Summer holidays Review: సమ్మర్ హాలిడేస్ రివ్యూ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rating : 2.75 / 5
- MAIN CAST: మాస్టర్ రోహన్, మాస్టర్ అరుణ్ దేవ్, బేబి ఖుషి, జయసుధ, రాజీవ్ కనకాల, హర్షవర్ధన్, వాసుకి, హర్షిణి కోడూరి తదితరులు
- DIRECTOR: శ్రీకర్ నయన్
- MUSIC:
- PRODUCER: ధీరజ్ మొగిలినేని, గిరిబాబు వల్లభనేని
Summer holidays Review: #90స్ ఫేమ్ రోహన్, 35 ఫేమ్ అరుణ్ దేవ్, మన శంకర వర ప్రసాద్ గారు ఫేమ్ ఖుషి, జయసుధ, రాజీవ్ కనకాల వంటి వారు ప్రధాన పాత్రల్లో నటించిన మూవీ `సమ్మర్ హాలిడేస్`. శ్రీకర్ నయన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని ధీరజ్ మొగిలినేని ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద ధీరజ్ మొగిలినేని, గిరిబాబు వల్లభనేని నిర్మించారు. చిన్న పిల్లలు, వారి చదువు, ఆటల, పేరెంట్స్ తో రిలేషన్, సమ్మర్లో హాలిడేస్‌ని ప్రధానంగా చేసుకొని ఈ సినిమా రూపొందించారు. టీజర్, ట్రైలర్‌తో ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. దీపావళి స్పెషల్‌గా నేడు శుక్రవారం(నవంబర్ 6)న ఈ సినిమా రిలీజ్ అయ్యింది. మరి సినిమా ఎలా ఉందనేది రివ్యూలో తెలుసుకుందాం.
కథ
హైదరాబాద్ లో ప్రైమరీ స్కూల్ చదివే రావూరి వెంకటేష్ అలియాస్ ఆర్వీ (అరుణ్ దేవ్)కి క్రికెట్ అంటే ప్రాణం. అయితే అతడి తండ్రి (హర్షవర్ధన్) మాత్రం చదువు విషయంలో విపరీతమైన ఒత్తిడి తెచ్చే వ్యక్తి. ఫస్ట్ ర్యాంకు సాధిస్తేనే క్రికెట్ కిట్ కొనిస్తానని షరతు పెడతాడు. కానీ 10వ ర్యాంక్ రావడంతో తండ్రి ఆగ్రహానికి గురైన ఆర్వీ మానసికంగా కుంగిపోతాడు. కొడుకును ఆ భయం నుంచి బయటకు తీసుకురావడానికి తల్లి (వాసుకి) అతన్ని వేసవి సెలవుల్లో గోదావరి ఒడ్డున్న ఉన్న తోటవారిపాలెంలోని అమ్మమ్మ సుశీలమ్మ (జయసుధ) ఇంటికి పంపుతుంది. ఆ పల్లెటూరిలో ఆర్వీకి కాశీ వెంకటేశ్వర్లు అలియాస్ కేవీ (రోహన్) పరిచయమవుతాడు. తండ్రి లేని కేవీ కుటుంబం పేదరికంలో ఉంటుంది. అతడి తల్లి (హర్షిణి) సుశీలమ్మ ఇంట్లోనే పనులు చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తుంటుంది. పేదరికం కారణంగా ఊరి వారి నుంచి ఎదురయ్యే అవమానాలను చూసి చలించిపోయిన కేవీ, ఎలాగైనా సొంత సంపాదనతో అమ్మకు ఓ ఖరీదైన చీర కొనివ్వాలని సంకల్పిస్తాడు. అందుకోసం వర్మ (రాజీవ్ కనకాల) అనే వ్యక్తి వద్ద పండ్లు కాయని కొన్ని మామిడి చెట్లను లీజుకు తీసుకుని సాగు చేయడం ప్రారంభిస్తాడు. చదువు టెన్షన్లో నలిగిపోయిన ఆర్వీకి కేవీ ఎలా స్నేహాన్ని, పల్లెటూరి ఆటల మధురానుభూతులను పరిచయం చేశాడు? కేవీ మామిడి తోట వ్యవహారంలో ఆర్వీ చదువు ఎలా ఉపయోగపడింది? ఆ మామిడి చెట్లు చివరకు పండ్లు కాశాయా? కేవీ తన తల్లికి కొత్త చీర కొనివ్వగలిగాడా? ఈ ప్రయాణంలో ఇద్దరు పిల్లల జీవితాల్లో వచ్చిన మార్పులేంటి? అన్నదే మిగతా కథ.
