెర్రీ మాటలకు కార్యక్రమ ప్రాంగణం నవ్వులతో మార్మోగింది. అక్కడున్న అభిమానులు ఈలలు, కేకలతో సందడి చేశారు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా, బాబీ కొల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న కాకాలో అనస్వర కీలక పాత్ర చేస్తున్న విషయం తెలిసిందే.
Also Read
- Ram Charan: నా మూవీ కన్నా.. ‘ఇట్లు అర్జున’ బిగ్ హిట్ అవ్వాలి!
- Varanasi Theatrical Rights: రికార్డు డీల్.. 'వారణాసి' థియేట్రికల్ రైట్స్‌ను సొంతం చేసుకున్న మైత్రీ మూవీస్!
- Global Box Office: చిన్న బడ్జెట్.. పెద్ద దెబ్బ! 'రామాయణ'ను దాటేసిన జపనీస్ రాక్షసుడు..
- Athulya Chandra: హీరోయిన్ అతుల్య చంద్ర కేసులో షాకింగ్ ట్విస్ట్.. అడ్డంగా బుక్కైన కీచక డాక్టర్ విదేశాలకు పరార్!
ఇట్లు అర్జున సినిమా గురించి మాట్లాడుతూ.. నవంబర్ 13న విడుదల కానున్న ఈ చిత్రం బ్లాక్‌బస్టర్ అవుతుందని రామ్ చరణ్ ధీమా వ్యక్తం చేశారు. ‘మీరు రాసిపెట్టుకోండి.. ఇట్లు అర్జున బ్లాక్‌బస్టర్ పక్కా. అనస్వర రాజన్ మళ్లీ సంక్రాంతికి మరో హిట్ కొడతారు. అది కూడా రాసిపెట్టుకోండి. ఆమె ఈ సినిమాలో చాలా బాగా నటించారు’ అని ప్రశంసలు కురిపించారు. చరణ్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా కాకా సినిమాలో అనస్వర పాత్రపై ఆయన చేసిన సరదా వ్యాఖ్యలు అభిమానుల్లో ఆసక్తిని పెంచాయి.
తాజావార్తలు
-
Karthika Masam 2026: రాజన్న ఆలయంలో కార్తీక మాసోత్సవాలు.. నెలరోజుల పాటు ప్రత్యేక పూజలు!
-
Parliament Session Record: 89 రోజులుగా ప్రోరోగ్ కాని పార్లమెంట్.. 2008 నాటి రికార్డు బద్దలు..!
-
Ram Charan: ‘చిరు లీక్స్’ లాగా కాదు.. అనస్వర రిలేషన్షిప్ లీక్ చేయను!
-
Delhi Government: ప్రజా సేవల్లో జాప్యానికి చెక్.. పనులు ఆలస్యం చేస్తే అధికారులకు ఫైన్.. సర్కార్ కొత్త చట్టం..!
-
IND vs NZ 3rd ODI: వర్షం మధ్యే టాస్.. న్యూజిలాండ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించిన భారత్.! 40 ఓవర్లకు కుదింపు..
ట్రెండింగ్
-
IPL 2027: అతడిని ఆల్‌రౌండర్‌గా అస్సలు అంగీకరించను.. భారత జట్టులో ఎలా అవకాశం వచ్చిందో?
-
AFG vs ZIM: రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ 500+ పరుగులు.. చరిత్ర సృష్టించిన జింబాబ్వే..! అఫ్గానిస్థాన్‌తో మ్యాచ్ డ్రా..
-
India vs New Zealand 3rd ODI: భారత్, న్యూజిలాండ్ మూడో వన్డేపై వరుణుడి దెబ్బ.. మ్యాచ్ రద్దయ్యే ఛాన్స్..!
-
డ్యూయల్ 200MP కెమెరాలు, 7,050mAh+ బ్యాటరీతో Xiaomi 18 Pro సిరీస్ గ్లోబల్ లాంచ్ డేట్ ఫిక్స్..!
-
World Science Day : సైన్స్ అంటే లాబ్స్, ఈక్వేషన్లే కాదు భయ్యా.. పీస్ అండ్ ప్లానెట్ ప్రొటెక్షన్