NCP: విలీనం దిశగా ఎన్సీపీ!?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రక్తసంబంధాలు రాజకీయాల ముందు తలవంచాల్సి వస్తుందా? పదవి, అధికారం కోసం సొంత వారే దూరమైన వేళ… కాలం మళ్లీ ఆ కుటుంబాలను ఒకే తాటిపైకి తెస్తుందా? మహారాష్ట్రలో ఇప్పుడు ఇదే అత్యంత హాట్ టాపిక్. ఒక వైపు సీనియర్ నేత శరద్ పవార్ ఆరోగ్యం సరిగాలేదు. మరోవైపు ఢిల్లీ పెద్దలు వరుస మీటింగ్‌లతో హడావిడి చేస్తున్నారు. అసలు ఎన్సీపీలో ఏం జరుగుతోంది? రెండుగా చీలిపోయిన పవార్ కుటుంబం మళ్లీ ఒక్కటవుతుందా? లేదంటే ఈ నాటకం వెనుక వేరే రాజకీయ వ్యూహం ఉందా?
మహారాష్ట్రలో ఎన్సీపీ విలీనంపై జోరుగా చర్చ జరుగుతోంది. ముంబైలోని బ్రీచ్ క్యాండి ఆసుపత్రిలో శ్వాసకోశ ఇబ్బందులతో చికిత్స పొందుతున్న శరద్ పవార్‌ను, ప్రఫుల్ పటేల్ కలవడం ఈ ఊహాగానాలకు ప్రధాన కారణమైంది. వీరి మధ్య జరిగిన సంభాషణకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. నవంబర్ 10 తర్వాత మరోసారి భేటీ కావాలని వారు అనుకోవడం రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టించింది. ఒకవైపు ప్రఫుల్ పటేల్ ఇది కేవలం పరామర్శ మాత్రమేనని, ఇందులో ఎలాంటి రాజకీయ చర్చ లేదని చెబుతున్నప్పటికీ… ఎన్సీపీ సీనియర్ నేతలు సునీల్ తత్కరే, చగన్ భుజ్‌బల్ తదితరులు ఢిల్లీకి వెళ్లి కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలవడం అనుమానాలకు మరింత బలం చేకూర్చింది.
ఎన్సీపీ విలీన పుకార్లకు సునీల్ తత్కరే చేసిన ఒక ప్రకటన మరింత బలం చేకూర్చింది.అజిత్ పవార్ కనుక జీవించి ఉంటే, ఫిబ్రవరి 12 నాటికి పార్టీల విలీనం అధికారికంగా పూర్తయి ఉండేదని ఆయన బహిరంగంగానే పేర్కొన్నారు. 2023 జూలై 2న అజిత్ పవార్ తిరుగుబాటు చేసి బీజేపీ-శివసేన ప్రభుత్వంలో చేరడంతో ఎన్సీపీ రెండుగా చీలిపోయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఎలక్షన్ కమిషన్ కూడా అజిత్ పవార్ వర్గానికే అసలు పార్టీ పేరు, ‘గడియారం’ గుర్తును కేటాయించింది. శరద్ పవార్ వర్గం ‘నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ-శరద్చంద్ర పవార్’ -NCP-SPగా మారింది. అయితే, ఈ ఏడాది జనవరి 28న బారామతిలో జరిగిన విమాన ప్రమాదంలో అజిత్ పవార్ అకస్మాత్తుగా మరణించడం ఆ కుటుంబానికి, పార్టీకి తీరని లోటును మిగిల్చింది. ఆయన మరణం తర్వాత సునేత్రా పవార్ పార్టీ బాధ్యతలు చేపట్టినా, పార్టీలో అంతర్గతంగా నాయకత్వ శూన్యత, అసంతృప్తి రాజుకుంటూనే ఉన్నాయి.
Also Read
- Russia vs Ukraine: 4.5 లక్షల మరణాలు..రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అత్యంత దారుణమైన పోరాటం!
- Diwali: దీపావళి గాయాలు.. ఆస్పత్రులకు తెలుగు రాష్ట్రాలు క్యూ..!
- Temple Device: జొమాటో కొత్త బిజినెస్ స్కీమ్.. మండిపడుతున్న డాక్టర్లు!
- Man Swallows Toothbrush: టూత్ బ్రష్ మింగేశాడు..డాక్టర్లు ఏం చేశారో తెలిస్తే..
