OTR : కూటమి హవాలో ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలకు షాక్.. కృష్ణా జిల్లా ఫలితాల్లో ట్విస్ట్!
- గన్నవరం, పామర్రు ఎమ్మెల్యేలకు చేదు అనుభవాలు
- కృష్ణా జిల్లాలో 26 జడ్పీటీసీలు, కూటమి ఖాతాలో 24
- స్థానిక ఎమ్మెల్యేల తీరుతోనే రెండు సీట్లు పోయాయని చర్చ
- గన్నవరం జడ్పీటీసీని గెల్చుకున్న వైసీపీ, రాజకీయ ఉత్కంఠ
- కృష్ణా జిల్లాలో వైసీపీ గెల్చుకున్న ఒకే ఒక్క జడ్పీటీసీ గన్నవరం
- గన్నవరం రిజల్ట్ చూసి షాక్‌లో ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు?
- లోకల్ టీడీపీ సీనియర్స్‌తో యార్లగడ్డకు గ్యాప్ ఎఫెక్ట్?
- పామర్రు నియోజకవర్గం మొవ్వ జడ్పీటీసీగా ఇండిపెండెంట్ గెలుపు
- ఎమ్మెల్యే కుమార్‌రాజా సర్వశక్తులు ఒడ్డినా నన్నపనేని వీరేంద్ర విజయం
- ప్రచారంలో నన్నపనేని కులంపై ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు మైనస్?
- వీరేంద్రకు 6వేలకు పైగా మెజార్టీతో పామర్రు ఎమ్మెల్యే షాక్?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
OTR : కృష్ణా జిల్లాలో జడ్పిటిసి ఫలితాలు ఇద్దరు అధికార పార్టీ ఎమ్మెల్యేలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయట. కూటమి ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పరిషత్ ఎన్నికలు గన్నవరం, పామర్రు ఎమ్మెల్యేలకు చేదు అనుభవాన్నే మిగిల్చాయంటూ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కృష్ణా జిల్లాలో మొత్తం 26 జడ్పిటిసి స్థానాలు ఉండగా అందులో టిడిపి 19, జనసేన 4, బీజేపీ ఒక సీటు గెల్చుకున్నాయి. మొత్తంగా కూటమి 24 చోట్ల గెలిచింది. మిగతా రెండు స్థానాల్లో ఒకదాన్ని వైసీపీ, మరో సీటును ఇండిపెండెంట్ కైవసం చేసుకున్నారు. దీంతో ఈ రెండు స్థానాల గురించే ఇప్పుడు జిల్లా పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్ హాట్ చర్చలు జరిగిపోతున్నాయి. ఇంత కూటమి హవాలో కూడా ఈ రెండు చోట్ల ఎదురుగాలి వీచి వైసిపి, ఇండిపెండెంట్ గెలవడం వెనక ఏం జరిగి ఉంటుందంటూ ఆసక్తికరంగా మాట్లాడుకుంటున్నారు. ప్రధానంగా స్థానిక ఎమ్మెల్యేల తీరుతోనే…. జిల్లా మొత్తం మీద ఈ రెండు స్థానాలు కోల్పోయామన్నది కూటమి వర్గాల అభిప్రాయంగా తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పుడూ తీవ్ర పొలిటికల్ హీట్ పుట్టించే గన్నవరం జడ్పిటిసిని వైసిపి కైవసం చేసుకోవడం ఇప్పుడు రాజకీయ ఉత్కంఠ రేపుతోంది. కృష్ణా జిల్లా మొత్తం మీద వైసీపీ గెల్చుకున్నది ఒకే ఒక్క సీటు, అదీకూడా గన్నవరం కావడంతో పొలిటికల్ ఇంట్రస్ట్ ఇంకా పెరుగుతోందంటున్నారు.
మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఆధ్వర్యంలో జెడ్పిటిసిగా వైసీపీ బీసీ అభ్యర్థి అనగాని రవి విజయం సాధించారు. కూటమి పొత్తులో భాగంగా ఈ స్థానం బీజేపీ కోటాలోకి వెళ్ళింది. దాంతో… కుమారస్వామి ఇక్కడి నుంచి కమలం గుర్తు మీద పోటీ చేసి ఓడిపోయారు. 63 ఓట్ల మెజార్టీతో వైసిపి అభ్యర్థి విజయం సాధించగా… కౌంటింగ్ ఫలితాన్ని వెంటనే ప్రకటించకుండా… దాదాపు ఐదు గంటల హైడ్రామా నడిచింది. ఆ తర్వాత వైసిపి గెలిచినట్లు ప్రకటించారు అధికారులు. ఆ సమయంలో గన్నవరంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఇక్కడ గెలుపును పార్టీతో పాటు యార్లగడ్డ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు . కానీ… ఫైనల్ రిజల్ట్ వైసీపీది కావడంతో… ఎమ్మెల్యే యార్లగడ్డ షాకైనట్టు తెలుస్తోంది. అయితే…. లోకల్ టిడిపిలో ఉన్న వర్గ పోరే ఇక్కడ వైసిపికి అడ్వాంటేజ్ అయిందన్న విశ్లేషణలు కూడా ఉన్నాయి. కొందరు సీనియర్ నేతలతో యార్లగడ్డ వెంకట్రావుకు గ్యాప్ ఉందని, దాని ప్రభావం ఫలితంపై పడిందన్న చర్చ జరుగుతోంది. నిత్యం మాజీ ఎమ్మెల్యే వంశీపై నిప్పులు చెరిగే వెంకటరావుకు జడ్పిటిసి ఓటమి గట్టి షాక్ ఇచ్చిందన్నది లోకల్ టాక్.
