Suryakumar Yadav: భార్య ఇచ్చిన సలహా తన ఆలోచనా విధానాన్ని మార్చేసింది.. జట్టులో స్థానం కోల్పవడంపై ఓపెనైన స్కై..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Suryakumar Yadav: టీమిండియా మాజీ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌కు టీ20 ప్రపంచకప్ 2026 అందించిన తర్వాత.. చాలా రోజులు అంత సులభంగా సాగలేదు. పేలవ ఫామ్ కారణంగా ప్రపంచకప్ గెలిచిన కొద్ది రోజులకే భారత జట్టులో చోటు కోల్పోవాల్సి వచ్చింది. కెప్టెన్‌గా దేశానికి ప్రపంచకప్ అందించిన ఆటగాడికి జట్టులో స్థానం దక్కకపోవడం తీవ్ర నిరాశకు గురిచేసిందని, దాదాపు రెండు నెలల పాటు కఠినమైన పరిస్థితులను ఎదుర్కొన్నట్లు సూర్యకుమార్ తాజాగా వెల్లడించాడు. అయితే ఈ సమయంలో తన జీవితంలోకి వచ్చిన కూతురు కొత్త ఆనందాన్ని తీసుకొచ్చిందని, భార్య దేవిషా ఇచ్చిన సలహా తన ఆలోచనా విధానాన్ని మార్చిందని చెప్పుకొచ్చాడు.
తాజాగా ముంబైలో నిర్వహించిన ‘టీ20 ముంబై లీగ్ సెలబ్రేటింగ్ ది ఛాంపియన్స్’ కార్యక్రమంలో సూర్యకుమార్ తన అనుభవాలను పంచుకున్నాడు. టీ20 ప్రపంచకప్ గెలిచిన తర్వాత భారత జట్టుకు దూరం కావడం చాలా కష్టంగా అనిపించిందని, మనకు మనం నిజాయతీగా ఉండకపోతే సంతోషంగా జీవించడం కష్టమని, తన పరిస్థితిని అంగీకరించి ముందుకు సాగేందుకు ప్రయత్నించినట్లు వివరించాడు. ప్రపంచకప్ గెలిపించిన తర్వాత ఇలాంటి పరిస్థితి ఎదురుకావడం మానసికంగా ఎంతో కష్టంగా అనిపించిందని వెల్లడించాడు.
Also Read
- Aryaveer Sehwag: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న.. వీరేంద్ర సెహ్వాగ్ కొడుకు ఎమోషనల్.!
- Vijayawada Cyber Fraud: ఇంటి నిర్మాణం కోసం దాచుకున్న రూ.24 లక్షలు కొల్లగొట్టిన కేటుగాళ్లు!.. సేవింగ్స్, ఫిక్స్డ్ డిపాజిట్లు ఖాళీ..
- రోల్స్ రాయిస్‌కు పోటీగా BYD కొత్త కారు.. 1,000+ కి.మీ. రేంజ్, 360 డిగ్రీలు తిరిగే BYD Yangwang Altior..!
- Kitchen Cleaning Tips: వంటగది చెత్తబుట్ట నుంచి దుర్వాసన వస్తోందా? ఈ చిట్కాలతో సులభంగా చెక్ పెట్టండి!
ఈ కష్టకాలంలోనే సూర్యకుమార్ జీవితంలో ఓ మధురమైన సంఘటన చోటుచేసుకుందని.. ఐపీఎల్ సమయంలో మే నెలలో అతడికి పాప పుట్టింది. కూతురు పుట్టిన తర్వాత తన దృష్టి పూర్తిగా పాపపైకి మళ్లిందని సూర్య తెలిపాడు. గత కొన్ని నెలలు ఎంతో అందంగా గడిచాయని, క్రికెట్లో ఎదురైన నిరాశ నుంచి బయటపడేందుకు కూతురు రాక ఎంతో సహాయపడిందని చెప్పాడు. ఈ క్రమంలో తన భార్య దేవిషా శెట్టితో మాట్లాడినట్లు సూర్యకుమార్ వెల్లడించాడు. క్రికెట్‌పై 15 ఏళ్ల వయసులో ఉన్నప్పటి ప్రేమ, అభిరుచిని మళ్లీ తెచ్చుకోవాలని ఆమె సూచించినట్లు చెప్పాడు. ఆ సలహా తనపై ఎంతో ప్రభావం చూపిందని వివరించాడు.
అయితే మొదటి రెండు నెలలు మాత్రం చాలా కఠినంగా గడిచాయని, ఈ సమయంలో తన క్రికెట్ ప్రయాణం ప్రారంభమైన రోజులను గుర్తు చేసుకున్నట్లు తెలిపాడు. 15 ఏళ్ల వయసులో ముంబై అండర్-15 జట్టుకు ఆడాలనే కోరికతో క్రికెట్ ఆడిన రోజులను.. ఇంకా అప్పట్లో టీమిండియాలో స్థానం, రికార్డులు, విజయాల గురించి ఆలోచించకుండా కేవలం ఆటను ఆస్వాదించేవాడినని తెలిపాడు. ప్రస్తుతం తాను 10-15 ఏళ్ల క్రితం ఎలా ప్రాక్టీస్ చేసేవాడినో మళ్లీ అలానే సాధన చేస్తున్నట్లు సూర్యకుమార్ తెలిపాడు. ఆటపై అదే ప్రేమ, ఆసక్తితో మైదానంలోకి వెళ్తున్నానని, ఇప్పుడు అంతా సాధారణ స్థితికి వచ్చిందని చెప్పాడు. ప్రస్తుతం తన ప్రధాన లక్ష్యం ముంబై తరఫున మ్యాచ్‌లు గెలవడం, ఆ జట్టును ఛాంపియన్‌గా నిలబెట్టడమేనని స్పష్టం చేశాడు. ఈ లక్ష్యంతో త్వరలో జరగనున్న సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ముంబై జట్టుకు కెప్టెన్‌గా జట్టుకు టైటిల్ అందించడం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నాడు.
