OTR : పవన్ నియోజకవర్గంలో ఎంపీ తీరు మారాలంటున్న జనసైనికులు
- కాకినాడ ఎంపీ ఉదయ్‌శ్రీనివాస్‌కు చుక్కలు
- సీనియర్ని కాదని తన మనిషికి పిఠాపురం ఎంపీపీ ఇప్పించే ప్లాన్
- వెనక్కి తగ్గని సీనియర్ శివశంకర్, ఇండిపెండెంట్‌గా బరిలో
- శివశంకర్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయించిన ఎంపీ
- ఎంపీనే ఎంపీటీసీగా పోటీ చేస్తున్నారా అన్నంతగా ప్రచారం
- కందరాడ ఎంపీటీసీ సీటులో 4రెట్లు అదనంగా పంపకాలు?
- ఎంపీ ఎంత గింజుకున్నా కందరాడలో రెబెల్ గెలుపు
- ఫలితంతో షాకై వెంటనే పార్టీ కండువా కప్పిన ఎంపీ
- పవన్ నియోజకవర్గంలో ఎంపీ తీరు మారాలంటున్న జనసైనికులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
OTR : ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ సొంత నియోజకవర్గం పిఠాపురం. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇక్కడ కీలకంగా వ్యవహరించారు జనసేన కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్. పిఠాపురం ఎంపీపీ స్థానానికి మొదటి నుంచి పార్టీలో ఉన్న పిల్లా శివశంకర్‌కి బీ ఫాం ఇచ్చేశారు, అంతా ఓకే అయిపోయింది కూడా. కానీ… అంతలోనే కొన్ని లెక్కలు తప్పడంతో ఆయన్ని పక్కనపెట్టి పార్టీ అధిష్టానానికి కూడా నెగిటివ్ ఫీడ్ బ్యాక్ ఇప్పించి తన వర్గానికి చెందిన దినేష్‌కి బీఫామ్ ఇప్పించుకున్నారు ఎంపీ. దాంతో… జనసేన పిఠాపురం ఎంపీపీ అభ్యర్థిగా దినేష్ ఫైనల్ అయ్యారు. కందరాడ నుంచి ఎంపీటీసీగా నామినేషన్ వేశారాశాయన. ఇక ఎంపీ తంగెళ్ళ కూడా ఈ స్థానంపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. అయితే… అదే సమయంలో పార్టీ ముందుగా ఫైనల్ చేసిన శివ శంకర్ కూడా వెనక్కి తగ్గలేదు. తాను పార్టీ కోసం కమిట్మెంట్తో పని చేశానని, ఎంపీలాగా ఎక్కడి నుంచో వచ్చిన వాడిని కాదని, అనడమే కాకుండా… అదే కందరాడ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశారు. దాంతో… ఎంపీ వర్గం కూడా శివశంకర్‌తో బెదిరింపు ధోరణిలో మాట్లాడిందట. నాకు ఒకడు ఎదురొచ్చినా, నేను ఒకడికి ఎదురెళ్ళినా వాడికే రిస్క్ అన్న రేంజ్లో డైలాగ్స్ కొట్టడమే గాక…రోజుల వ్యవధిలోనే శివశంకర్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు జిల్లా అధ్యక్షుడు తుమ్మల బాబుతో లెటర్ రిలీజ్ చేయించారు. ఇక స్వయంగా ఎంపీ కూడా శివశంకర్‌కు, తమకు సంబంధం లేదని ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు.
అసలు ఒక దశలో అయితే…. కందరాడ ఎంపీటీసీగా ఎంపీ ఉదయ్ శ్రీనివాసే పోటీ చేస్తున్నారా అన్నంతగా మారిపోయిందట వాతావరణం. డబ్బు పంపకాలు కూడా ఆ స్థాయిలో జరిగాయని ఇప్పటికీ చెప్పుకుంటున్నారు. మిగతా చోట్ల కంటే నాలుగు రెట్లు అధికంగా కందరాడ ఎంపీటీసీ జనసేన అభ్యర్థి నుంచి ఓటర్లకు తాయిలాలు అందాయన్నది ఇక్కడ బహిరంగ రహస్యం. శివశంకర్ ఉంగరం గుర్తు మీద పోటీ చేయగా…. దినేష్‌ది పార్టీ సింబల్ గ్లాస్. అయితే… మొదట్నుంచి జనసేనలో ఉన్న పాత నేతలు, కార్యకర్తలతో పాటు టీడీపీ కూడా స్వతంత్ర అభ్యర్థి శివశంకర్‌కు మద్దతు పలికాయి. విచిత్రంగా వైసీపీ కూడా డమ్మీ అభ్యర్థిని నిలబెట్టి పరోక్షంగా ఉంగరం గుర్తుకే సపోర్ట్ చేసిందని అంటున్నారు. దాంతో…ఎంపీ ఎంత గింజుకున్నా కందరాడ ఎంపీటీసీ అభ్యర్థిని గెలిపించుకోలేకపోయారు. ఇక్కడ మొత్తం 3వేల226 ఓట్లు ఉంటే, 2వేల672 ఓట్లు పోలయ్యాయి. అందులో శివశంకర్ కి 1,4 56, దినేష్‌కి 1,177 ఓట్లు పడ్డాయి. మొత్తంగా 279 ఓట్ల మెజారిటీతో జనసేన రెబెల్ గెలిచారు. ఇక పోలింగ్ రోజున ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కందరాడ వచ్చారు. ఆ సమయంలో శివశంకర్ తల్లిదండ్రులు ఎంపీని పట్టుకుని ఎమోషనల్ అయ్యారు. పార్టీని నమ్ముకుని ఉన్నవాడికి అన్యాయం చేశారంటూ కన్నీరు పెట్టుకున్నారు కూడా. ఇదంతా చూసిన జనసైనికులు కాస్త డిఫరెంట్‌గా కామెంట్ చేయడం కూడా కనిపించింది. ఎంపీకి పార్టీతో పనిలేదు, మొదటి నుంచి ఉన్నాసరే… ఆయన వర్గం కాకపోతే అలాగే తోక్కేస్తారంటూ వాళ్ళలో వాళ్ళు కామెంట్స్ చేసుకున్నారట.