Also Read
విశ్లేషణ
బాల్యంలోని అమాయకత్వం, వేసవి సెలవుల్లో అమ్మమ్మ ఊరికి వెళ్లినప్పుడు కలిగే అనుభవాలను తెరపైకి తెచ్చిన విధానం మెప్పిస్తుంది. కేవలం పుస్తకాలే లోకం కాదని, ఆటపాటలు, అనుబంధాలు కూడా పిల్లల మానసిక వికాసానికి ఎంత అవసరమో ఆర్వీ ట్రాక్ ద్వారా సహజంగా ఆవిష్కరించారు. చెరువులో ఈత కొట్టడం, మామిడి తోటల్లో తిరగడం, గోదావరి గ్రామీణ నేపథ్యం 90ల నాటి తరం జ్ఞాపకాలను గుర్తుచేస్తాయి. మరోవైపు కేవీ కథాంశం ద్వారా కష్టాల్లోనూ నవ్వుతూ జీవించే తత్వాన్ని, కుటుంబ బాంధవ్యాలను ఎమోషనల్ కోణంలో స్పృశించారు. కథ ప్రధానంగా భావోద్వేగాలు, స్నేహం చుట్టూ తిరగడంతో సమ్మర్ హాలిడేస్ అనగానే ఆశించే కామెడీ పాళ్లు కాస్త తగ్గినట్టు అనిపిస్తుంది. ద్వితీయార్ధంలో కథనం కొంత నెమ్మదించడం, నాటకీయత ఎక్కువై సాగదీసిన భావన కలగడం, స్క్రీన్‌ప్లే రెగ్యులర్ ఫార్మాట్లోనే సాగడం కథాగమనానికి చిన్నపాటి అడ్డంకులు. అయినప్పటికీ, స్వచ్ఛమైన స్నేహం, పిల్లల పెంపకంలో తల్లిదండ్రులు గుర్తుంచుకోవాల్సిన అంశాలను సందేశాత్మకంగా చూపిస్తూ క్లైమాక్స్‌ను హృద్యంగా ముగించారు.
నటీనటుల ప్రతిభ విషయానికి వస్తే అరుణ్ దేవ్ చదువుల ఒత్తిడికి లోనయ్యే సిటీ కుర్రాడిగా, తండ్రిని చూసి భయపడే సన్నివేశాల్లోనూ, పల్లెటూరి వాతావరణంలో వికసించే క్రమంలోనూ పరిణతితో కూడిన నటన కనబరిచాడు. రోహన్ చలాకీతనం, బాధ్యత తెలిసిన పల్లెటూరి పిల్లవాడిగా కేవీ పాత్రలో ఒదిగిపోయాడు. భావోద్వేగ సన్నివేశాల్లోనూ, తల్లిపై ప్రేమను చాటే క్షణాల్లోనూ ప్రత్యేకంగా నిలిచాడు. జయసుధ కుటుంబ సాన్నిహిత్యాన్ని కోరుకునే అమ్మమ్మ సుశీలమ్మ పాత్రకు తనదైన హుందాతనంతో నిండుదనం తెచ్చారు. హర్షిణి కోడూరి ఆత్మాభిమానం కలిగిన పేద తల్లిగా డి-గ్లామర్ లుక్‌లో అత్యంత సహజంగా నటించి మెప్పించారు. హర్షవర్ధన్ & వాసుకి మధ్యతరగతి తల్లిదండ్రుల ఆలోచనా ధోరణులను, భిన్న మనస్తత్వాలను చక్కగా ప్రతిబింబించారు. రాజీవ్ కనకాల మామిడి తోటల యజమాని వర్మగా ఉన్నంతలో పరిధి మేరకు ఆకట్టుకున్నారు.
