Workplace Trends: 9 టు 5 ఉద్యోగాలకు కాలం చెల్లిందా? నేటి యువత కోరుకుంటోంది ఇదేనా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Workplace Trends: ఉదయం తొమ్మిదికి బయోమెట్రిక్ వేయడం.. సాయంత్రం ఐదు గంటల దాకా కంప్యూటర్ స్క్రీన్ ముందు కూర్చోవడం.. నెలాఖరున అకౌంట్లో పడే శాలరీతో సర్దుకుపోవడం.. ఒకప్పుడు ఇదొక సేఫ్ లైఫ్. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయినట్లు కనిపిస్తోంది. ‘ఉద్యోగం కోసమే బతకడం ఏంటి బాస్.. బతకడానికే కదా ఉద్యోగం!’ అంటూ పాతకాలపు రూల్స్ బద్దలు కొడుతోంది నేటి జెన్ జెడ్ (Gen Z) తరం. కేవలం భారీ ప్యాకేజీలు మాత్రమే కాకుండా, తమకంటూ కాస్త స్పేస్, లైఫ్ ఇచ్చే ఉద్యోగాల వైపే నేటి యూత్ మొగ్గు చూపుతోంది.
ఆఫీస్ క్యాబిన్లలో రోజంతా బందీలుగా ఉండి, పర్సనల్ లైఫ్‌ను గాలికొదిలేసే ‘కార్పొరేట్ గ్రైండ్’కు నేటి తరం చెక్ పెడుతోంది. కెరీర్ ఎంత ముఖ్యమో.. ప్యాషన్స్, ట్రావెలింగ్, ఫ్రెండ్స్, ఫ్యామిలీ, వీకెండ్ చిల్ అంతే ముఖ్యమని బలంగా నమ్ముతోంది. అందుకే నిర్దిష్ట పని గంటలు కాకుండా, సౌలభ్యాన్ని ఇచ్చే వర్క్ కల్చర్‌కు పట్టం కడుతోంది. ప్రముఖ కన్సల్టింగ్ సంస్థ ‘డెలాయిట్’ తాజా సర్వే ప్రకారం నేటి తరం ఆలోచనలు ఇలా ఉన్నాయి..
Also Read
- Diwali Cleaning Tips: దీపావళి వేళ నూనె మరకలు జిడ్డుగా మారిపోయాయా? ఈ సింపుల్ చిట్కా చాలు..
- Potato Snacks: బండి మీద కంటే టేస్టీగా.. ఇంట్లోనే క్రిస్పీ ఆలూ పకోడీలు! తింటే వదిలిపెట్టరు..
- Kulfi Recipe: దీపావళికి మిగిలిపోయిన స్వీట్లతో టేస్టీ హోమ్మేడ్ కుల్ఫీ.. పిల్లలు ఎంతో ఇష్టంగా తినే సూపర్ రెసిపీ
- Quick Snacks: రాత్రి మిగిలిన చపాతీలతో పైసా ఖర్చు లేకుండా నోరూరించే టిఫిన్! ఇలా చేసేయండి..
* ఏకంగా 99% మంది భారతీయ జెన్ జెడ్, 98% మంది మిలీనియల్స్.. తాము చేసే పనిలో సంతృప్తితో పాటు ఒక పర్పస్ ఉండాలని కోరుకుంటున్నారు.
* ట్రాఫిక్‌లో గంటల తరబడి నలిగిపోవడం కంటే.. వర్క్ ఫ్రమ్ హోమ్, హైబ్రిడ్ మోడల్, ఫ్లెక్సిబుల్ పని వేళలకే ఫస్ట్ ప్రియారిటీ ఇస్తున్నారు.
* వీరి ప్రయారిటీ లిస్ట్‌లో ఆర్థిక స్వేచ్ఛతో పాటు ‘వర్క్-లైఫ్ బ్యాలెన్స్’ టాప్‌లో నిలిచింది.
స్మార్ట్ వర్క్.. అంతేగానీ సోమరితనం కాదు
ఫ్లెక్సిబిలిటీ కోరుకుంటున్నంత మాత్రాన నేటి యువత కష్టపడటం లేదనుకుంటే పొరపాటే. తమ నైపుణ్యాలను ఎప్పటికప్పుడు అప్‌గ్రేడ్ చేసుకోవడంలో, కొత్త టెక్నాలజీలు నేర్చుకోవడంలో వీరే ముందంజలో ఉన్నారని సర్వేలే చెబుతున్నాయి. అయితే, వీరి డిక్షనరీలో సక్సెస్ అంటే ఆరోగ్యాన్ని, మానసిక ప్రశాంతతను పణంగా పెట్టి పెద్ద హోదాలు సాధించడం కాదు, కెరీర్‌ను నిర్మిస్తూనే జీవితాన్ని నచ్చినట్లు జీవించడం. రెగ్యులర్ డెస్క్ జాబ్‌లు పూర్తిగా కనుమరుగు కాకపోవచ్చు. కానీ, ఉద్యోగుల వ్యక్తిగత జీవితాన్ని పట్టించుకోని కంపెనీలకు మాత్రం భవిష్యత్తులో మంచి టాలెంట్ దొరకడం కష్టమే అని అంటున్నారు. నేటి తరం ఉద్యోగాలను వదులుకోవడం లేదు.. పనిని తమ జీవితంలో ఒక భాగంగా మాత్రమే చూస్తోంది తప్ప, పనే జీవితం అనుకోవడానికి సిద్ధంగా లేదు.
తాజావార్తలు
-
Workplace Trends: 9 టు 5 ఉద్యోగాలకు కాలం చెల్లిందా? నేటి యువత కోరుకుంటోంది ఇదేనా!
-
CM Revanth Reddy : కేటీఆర్‌పై రేవంత్ ఫైర్.. పది జన్మలెత్తినా కాలేవంటూ..
-
Pakistan Tarbela Dam Accident: పాక్‌లో నిర్మాణంలో ఉన్న ఆనకట్ట కూలి భారీ వరదలు.. చైనా నిర్మాణ సంస్థపై ప్రశ్నలు..!
-
Diwali Cleaning Tips: దీపావళి వేళ నూనె మరకలు జిడ్డుగా మారిపోయాయా? ఈ సింపుల్ చిట్కా చాలు..
-
SBI: ప్రవాసులకు గుడ్ న్యూస్.. అమెరికాలో ఎస్బీఐ గ్రాండ్ ఎంట్రీ!
ట్రెండింగ్
-
7 అంగుళాల భారీ డిస్ప్లే, 10,000mAh కంటే ఎక్కువ బ్యాటరీతో రాబోతున్న iQOO Z12 సిరీస్..!
-
Varanasi Movie: ‘వారణాసి’లో టైమ్ ట్రావెల్ ట్విస్ట్.. కుంభకర్ణుడి పునర్జన్మగా ఆ పాత్ర?
-
Upcoming Smartphones: ఈ వారం లాంచ్ కానున్న కొత్త స్మార్ట్ఫోన్లు ఇవే.. 200MP కెమెరా, 8,000mAh బ్యాటరీతో Oppo Reno 17 సిరీస్..!
-
Airtel నుంచి ‘Buy 1 Get 1’ ఆఫర్.. ఆ ప్లాన్స్ తో ఒక్కసారి రీఛార్జ్ చేస్తే రెండుసార్లు ప్రయోజనం..!
-
Realme నుంచి పవర్ఫుల్ 5G ఫోన్లు.. 10,000mAh బ్యాటరీ, 200MP కెమెరాతో వచ్చేస్తున్న Realme 17 సిరీస్..!