Also Read
- OTR : కూటమి హవాలో ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలకు షాక్.. కృష్ణా జిల్లా ఫలితాల్లో ట్విస్ట్!
- Off The Record: విజయనగరం మేయర్ విషయంలో కోలగట్ల తడబాటు.. అతి విశ్వాసంతో మొదటికే మోసం..!
- Off The Record : ఆదిలాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ పై కౌన్సిలర్స్ అసంతృప్తి..!!
- Off The Record: గులాబీ పార్టీకి Vitamin-M లోపం వచ్చిందా ? అందుకే ఆ మీటింగ్స్ రద్దయ్యాయా
కలిసి పనిచేయడానికి ఒప్పుకోరని, అంతా తనకింద పనిచేయాలనే ఆయన కోరుకుంటారని చెప్పుకుంటున్నారు. అదే సమయంలో రాజకీయాల్ని హుందాగా చేయకుండా… వన్‌మ్యాన్ షో నడిపిస్తే…. రిజల్ట్ ఇలాగే ఉంటుందని గుర్తు చేసేవాళ్ళు సైతం లేకపోలేదు. మరోవైపు… శివశంకర్ కొట్టిన దెబ్బకు దిమ్మ తిరిగిపోయిన ఎంపీ… ఇంకా లాగితే ఎక్కడ తెగుతుందోనని భయపడి ముందుగానే అలర్ట్ అయ్యారట. శివశంకర్ గెలిచారని తెలిసిన వెంటనే ఇంటికి పిలిపించి జనసేన కండువా కప్పేశారు. పార్టీ అధ్యక్షుడి సొంత నియోజకవర్గంలో పర్ఫెక్ట్ గా చేయాల్సిన రాజకీయాలను ఎంపీ సొంత ప్రయోజనాల కోసం ఇష్టం వచ్చినట్లు మార్చేస్తున్నారన్నది లోకల్ జనసైనికుల ఫీలింగ్. ప్రస్తుతానికి గండం గట్టెక్కినా…. తీరులో మార్పు రాకపోతే ఇటువంటి రిజల్ట్స్ కంటిన్యూ అవుతాయని హెచ్చరిస్తున్నారు. మొత్తానికి కందరాడ ఓటర్లు, జనసైనికులు ఇచ్చిన షాక్‌తో ఎంపీ తేరుకోలేకపోతున్నారట. పార్టీ లైన్ అంటూ ఏమీ ఉండదు, నేను చెప్పిందే ఫైనల్ అంటూ మరింత అడ్వాన్స్ అయిపోయిన ఎంపీకి… ప్రతి దానికి లెక్కలు ఉంటాయమ్మా అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు ఓటర్లు.
తాజావార్తలు
-
OTR : పవన్ నియోజకవర్గంలో ఎంపీ తీరు మారాలంటున్న జనసైనికులు
-
OTR : కూటమి హవాలో ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలకు షాక్.. కృష్ణా జిల్లా ఫలితాల్లో ట్విస్ట్!
-
Lakdikapul One Way :హైదరాబాద్‌లో మరో వన్ వే.. లక్డీకాపూల్‌లో 22న ప్రయోగాత్మక అమలు..
-
Drug Racket: హైదరాబాద్‌లో విదేశీ యువతి డ్రగ్స్, వ్యభిచార రాకెట్ రట్టు..
-
Global Box Office: చిన్న బడ్జెట్.. పెద్ద దెబ్బ! ‘రామాయణ’ను దాటేసిన జపనీస్ రాక్షసుడు..
ట్రెండింగ్
-
7 అంగుళాల భారీ డిస్ప్లే, 10,000mAh కంటే ఎక్కువ బ్యాటరీతో రాబోతున్న iQOO Z12 సిరీస్..!
-
Varanasi Movie: ‘వారణాసి’లో టైమ్ ట్రావెల్ ట్విస్ట్.. కుంభకర్ణుడి పునర్జన్మగా ఆ పాత్ర?
-
Upcoming Smartphones: ఈ వారం లాంచ్ కానున్న కొత్త స్మార్ట్ఫోన్లు ఇవే.. 200MP కెమెరా, 8,000mAh బ్యాటరీతో Oppo Reno 17 సిరీస్..!
-
Airtel నుంచి ‘Buy 1 Get 1’ ఆఫర్.. ఆ ప్లాన్స్ తో ఒక్కసారి రీఛార్జ్ చేస్తే రెండుసార్లు ప్రయోజనం..!
-
Realme నుంచి పవర్ఫుల్ 5G ఫోన్లు.. 10,000mAh బ్యాటరీ, 200MP కెమెరాతో వచ్చేస్తున్న Realme 17 సిరీస్..!