NZ vs IND 3rd ODI: హామిల్టన్‌లో వరుణుడి ఆట.. భారత్-న్యూజిలాండ్ మూడో వన్డే రద్దు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IND vs NZ 3rd ODI Abandoned: వన్డే సిరీస్‌లో భాగంగా హామిల్టన్‌లోని సెడ్డన్ పార్క్ వేదికగా భారత్, న్యూజిలాండ్ మధ్య జరగాల్సిన మూడో మ్యాచ్ భారీ వర్షం కారణంగా ఒక్క బంతి పడకుండానే రద్దయింది. టాస్కు ముందు నుంచే భారీ వర్షం కురవడంతో మైదానం పూర్తిగా చిత్తడిగా మారింది. వర్షం తగ్గినప్పటికీ.. మైదానాన్ని మ్యాచ్‌కు సిద్ధం చేసేందుకు మరింత సమయం పట్టే అవకాశం ఉండటంతో అంపైర్లు మూడో వన్డేను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.
షెడ్యూల్ ప్రకారం ఉదయం 7 గంటలకు టాస్ వేయాలి. కానీ వర్షం కారణంగా రెండు గంటలు ఆలస్యం అయింది. దాంతో మ్యాచ్‌ను 40 ఓవర్లకు అంపైర్లు కుదించారు. టాస్ గెలిచిన భారత జట్టు తొలుత బౌలింగ్ ఎంచుకుంది. టాస్ వేయగానే మళ్లీ చినుకులు పడడంతో.. పిచ్‌ను కవర్లతో కప్పేశారు. కాసేపటికి వర్షం పూర్తిగా తగ్గింది. దీంతో మ్యాచ్ నిర్వహణకు అంపైర్లు సిద్ధమయ్యారు. మ్యాచ్ ప్రారంభమవుతుందనే సమయంలోనే వర్షం మరలా వచ్చేసింది. హామిల్టన్‌లో బాగా వర్షం పడింది. పరిస్థితులు అనుకూలించకపోవడంతో చివరకు మ్యాచ్‌ను పూర్తిగా రద్దు చేయాల్సి వచ్చింది.
Also Read
- Suresh Raina on Retirement: నన్ను ఎందుకు పక్కన పెట్టారో చెప్పలేదు.. కోహ్లీ, కోచ్‌పై రైనా ఆసక్తికర వ్యాఖ్యలు..!
- IND vs NZ 3rd ODI: వర్షం మధ్యే టాస్.. న్యూజిలాండ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించిన భారత్.! 40 ఓవర్లకు కుదింపు..
- Suryakumar Yadav: మరోసారి కెప్టెన్సీ బాధ్యతలు.. సూర్యకుమార్‌కు ముంబై పగ్గాలు..!
- IPL 2027: అతడిని ఆల్‌రౌండర్‌గా అస్సలు అంగీకరించను.. భారత జట్టులో ఎలా అవకాశం వచ్చిందో?
మూడో వన్డే రద్దయినప్పటికీ ఐదు వన్డేల సిరీస్‌లో భారత్ 2-0తో ఆధిక్యంలో కొనసాగుతోంది. సిరీస్‌లో ఇంకా రెండు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. వీటిలో ఒక్క మ్యాచ్‌లో విజయం సాధించినా.. టీమిండియా సిరీస్‌ను కైవసం చేసుకుంటుంది. మరోవైపు సిరీస్‌పై ఆశలు నిలుపుకోవాలంటే న్యూజిలాండ్ మిగిలిన రెండు మ్యాచ్‌ల్లోనూ గెలవాల్సి ఉంటుంది. ప్రస్తుత టీమిండియా ఫామ్ చూస్తే.. సిరీస్ సొంతం అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇప్పటికే పొట్టి సిరీస్‌ను శ్రేయాస్ సేన గెలిచిన విషయం తెలిసిందే.
తాజావార్తలు
-
NZ vs IND 3rd ODI: హామిల్టన్‌లో వరుణుడి ఆట.. భారత్-న్యూజిలాండ్ మూడో వన్డే రద్దు!
-
Suresh Raina on Retirement: నన్ను ఎందుకు పక్కన పెట్టారో చెప్పలేదు.. కోహ్లీ, కోచ్‌పై రైనా ఆసక్తికర వ్యాఖ్యలు..!
-
JC Prabhakar Reddy: అనంతపురం అభివృద్ధికి మేయర్ పార్టీ మారాలి.. జేసీ ప్రభాకర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు!
-
Kaleshwaram Temple: భక్తులకు ముఖ్య గమనిక.. లక్షపత్రి పూజలు రద్దు, డిసెంబర్ 8 వరకు ప్రత్యేక పూజలు!
-
Kadem Project: ఫలించిన రైతుల పోరాటం.. 700 క్యూసెక్కుల నీరు విడుదల!
ట్రెండింగ్
-
IND vs NZ 3rd ODI: వర్షం మధ్యే టాస్.. న్యూజిలాండ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించిన భారత్.! 40 ఓవర్లకు కుదింపు..
-
IPL 2027: అతడిని ఆల్‌రౌండర్‌గా అస్సలు అంగీకరించను.. భారత జట్టులో ఎలా అవకాశం వచ్చిందో?
-
AFG vs ZIM: రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ 500+ పరుగులు.. చరిత్ర సృష్టించిన జింబాబ్వే..! అఫ్గానిస్థాన్‌తో మ్యాచ్ డ్రా..
-
India vs New Zealand 3rd ODI: భారత్, న్యూజిలాండ్ మూడో వన్డేపై వరుణుడి దెబ్బ.. మ్యాచ్ రద్దయ్యే ఛాన్స్..!
-
డ్యూయల్ 200MP కెమెరాలు, 7,050mAh+ బ్యాటరీతో Xiaomi 18 Pro సిరీస్ గ్లోబల్ లాంచ్ డేట్ ఫిక్స్..!