Airtel నుంచి ‘Buy 1 Get 1’ ఆఫర్.. ఆ ప్లాన్స్ తో ఒక్కసారి రీఛార్జ్ చేస్తే రెండుసార్లు ప్రయోజనం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Airtel Buy 1 Get 1: ఎయిర్టెల్ (Airtel) తన ప్రీపెయిడ్ వినియోగదారులకు అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది. రూ.349, రూ.399 రీఛార్జ్ ప్లాన్లపై Buy 1 Get 1 Free ఆఫర్‌ను అందిస్తోంది. అంటే ఒకసారి రీఛార్జ్ చేస్తే అదే ప్లాన్‌పై మరో రీఛార్జ్ ఉచితంగా పొందవచ్చు. అయితే ఈ ఆఫర్ పరిమిత కాలం పాటు మాత్రమే అందుబాటులో ఉండనుంది. అయితే, ప్రస్తుతం ఎంపిక చేసిన కొంతమంది వినియోగదారులకు మాత్రమే ఈ అవకాశం కల్పిస్తోంది.
ఈ ఆఫర్లో భాగంగా Airtel రూ.349 ప్లాన్‌ను రీఛార్జ్ చేసుకుంటే మరో రూ.349 రీఛార్జ్ ఉచితంగా లభిస్తుంది. ఈ ప్లాన్‌లో రోజుకు 2GB డేటాతో పాటు ఎయిర్టెల్ 5G నెట్వర్క్ అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో అన్లిమిటెడ్ 5G డేటా పొందవచ్చు. అలాగే అన్లిమిటెడ్ లోకల్, STD కాల్స్, రోజుకు 100 SMSలు అందిస్తుంది. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులు కాగా, ఉచిత రీఛార్జ్‌తో కలిపి మొత్తం 56 రోజుల సేవలు పొందే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఈ ప్లాన్‌తో 12 నెలల Adobe Express Premium సబ్స్క్రిప్షన్, ఉచిత హలో ట్యూన్స్, ఎయిర్టెల్ సేఫ్ ప్రయోజనాలు కూడా లభిస్తాయి. దీని ద్వారా స్పామ్ కాల్ అలర్ట్స్, మోసపూరిత లింకుల బ్లాకింగ్, OTP స్కామ్‌లపై AI ఆధారిత హెచ్చరికలు అందిస్తారు.
Also Read
- Realme నుంచి పవర్ఫుల్ 5G ఫోన్లు.. 10,000mAh బ్యాటరీ, 200MP కెమెరాతో వచ్చేస్తున్న Realme 17 సిరీస్..!
- Jio Diwali Offer: జియో దీపావళి ధమాకా.. ఒక్క మిస్డ్ కాల్‌తో 5 నెలలు ఫ్రీ వై-ఫై, ఓటీటీలు ఉచితం!
- అత్యంత చవకగా iPhone 18e .. ప్రో మోడల్స్ కంటే తక్కువ ధరకే ఎంట్రీ!
- Vivo Y6k: వివో Y6k 5G స్మార్ట్‌ఫోన్.. 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే, IP65 రేటింగ్‌తో లాంచ్!
ఇక రూ.399 ప్లాన్ విషయానికి వస్తే.. ఇందులో అన్లిమిటెడ్ 4G, 5G డేటా అందిస్తున్నారు. ఇందులో రోజువారీ డేటా పరిమితి ఉండదు. 5G స్మార్ట్‌ఫోన్ మాత్రమే కాకుండా 4G హ్యాండ్సెట్లలోనూ అన్లిమిటెడ్ 4G డేటాను ఉపయోగించుకోవచ్చు. అన్లిమిటెడ్ లోకల్, STD కాల్స్, రోజుకు 100 SMSలు, 12 నెలల Adobe Express Premium సబ్స్క్రిప్షన్ లభిస్తాయి. ఈ ప్లాన్‌పై కూడా Buy 1 Get 1 Free ఆఫర్ వర్తిస్తే మొత్తం 56 రోజుల వ్యాలిడిటీ పొందవచ్చు.

కాకపోతే ఈ ఆఫర్ అందరికీ అందుబాటులో లేదు. అర్హత ఉందో లేదో తెలుసుకోవడానికి ముందుగా “Airtel Thanks” యాప్‌ను ఓపెన్ చేసి రూ.349 లేదా రూ.399 ప్లాన్‌ను చెక్ చేయాలి. అక్కడ ‘1+1 Recharge Free’ అనే ట్యాగ్ కనిపిస్తేనే ఈ ఆఫర్ మీ నంబర్‌కు వర్తిస్తుంది. రీఛార్జ్ చేసే ముందు యాప్‌లోని ఆఫర్ నిబంధనలు, ఉచిత రీఛార్జ్ యాక్టివేషన్ వివరాలను పరిశీలించడం మంచిది. ఎయిర్టెల్ ఈ ఉచిత రీఛార్జ్ ఎలా క్రెడిట్ అవుతుందనే విషయంపై ఇంకా అధికారికంగా పూర్తి వివరాలు వెల్లడించలేదు.
తాజావార్తలు
-
Airtel నుంచి ‘Buy 1 Get 1’ ఆఫర్.. ఆ ప్లాన్స్ తో ఒక్కసారి రీఛార్జ్ చేస్తే రెండుసార్లు ప్రయోజనం..!
-
Pete Hegseth: ‘పీట్ హెగ్సెత్ దిగిపోవాల్సిందే’.. ట్రంప్ ప్రభుత్వానికి డెమోక్రాట్ల షాక్.. అభిశంసనకు సిద్ధం!
-
IND vs NZ 3rd ODI: అక్షర్ పటేల్ ఎందుకు.. అతడే సరైనోడు.. మూడో వన్డేలో ఛాన్స్ ఇవ్వండి!
-
Realme నుంచి పవర్ఫుల్ 5G ఫోన్లు.. 10,000mAh బ్యాటరీ, 200MP కెమెరాతో వచ్చేస్తున్న Realme 17 సిరీస్..!
-
Sonia Gandhi: ‘ఇది పొలిటికల్ బుక్ కాదు’.. తన కొత్త పుస్తకం ‘Belonging’పై సోనియా గాంధీ కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
IPL 2027: టీమిండియా పవర్ హిట్టర్‌పై కన్ను.. గుజరాత్ టైటాన్స్‌ది పెద్ద ప్లానే!
-
IPL 2027 Trade: డీల్ క్లోజ్.. పంజాబ్ కింగ్స్‌కు హార్దిక్ పాండ్యా.. మ్యాచ్ విన్నర్‌ను వదులుకున్న ప్రీతి జింటా!
-
Diwali 2026: అమావాస్య ఎప్పుడొస్తుంది? దీపావళి లక్ష్మీ పూజకు శుభ ముహూర్తం, పూజా విధానం, పూర్తి వివరాలు ఇవే..
-
Diwali Tips: మట్టి ప్రమిదల్లో నూనె త్వరగా అయిపోతోందా? ఈ చిన్న చిట్కాలు పాటించండి..
-
Indian Pacers Dominance: భారత పేసర్ల దెబ్బకు విలవిల.. 25 ఏళ్ల తర్వాత చెత్త రికార్డు మూటగట్టుకున్న న్యూజిలాండ్..!