ప్రస్తుత అధికార ఎన్సీపీలో సునేత్రా పవార్ ఆధిపత్యం, ఆమె కుమారుడు పార్థ్ పవార్ అజమాయిషీపై సీనియర్ నేతల్లో తీవ్ర అసంతృప్తి ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఉమేష్ పాటిల్, జీషన్ సిద్ధిఖీ వంటి నేతల నియామకాల విషయంలో తమను కనీసం సంప్రదించలేదని చగన్ భుజ్‌బల్ వంటి సీనియర్లు బహిరంగంగానే పెదవి విరిచారు. పార్టీ పగ్గాలు ఎవరి చేతిలో ఉండాలనే దానిపై కుటుంబ సభ్యులకు, అనుభవజ్ఞులైన సీనియర్ నాయకులకు మధ్య నడుస్తున్న అంతర్గత పోరును ఇది తెలియజేస్తోంది. సరిగ్గా ఈ తరుణంలోనే పార్థ్ పవార్ రెండు రోజుల పాటు శరద్ పవార్‌ను సిల్వర్ ఓక్ నివాసంలో కలవడం, దాదాపు రెండు గంటలపాటు చర్చలు జరపడం పలు అనుమానాలకు తావిచ్చింది. ఇది కేవలం ఫ్యామిలీ లంచ్ మీటింగ్ మాత్రమే కాదని, దీని వెనుక పెద్ద రాజకీయ వ్యూహమే ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
అయితే.. పార్టీ విలీన వార్తలను ఇరు వర్గాలు గట్టిగానే ఖండిస్తున్నాయి. శరద్ పవార్ ఆసుపత్రిలో కోలుకుంటున్న తరుణంలో ఇలాంటి నిరాధారమైన చర్చలు జరపడం అసంబద్ధమని ఎన్సీపీ అధికార ప్రతినిధి ఉమేష్ పాటిల్ అన్నారు. శరద్ పవార్ క్యాంప్ నుంచి కూడా రోహిత్ పవార్ తదితరులు విలీన చర్చలేవీ జరగడం లేదని స్పష్టం చేశారు. మరోవైపు.. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ కూడా ఈ అంశంపై స్పందించారు. ఆ రెండు స్వతంత్ర పార్టీలని, విలీనం గురించి ఆలోచిస్తే ఎన్డీయే భాగస్వామిగా తమను సంప్రదించాలని అభిప్రాయపడ్డారు. మరోవైపు.. ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా శరద్ పవార్‌కు ఫోన్ చేసి ఆరోగ్యం గురించి వాకబు చేయడం మరిన్ని అనుమానాలకు తావిచ్చింది.
కాలమే అన్ని గాయాలను మాన్పుతుంది అంటారు.. కానీ రాజకీయాల్లో కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఎన్నికల సమీకరణాలు, పార్టీ మనుగడ ప్రశ్నార్థకమైనప్పుడు శత్రువులైనా మిత్రులు కావాల్సిందే. విడిపోయిన పవార్ కుటుంబాలు ఒక్కటవుతాయా.. లేదా.. అనేది తెలియాలంటే.. నవంబర్ 10 తర్వాత ప్రఫుల్ పటేల్, శరద్ పవార్ల మధ్య జరగబోయే తదుపరి భేటీ వరకు ఆగాల్సిందే.!
:- CLN RAJU ( EDITOR-NTV DIGITAL)
తాజావార్తలు
-
NCP: విలీనం దిశగా ఎన్సీపీ!?
-
Karimnagar Drought: కరీంనగర్‌ను కరువు జిల్లాగా ప్రకటించాలి.. రైతులకు నష్టపరిహారం చెల్లించాలి!
-
Rahul Gandhi Hyderabad Visit: హైదరాబాద్‌కు రాహుల్ గాంధీ?.. భారత్ సమ్మిట్, గిగ్ వర్కర్లతో ప్రత్యేక సమావేశం!
-
Jio Recharge: Buy 1 Get 1 ఆఫర్ తో ఈ రెండు ప్లాన్లపై డబుల్ బెనిఫిట్స్..!
-
Ravi Shastri Commentary: 1994లో మొదలైన ప్రయాణం.. కామెంటరీలో తన గురువులెవరో వెల్లడించిన రవిశాస్త్రి!
ట్రెండింగ్
-
BSNL నుంచి కొత్త రీఛార్జ్ ప్లాన్లు.. రూ.172, రూ.184, రూ.190లకే అన్లిమిటెడ్ కాలింగ్..!
-
గేర్లు మార్చాల్సిన అవసరం లేకుండానే సులువుగా రైడ్.. KTM 390 Super Duke GT Evo బైక్ లాంచ్‌కు సిద్ధం..!
-
IND vs NZ 3rd ODI: వర్షం మధ్యే టాస్.. న్యూజిలాండ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించిన భారత్.! 40 ఓవర్లకు కుదింపు..
-
IPL 2027: అతడిని ఆల్‌రౌండర్‌గా అస్సలు అంగీకరించను.. భారత జట్టులో ఎలా అవకాశం వచ్చిందో?
-
AFG vs ZIM: రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ 500+ పరుగులు.. చరిత్ర సృష్టించిన జింబాబ్వే..! అఫ్గానిస్థాన్‌తో మ్యాచ్ డ్రా..