మరోవైపు రంజీ ట్రోఫీ తొలి దశలో ముంబై జట్టులో తనకు చోటు దక్కకపోవడంపై కూడా సూర్యకుమార్ స్పందించాడు. జట్టు ఎంపికకు ముందు తాను అందుబాటులో ఉంటానని సమాచారం ఇచ్చినప్పటికీ తనను ఎంపిక చేయలేదని తెలిపాడు. రంజీ ట్రోఫీకి ముందు జరిగిన ఆఫ్ సీజన్ సన్నాహాల్లో పాల్గొనలేకపోవడమే ఇందుకు కారణమని వివరించాడు. అయితే ఈ విషయాన్ని పక్కనపెట్టి ముందుకు సాగాలని నిర్ణయించుకున్నట్లు చెప్పాడు. సూర్య ఇంకా మాట్లాడుతూ.. ముంబై యువ క్రికెటర్లకు కీలక సూచనలు చేశాడు. ఐపీఎల్లో ఆడటమే క్రికెటర్ల తొలి లక్ష్యం కాకూడదని.. ముందుగా తమ నగరం, రాష్ట్రం తరఫున ఆడాలని కలలు కనాలని చెప్పాడు. ముంబైలో క్రికెట్ ఆడే ప్రతి యువకుడి మొదటి లక్ష్యం ముంబై అండర్-ఏజ్ జట్టుకు ప్రాతినిధ్యం వహించడం, ఆ తర్వాత రంజీ ట్రోఫీలో ఆడటం కావాలని సూచించాడు. దేశం తరఫున ఆడాలనే కలను ముందుగా పెట్టుకుని ఒక్కో మెట్టు ఎదగాలని పేర్కొన్నాడు.
2010-11లో తొలిసారి ముంబై డ్రెస్సింగ్ రూమ్‌లోకి అడుగుపెట్టినప్పటి జ్ఞాపకాలను కూడా సూర్య పంచుకున్నాడు. అప్పట్లో సచిన్ టెండూల్కర్, అమోల్ మజుందార్, అజిత్ అగార్కర్ వంటి దిగ్గజ ఆటగాళ్లు అక్కడ ఉన్నారని గుర్తుచేసుకున్నాడు. సచిన్ తనకు కూర్చునేందుకు స్థలం ఇచ్చారని, తన సీటు పక్కనే గణేశుడి చిన్న విగ్రహం ఉండేదని తెలిపాడు. ఆ సంఘటన తనకు ఎప్పటికీ ప్రత్యేకమైన జ్ఞాపకంగా నిలిచిపోతుందని చెప్పాడు. మరోవైపు ముంబై క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు అజింక్య నాయక్ మాట్లాడుతూ.. టీ20 ముంబై లీగ్ ద్వారా ఎదిగిన ఆటగాళ్లు భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించినప్పుడే ఆ లీగ్ అసలైన విజయాన్ని సాధించినట్లు అవుతుందని అన్నారు. ఐపీఎల్, ఇతర విజయాలు ఆ తర్వాత వచ్చే అవకాశాలని అభిప్రాయపడ్డారు.
తాజావార్తలు
-
Suryakumar Yadav: భార్య ఇచ్చిన సలహా తన ఆలోచనా విధానాన్ని మార్చేసింది.. జట్టులో స్థానం కోల్పవడంపై ఓపెనైన స్కై..!
-
Alcohol Sales: అమెరికా, చైనాను మించి భారతీయులే అతిపెద్ద తాగుబోతులు!
-
Aryaveer Sehwag: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న.. వీరేంద్ర సెహ్వాగ్ కొడుకు ఎమోషనల్.!
-
Netanyahu vs Gadi Eisenkot: సిగ్గుచేటు.. రామ్, జాయింట్ లిస్ట్ పార్టీలపై నెతన్యాహు ఆగ్రహం..
-
Vijayawada Cyber Fraud: ఇంటి నిర్మాణం కోసం దాచుకున్న రూ.24 లక్షలు కొల్లగొట్టిన కేటుగాళ్లు!.. సేవింగ్స్, ఫిక్స్డ్ డిపాజిట్లు ఖాళీ..
ట్రెండింగ్
-
రోల్స్ రాయిస్‌కు పోటీగా BYD కొత్త కారు.. 1,000+ కి.మీ. రేంజ్, 360 డిగ్రీలు తిరిగే BYD Yangwang Altior..!
-
New Zealand Test Squad: టీమిండియాతో టెస్ట్ సమరానికి కివీస్ రెడీ.. 14 మందితో జట్టు ప్రకటన!
-
National Education Day 2026: బట్టీ పద్ధతులకు చెక్.. ఏఐ యుగంలో ‘క్రిటికల్ థింకింగ్’
-
Kitchen Storage Tips : ఆవాలు ఎక్కువ కాలం తాజాాగా ఉండాలా.? ఈ సింపుల్ చిట్కాలు పాటిస్తే పాడవవు
-
Jio Recharge: Buy 1 Get 1 ఆఫర్ తో ఈ రెండు ప్లాన్లపై డబుల్ బెనిఫిట్స్..!