Cloud Kitchens: క్లౌడ్ కిచెన్లలో ఆర్డర్ పెట్టుకుంటున్నారా..? తనిఖీల్లో మొత్తం బొద్దింకలు, పురుగులే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ నగరంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు విస్తృత తనిఖీలు చేపట్టారు. నగరంలోని కోర్ ఏరియాలతో పాటు మాదాపూర్ వంటి ప్రముఖ ప్రాంతాలలో రాత్రింబవళ్ళు నడుస్తున్న క్లౌడ్ కిచెన్లపై అధికారులు ఏకకాలంలో దాడులు నిర్వహించారు. టీజీ సేఫ్ ఫుడ్ వింగ్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఏకంగా 25 ప్రత్యేక బృందాలతో ఈ ఆకస్మిక తనిఖీలను ముమ్మరం చేశారు. క్లౌడ్ కిచెన్లలో ఆహార భద్రతా ప్రమాణాలు పూర్తిగా గాలికి వదిలేశారని, కనీస శుభ్రత పాటించకుండా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని అధికారులు గుర్తించారు. తనిఖీలు జరిగిన చాలా చోట్ల దారుణమైన పరిస్థితులు వెలుగు చూశాయి.
కిచెన్లలో నిర్వహించిన సోదాల్లో అనేక విషయాలు బయటపడ్డాయి. ఏకంగా 15 బాక్సుల హానికరమైన ఫుడ్ కలర్స్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వంటకాల్లో విపరీతంగా రంగులను కలుపుతూ ప్రజల ఆరోగ్యానికి హాని కలిగిస్తున్నారు. అంతేకాకుండా, గడువు ముగిసిన సగ్గుబియ్యం, పురుగులు పట్టిన బొంబాయి రవ్వ వంటి నాసిరకం సరుకులను వంట తయారీకి వాడుతున్నట్లు తేలింది. ఆహారం తయారయ్యే వంట గదులు, నిల్వ ఉంచే గదుల్లో బొద్దింకలు, ఇతర కీటకాలు స్వేచ్ఛగా తిరుగుతుండటం అధికారులను సైతం విస్మయానికి గురిచేసింది. కూరగాయలు, ఇతర పదార్థాలు కట్ చేయడానికి ఆరోగ్యానికి హానికరమైన ప్లాస్టిక్ చాపింగ్ బోర్డులను యథేచ్ఛగా ఉపయోగిస్తున్నట్లు గుర్తించారు.
Also Read
ఈ దాడుల అనంతరం అధికారులు తక్షణ చర్యలు చేపట్టారు. నిబంధనలను తీవ్రంగా ఉల్లంఘించి, ప్రజారోగ్యానికి ముప్పుగా మారిన కొన్ని క్లౌడ్ కిచెన్ సెంటర్లను తక్షణమే మూసివేశారు. మరికొన్ని కేంద్రాలకు షోకాజ్ నోటీసులు జారీ చేయగా, లోపాలు సరిదిద్దుకోవాలని హెచ్చరిస్తూ ఇంప్రూవ్మెంట్ నోటీసులు అందజేశారు. ఆన్ లైన్ ఫ్లాట్‌ఫామ్‌లలో అందంగా కనిపించే ఈ కిచెన్ల వెనుక ఇంతటి అనారోగ్యకరమైన వాతావరణం ఉండటం నగరవాసులను ఆందోళనకు గురిచేస్తోంది. బయట దొరికే ఆహారాన్ని, ముఖ్యంగా క్లౌడ్ కిచెన్ల నుంచి ఆర్డర్ చేసే పదార్థాలను తినేటప్పుడు ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని, లేదంటే ఆరోగ్య సమస్యలు కొనితెచ్చుకున్నట్టేనని ఫుడ్ సేఫ్టీ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
తాజావార్తలు
-
Cloud Kitchens: క్లౌడ్ కిచెన్లలో ఆర్డర్ పెట్టుకుంటున్నారా..? తనిఖీల్లో మొత్తం బొద్దింకలు, పురుగులే..
-
Ramayana : ‘రామాయణ’ లీక్‌పై మేకర్స్ వార్నింగ్.. షేర్ చేస్తే జైలుకే!**
-
IVF Scam : ఐవీఎఫ్ సెంటర్ల అక్రమ దందాపై పోలీసుల ఉక్కుపాదం… 20 ఫెర్టిలిటీ సెంటర్లకు నోటీసులు!
-
Priya Bhavani Shankar : రహస్యంగా ఎగేజ్మేంట్ చేసుకున్న ఇరుముడి హీరోయిన్?
-
Yash : పిల్లలతో రావణాసురుడి గెటప్‌లో పిక్స్ షేర్ చేసిన యష్
ట్రెండింగ్
-
Jio Recharge: Buy 1 Get 1 ఆఫర్ తో ఈ రెండు ప్లాన్లపై డబుల్ బెనిఫిట్స్..!
-
BSNL నుంచి కొత్త రీఛార్జ్ ప్లాన్లు.. రూ.172, రూ.184, రూ.190లకే అన్లిమిటెడ్ కాలింగ్..!
-
గేర్లు మార్చాల్సిన అవసరం లేకుండానే సులువుగా రైడ్.. KTM 390 Super Duke GT Evo బైక్ లాంచ్‌కు సిద్ధం..!
-
IND vs NZ 3rd ODI: వర్షం మధ్యే టాస్.. న్యూజిలాండ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించిన భారత్.! 40 ఓవర్లకు కుదింపు..
-
IPL 2027: అతడిని ఆల్‌రౌండర్‌గా అస్సలు అంగీకరించను.. భారత జట్టులో ఎలా అవకాశం వచ్చిందో?