Also Read
- Off The Record: విజయనగరం మేయర్ విషయంలో కోలగట్ల తడబాటు.. అతి విశ్వాసంతో మొదటికే మోసం..!
- Off The Record : ఆదిలాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ పై కౌన్సిలర్స్ అసంతృప్తి..!!
- Off The Record: గులాబీ పార్టీకి Vitamin-M లోపం వచ్చిందా ? అందుకే ఆ మీటింగ్స్ రద్దయ్యాయా
- Off The Record: నెల్లూరు జడ్పీ పీఠంపై టీడీపీలో అసంతృప్త రాగాలు.. అన్నీ వాళ్ళ కోటాకేనా అంటూ అసహనం
ఇక పామర్రు టిడిపి ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజాకు కూడా మొవ్వ జడ్పిటిసి షాకిచ్చింది. ఇక్కడ ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన టిడిపి రెబెల్ నన్నపనేని వీరేంద్ర గెలిచారు. మొవ్వ జడ్పిటిసిని పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించారు. దీంతో ఇక్కడి నుంచి పామర్రు జనసేన ఇంచార్జ్ తాడిశెట్టి నరేష్ పోటీ చేశారు. కానీ… నన్నపనేని వీరేంద్ర స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగటంతో ఎమ్మెల్యే సర్వశక్తులు ఒడ్డి… కూటమి అభ్యర్థి గెలవడం కోసం పనిచేసినా… ఫలితం మాత్రం ఆయనకు షాక్ కొట్టేలా చేసిందని మాట్లాడుకుంటున్నారు. ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే కుమార్ రాజా… కులాల ప్రస్తావన తీసుకువచ్చి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. టిడిపి రెబల్ అభ్యర్థిగా బరిలోకి దిగిన నన్నపనేని వీరేంద్రను ఓడించట కోసం చేసిన వ్యాఖ్యలు వికటించి చివరికి ఎమ్మెల్యే సారీ చెప్పుకోవాల్సి వచ్చిందట. వీరేంద్రతో ముందే నామినేషన్ ఉపసంహరింపచేయలేకపోవడం, ఆ తర్వాత కులాల వ్యాఖ్యలు కలిసి ఎమ్మెల్యేని డిఫెన్స్‌లో పడేశాయని అంటున్నారు. 6వేలకు పైగా మెజార్టీతో వీరేంద్ర గెలవడంతో ఎమ్మెల్యే వర్గం అవాక్కయిందట. జిల్లాలో ఈ రెండు జడ్పిటిసి స్థానాల్లో పరాజయం పాలవడంతో… ఈ ఇద్దరు ఎమ్మెల్యేలను ఉద్దేశించి ఇప్పుడో పాపులర్ సినిమా డైలాగ్‌ని గుర్తు చేసుకుంటున్నారు స్థానికంగా. పోయిందిగా…. మొత్తం పరువంతా పోయిందిగా అంటూ సెటైర్స్ పడుతున్నాయి పొలిటికల్ సర్కిల్స్‌లో.
తాజావార్తలు
-
OTR : కూటమి హవాలో ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలకు షాక్.. కృష్ణా జిల్లా ఫలితాల్లో ట్విస్ట్!
-
Lakdikapul One Way :హైదరాబాద్‌లో మరో వన్ వే.. లక్డీకాపూల్‌లో 22న ప్రయోగాత్మక అమలు..
-
Drug Racket: హైదరాబాద్‌లో విదేశీ యువతి డ్రగ్స్, వ్యభిచార రాకెట్ రట్టు..
-
Global Box Office: చిన్న బడ్జెట్.. పెద్ద దెబ్బ! ‘రామాయణ’ను దాటేసిన జపనీస్ రాక్షసుడు..
-
DNK Trailer : ఆన్లైన్ బెట్టింగ్ పిచ్చితో దొంగగా మారిన మౌళి
ట్రెండింగ్
-
7 అంగుళాల భారీ డిస్ప్లే, 10,000mAh కంటే ఎక్కువ బ్యాటరీతో రాబోతున్న iQOO Z12 సిరీస్..!
-
Varanasi Movie: ‘వారణాసి’లో టైమ్ ట్రావెల్ ట్విస్ట్.. కుంభకర్ణుడి పునర్జన్మగా ఆ పాత్ర?
-
Upcoming Smartphones: ఈ వారం లాంచ్ కానున్న కొత్త స్మార్ట్ఫోన్లు ఇవే.. 200MP కెమెరా, 8,000mAh బ్యాటరీతో Oppo Reno 17 సిరీస్..!
-
Airtel నుంచి ‘Buy 1 Get 1’ ఆఫర్.. ఆ ప్లాన్స్ తో ఒక్కసారి రీఛార్జ్ చేస్తే రెండుసార్లు ప్రయోజనం..!
-
Realme నుంచి పవర్ఫుల్ 5G ఫోన్లు.. 10,000mAh బ్యాటరీ, 200MP కెమెరాతో వచ్చేస్తున్న Realme 17 సిరీస్..!