సాంకేతిక విభాగాల పనితీరు విషయానికి వస్తే సింజిత్ యెర్రమల్లి అందించిన నేపథ్య సంగీతం సన్నివేశాలలోని భావోద్వేగాలను చక్కగా ఎలివేట్ చేసింది. పాటలు కథానుగుణంగా సాగుతాయి. సాయి ప్రకాష్ కెమెరా పనితనం పల్లెటూరి పచ్చదనాన్ని, తోటల అందాలను విజువల్‌గా ఆహ్లాదకరంగా ఆవిష్కరించింది. సెకండ్ హాఫ్‌లోని కొన్ని డ్రామా సీన్లను, ఎమోషనల్ ట్రాక్‌లను మరింత క్రిస్ప్‌గా కట్ చేసి ఉంటే సినిమా వేగం పెరిగేది. దర్శకుడు శ్రీకర్ నయన్ ఎంచుకున్న కథా వస్తువు, పల్లెటూరి జ్ఞాపకాలను జోడించిన విధానం బాగుంది. కథనంలో మలుపులు పెంచి వినోదంపై మరింత దృష్టి పెట్టాల్సింది. ధీరజ్ మొగిలినేని నిర్మాణ విలువలు కథ స్థాయికి తగినట్లుగా ఉన్నతంగా ఉన్నాయి.
ఫైనల్లీ: ‘సమ్మర్ హాలిడేస్’ చిన్ననాటి తీపి జ్ఞాపకాలను గుర్తుచేసే క్లీన్ ఎమోషనల్ డ్రామా.
తాజావార్తలు
-
Off The Record: మంత్రి శ్రీధర్‌బాబు vs ఎంపీ గడ్డం వంశీ.. ఎన్నికల తర్వాత ఇద్దరి మధ్య గ్యాప్.?
-
Milk Adulteration: హైదరాబాద్‌లో కల్తీ పాల కలకలం.. పోచారంలో తయారీ కేంద్రం గుర్తింపు!
-
Andre Russell: 10 వేల పరుగులు, 500 వికెట్లతో టీ20 క్రికెట్లో ఆండ్రీ రస్సెల్ వరల్డ్ రికార్డు..!
-
Story Board: అమెరికా మధ్యంతర ఎన్నికల్లో ట్రంప్‌నకు షాక్… ప్రపంచవ్యాప్తంగా సానుకూల పరిణామాలు..!
-
Doping Test: డోపింగ్ పరీక్షలో దొరికిన ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్.. కానీ ఓ ట్విస్ట్!
ట్రెండింగ్
-
IPL 2027-DC: గంగూలీ టార్గెట్ ఆ ఇద్దరు విదేశీ స్టార్లే.. ఢిల్లీ క్యాపిటల్స్ వేలం ప్లాన్ లీక్!
-
37 గంటల బ్యాటరీ బ్యాకప్, అడ్వాన్స్డ్ ANC ఫీచర్లు, Bose సౌండ్ టెక్నాలజీతో Moto Buds 2 Ultra లాంచ్..!
-
100+ స్పోర్ట్స్ మోడ్లు, 12 రోజుల బ్యాటరీ లైఫ్, డ్యూయల్ GPS, gOLED డిస్ప్లేతో Moto Watch 2 Fit లాంచ్..!
-
200MP పెరిస్కోప్ కెమెరా, ఏడేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 7000mAh బ్యాటరీతో Motorola Signature 27 లాంచ్..!
-
IND vs SL 1st ODI: బీసీసీఐ కీలక నిర్ణయం.. విశాఖలో తొలి వన్డే.. వేదిక మార్పుకు కారణం ఇదే!